*క్రైస్తవుని*
*FRIENDSHIP DAY*....
*ఆహా ఈ మాట వింటేనే మనస్సు పులకరించిపోతుంది*
మనిషికి ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అనేవారు ఇంకొక ప్రాణం ఐపోయారు
*నీకు ప్రాణం కావాలా?? నీ ఫ్రెండ్ కావాలా అని అడిగితే నాకు నా స్నేహితుడే కావాలి అని చెప్పేటువంటి ప్రేమ మనకు మన ఫ్రెండ్స్ మీద ఉంది చాలా సంతోషం*
*#FRIENDSHIP DAY#* రోజున మనకిష్టమైన ఫ్రెండ్స్ కి శుభాకాంక్షలు చెప్తాము
*వారికి ఏమి ఇష్టమో అది బహుమతిగా ఇచ్చి మన ఫ్రెండ్ మీద మనకెంత ప్రేమవుందో చూపిస్తాము*.
కానీ
*అందరికంటే ఎక్కువైన స్నేహితుడు మనకి ఒకరు వున్నారు*
*మనతోనే 24 గంటలు, 365 రోజులు ప్రతి క్షణం మనలను కాపాడుతూ, మనకు ఏమి కావాలో అవి ఇస్తూ, ప్రమాధములు, మరణములు, చిక్కులు, నుంచి తప్పిస్తున్న గొప్ప ఫ్రెండ్ మనకి వున్నాడు*
*ఆయనే సృష్టికర్త, రక్షణకర్త, త్వరలో మధ్యకాశములోకి పెండ్లికుమారుడుగా రానై యున్న యేసుక్రీస్తు ప్రభువు*
ఈరోజున మనము, మన స్నేహితులు బ్రతికి ఉండి స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే కారణం *యేసు ప్రభువే*.
*అటువంటి గొప్ప స్నేహితుడికి స్నేహితుల రోజు శుభాకాంక్షలు చెప్పారా????*
*ఆయనకి ఇష్టమైనవి బహుమానముగా ఇచ్చారా????*.
గొప్పోడివి దేవునికి ఎలా శుభాకాంక్షలు చెప్తాము???
ఎలా బహుమతులు ఇస్తాము అని అనుకుంటున్నారా????
మత్తయి సువార్త 25:35,36
*నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;*
*దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరి*
ఫ్రెండ్స్ ప్రభువుకి నీతిమంతులు సహాయము చేశారు
ఎలాగు చేశారు అని మిరనుకుంటున్నారు????
మత్తయి సువార్త 25:40
*అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను*
*అల్పులైన సహోదారులకు, అన్నం లేనివారికి, వస్త్రాలు లేనివారికి, హాస్పిటల్ లో ఉన్నవారికి సహయము చేస్తే దేవునికి చేసినట్టే*
*దేవునికి బహుమతి ఇచ్చినట్టే*
*ఫ్రెండ్స్ మనం స్నేహితుల దినోత్సవం అని రకరకాలుగా డబ్బులు ఖర్చు పెడతాం*
కానీ దేవుడు చెప్పినట్టు బీదలకు ఖర్చుపెడితే మన స్నేహితుడైన దేవుడు ఎంత సంతోషిస్తారో కదా ఫ్రెండ్స్
ఈరోజున ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ లకు వెళ్లి మంచి మంచి విందు బోజనము చేస్తాము
కానీ దేవుడేమన్నారు????
లూకా సువార్త 14:13,14
అయితే *నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము.*
*నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.*
ఆహా ఎంత గొప్పమాట
మనం రోజూ సమృద్ధిగా ఆహారము తింటాము కానీ ఆహారము లేక ఆకలితో చనిపోయేవారు చాలా మంది ఉంటారు *(మొన్న ఢిల్లీ లో ముగ్గురు పిల్లలు ఆకలితో చనిపోయారు*) వారికి స్నేహితులతో కలిసి భోజనం పెడితే ఎంత బాగుంటుందో కధ ఫ్రెండ్స్
*మన దేవునికి కూడా మంచి బహుమతి ఇచ్చినట్టు ఉంటుంది*
దేవునికి ఇష్టమైన ఇలాంటి పనులు చేస్తే దేవునికి మనం బెస్ట్ ఫ్రెండ్స్ ఐపోతాము
*క్రైస్తవులమైన మనము మంచిలో అందరికి మాదిరిగా ఉండాలి*
*అందరికి నేర్పించే వారముగా ఉండాలి*
*అందరూ దేవునిని మెచ్చుకునేలా మన పనులు ఉండాలి*
బైబిలు లో దేవుడు బీదవారికి సహాయము చేయండి, వారిని ఆదుకోండి అని చాలా చోట్ల చెప్పారు కానీ *ఈరోజుల్లో క్రైస్తవులకు ఆ మాటలు కనిపించటంలేదు ఇది చాలా గొప్ప దౌర్భాగ్యం*
బీదలకి, దిక్కులేనివారికి సహాయము చేస్తే నాకేంటి లాభం అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు వారికోసం దేవుడు బైబిలు లో చక్కటి మాట వ్రాయించారు
యాకోబు 1:27
*తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.*
బీదలకు, అనాధాలకు, విధవారాండ్రకు సహాయము చేస్తే దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి చేసినట్టు
*అటువంటి వారే పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటారు*
*గమనిక*
మన ఆపదలో దేవుడు తప్పించాలి అంటే బీదలకు సహాయము చేసి తీరాల్సిందే
కీర్తనల గ్రంథము 41:1
*బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.*
*#మరనాత#* 1కోరింది 16:22
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి