ప్రకటన గ్రంథములో ఇద్దరు సాక్ష్యులు: 🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు. ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ముచేసి జయించి వారిని చంపును. ప్రకటన 11:3-7 దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగియున్నాడు. దానిలో భాగంగా సంఘము ఎత్తబడిన తర్వాత ఇద్దరు సాక్ష్యులను పరలోకం నుండి భూమి మీదకు పంపించబోతున్నాడు. ఇశ్రాయేలీయులపట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఎందుకు? పక్షపాతమా? కాన...