ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పరిశుద్ధ గ్రంధమును ఎందుకు ధ్యానించాలి?

*పరిశుద్ధ గ్రంధమును ఎందుకు ధ్యానించాలి? *
▫️🗡———————————

▫️పరిశుద్ధ గ్రంధమును ఎందుకు ధ్యానించాలంటే? 

🔅మన నడతను (ప్రవర్తన) సరిచేస్తుంది: 

"యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?"  కీర్తనలు 119:9

హృదయం నిండిన దానినిబట్టే మన మాటలు, తలంపులు, క్రియలు ఆధారపడి వుంటాయి. అందుచే మొట్టమొదటగా మన హృదయం సరిచేయబడాలి. మన హృదయం సరిచేయబడాలి అంటే? పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించాలి. 

ఎందుకంటే? దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది. (హెబ్రీ  4:12)

🔅దేవుని వాక్యము మనలను పాపము చెయ్యకుండా అడ్డగిస్తుంది 

" నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను." (కీర్తనలు 119:11)

🔅దేవుని వాక్యము మనకు సంతోషాన్నిచ్చి, ఆలోచన పుట్టిస్తాయి. 

"నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి." (కీర్తనలు 119:24)

నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నకు ఆనందమును కలుగజేయుచున్నవి. (యిర్మియా 15:16)

🔅దేవుని వాక్యము దేవుడంటే భయమును కలిగిస్తుంది. 

దేవునికి ఎప్పుడు భయపడతామంటే? ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలిసినప్పుడు. ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలియాలంటే? పరిశుద్ధ గ్రంధాన్ని ద్యానించాలి. నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది" (కీర్తనలు 119:38)

దేవునికి భయపడేవాడు ఆయన ఏది అడిగినా ఇచ్చేస్తాడు. అబ్రాహామును పరీక్షించడానికి కుమారుని అడిగాడుగాని, నిన్నయితే, నీ హృదయాన్ని తప్ప మరి దేనిని అడగడు. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందు వలన నాకు కనబడు చున్నదనెను. (ఆది 22:12)

🔅దేవుని వాక్యము మనకు నెమ్మదినిచ్చి, జీవింపజేస్తుంది. 

జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు సర్వ సాధారణం. కొన్ని సందర్భాలలో అవి తారా స్థాయికి చేరుతాయి. ఎందుకీ జీవితం అనే ప్రశ్నను లేవనెత్తుతాయి. మరణమే శరణ్యం అనే పరిస్థితులను సహితం సృష్టిస్తాయి. అట్లాంటి పరిస్థితులలో ఒక్క చిన్న దేవునిమాట మన భాధలలో నెమ్మది, ఊరట, ఆదరణ కలిగిస్తుంది. జీవితం మీద ఆశను రేకెత్తిస్తుంది. జీవింపజేస్తుంది. 

"నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది."
 (కీర్తనలు 119:50)

🔅దేవుని వాక్యము జ్ఞానమును అనుగ్రహిస్తుంది.

a. శత్రువులకు మించిన జ్ఞానం:
మన ప్రధాన శత్రువు సాతానే. వాడు యుక్తి గలవాడు. 

దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను (ఆది 3:1) వాడి యుక్తి నుండి తప్పించబడాలంటే? వాడికి మించిన జ్ఞానం కావాలి. అది ఎట్లా లభిస్తుంది? దేవుని వాక్యం ధ్యానించడం ద్వారానే. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి. (కీర్తనలు 119:98)

b. బోధకులకు మించిన జ్ఞానం:

నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు. (కీర్తనలు 119:99)

c. వృద్ధులకు మించిన జ్ఞానం. 

వృద్ధులు వారి అనుభవాల ద్వారా చాలా జ్ఞానాన్ని సంపాదిస్తారు. కాని, దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా వారికి మించిన జ్ఞానమును పొందుకోగలము. 

నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు. (కీర్తనలు 119:100)

🔅దేవుని వాక్యము జుంటే తేనే ధారలకన్నా మధురమైనది. 

అవును! ఈ లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ పరిశుద్ధ గ్రంధానికి సాటిరావు. 

నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి. (కీర్తనలు 119:103)

🔅దేవుని వాక్యం త్రోవచూపించే మార్గదర్శి. 

నీవు చేరవలసిన గమ్యం తప్పక చేర్చుతుంది. సందేహం లేనేలేదు. అది కారు చీకటి అయినా సరే. నీ కాలు జారకుండా నడిపిస్తుంది. గమ్యం చేరేవరకు. 
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. (కీర్తనలు 119:105)

🔅దేవుని వాక్యము పాపము అనే అంధకారంలో వున్నవారికి వెలుగును, తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుంది. 

"నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును" (కీర్తనలు 119:130)

🔅దేవుని వాక్యము పాపము మనలను ఏలుబడి చేయకుండా, పాపము వైపు మన అడుగులు వేయకుండా అది మనలను స్థిర పరస్తుంది.

"నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము." (కీర్తనలు 119:133)

🔅దేవుని వాక్యం వలన ఒక విశ్వాసి తీవ్రమైన భాద, సంతోషం రెండు ఏక కాలంలో అనుభవించ గలడు.   

"శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయు చున్నవి" (కీర్తనలు 119:143)

🔅దేవుని వాక్యాన్ని ప్రేమించేవారికి నెమ్మది కలుగుతుంది. వారి అడుగులు జారిపోకుండా అది వారిని కాపాడుతుంది. 

"నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు" (కీర్తనలు 119:165)

ఇట్లాంటి దివ్య గ్రంధాన్ని ధ్యానిస్తున్నావా? 
లేకపొతే? నేటి నుండే ప్రారంభించు. నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...