ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలారా,*ముందు క్రింది విషయాలు ఆలోచించండి.మీరలా ఉండటం మీకు ఇష్టమైతే పెండ్లి చేసుకోండి.అనవసరంగా మీరు ఇబ్బందిపడి,ఎదుటివారిని ఇబ్బంది పెట్టి,దేవుని నామానికి అవమానం తేవడమెందుకు చెప్పండి?

*పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలారా,* ముందు క్రింది విషయాలు ఆలోచించండి. మీరలా ఉండటం మీకు ఇష్టమైతే పెండ్లి చేసుకోండి. అనవసరంగా మీరు ఇబ్బందిపడి, ఎదుటివారిని ఇబ్బంది పెట్టి, దేవుని నామానికి అవమానం తేవడమెందుకు చెప్పండి? 1.శారా వలె భర్తను గౌరవించాలి. 2.రిబ్కా వలె పరిచర్య చేయాలి. 3.లేయా వలె ఓర్పు కలిగి ఉండాలి. 4.హెబ్రీ స్త్రీలవలె ఆత్మీయతలో   చురుకుదనం కలిగియుండాలి. 5.యెఫ్తా కుమార్తె వలె సమర్పణ కలిగి ఉండాలి. 6. దెబోరా వలె కుటుంబములో,సంఘములో తల్లి వలె ఉండాలి. 7.రూతూ వలె అత్తను హత్తుకొని ఉండాలి. 8.హన్నావలె ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. 9.యాయేలు వలె ధైర్యంగా ఉండాలి. 10షూనేమియురాలివలె దైవజనులకు ఆతిధ్యం ఇవ్వాలి. 11.ఎస్తేరు వలె అందరి దయను సంపాదించుకోవాలి. 12.గుణవతియైన భార్యవలె కుటుంబమును  క్రమశిక్షణతో నడిపించాలి. 13.ఎలీసబెతు వలె అన్ని విషయాలలో భర్తతో కలిసి నడవాలి. 14.మరియ వలె ప్రభువు పాదాలయొద్ద నేర్చుకోవాలి. 15.ఫీబే వలె సంఘములో పరిచర్య చెయ్యాలి. 16.ప్రిస్కిల్ల వలె వాక్య జ్ఞానం కలిగి వుండాలి. 17.మరియవలె క్రీస్తు సువార్తను ప్రకటించాలి. 18.సలోమీ వలె ఆత్మీయమై ఉన్నతిని కోరుకోవాలి. 19.పె...

క్రీస్తు_శాస్త్రము_పార్ట్-3

#క్రీస్తు_శాస్త్రము_పార్ట్-3 ""కుమారుని యొక్క నామములు"" ఈ అధ్యాయం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం యేసుప్రభువును దేవునిగా, మనవునిగా, మెస్సయ్యగా, రక్షకునిగా ప్రత్యక్షపరచడానికి వ్రాయబడినది. ఈ నాలుగు విషయాలలో యేసయ్య యొక్క గుణ లక్షణములను, కార్యములను, వైఖరులను అర్థం చేసుకోవడానికి ఈ పేర్లు మనకు ఉపయోగపడతాయి. ""1. దేవునిగా"" 1. సర్వాధికారి - ప్రకటన 1:8. 2. అల్ఫా ఒమెగా - ప్రకటన 1:8-11 3. మహావృద్ధుడు - దానియేలు 7:22 4. యెహోవాదూత - ఆదికాండము 16:9 5. దూత - ఆదికాండము 48:16 6. సన్నిధిదూత - యెషయా 63:9 7. యెహోవా బాహువు - ప్రకటన 1:8-11 8. ఆదియును అంతమును - ప్రకటన 1:8 - 11 9. సృష్టికి ఆది ప్రకటన 3 :14 10. అద్వితీయ కుమారుడు - యెహాను 1:14 11. ఆత్మలకాపరి, అధ్యక్షుడు 1 పేతురు 5:4 12. శ్రీమంతుడు - 1 తిమోతి 6:15 13. దేవుని మహిమ యొక్క తేజస్సు - హెబ్రీ పత్రిక 1:3 14. యెహోవా సేనాధిపతి - యెహోషువ 5:14 15. దేవుని క్రీస్తు - లూకా 9:20 17. దేవుని జ్ఞానము - 1 కొరింథీ 1:24 18. పరమాత్మ కుమారుడైన క్రీస్తు - మార్కు 14:61 19. ఇమ్మానుయేలు - మత్తయి 1:23 20. దేవుని తత్వము యొక్క మూర్తి - హెబ్రీ ...

క్రీస్తు_శాస్త్రము_పార్ట్-2

"#క్రీస్తు_శాస్త్రము_పార్ట్-2 దైవ కృత్యాలు (Divine Offices): #దేవుడు_మాత్రమే_చేయగలిగే_కార్యములు 1. సృష్టించుట (Creation): యేసు ప్రభువు సృష్టికర్త.  సృష్టించబడిన వ్యక్తి సృష్టి చేయలేడు.  (హెబ్రీ 1:10; యోహాను 1:3; కొలస్సీ1:16).  దేవుని కుమారుడే నిత్య వాక్యము. ఆయనే సృష్టికర్త. 2.పాపక్షమాపణ (Forgiveness) : యేసుక్రీస్తు ప్రభువు పక్షవాయువుగలవాన్ని బాగు చేసినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయని వానితో చెప్పాడు. అప్పుడు అక్కడున్నవారు దేవుడు ఒక్కడే గదా పాపాలు క్షమించగల సమర్ధుడు, ఈయన దేవదూషణ చేస్తున్నాడని సణుగుకొనిరి. అప్పుడు ప్రభువు తనకు పాపాలను క్షమించే అధికారం ఉంది అని నిక్కచ్చిగా చెప్పారు.  (మార్కు 2:5-10; లూకా 7:48; ప్రకటన 1:6). 3. నిర్వాహకుడు (Administrator) : దేవుడు సృష్టికర్త మాత్రమే కాదుకాని, సృష్టిని భద్రపరిచి, సంరక్షించి, పోషించి, నిర్వహిస్తున్నవాడు (హెబ్రీ 1:2-4).  యేసుక్రీస్తు తన మహత్తుగల మాటచేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. 4. నిత్యజీవ ప్రదాత (Life giver ) : దేవుడు నిత్యుడు. ఆయనలోని జీవం నిత్యం నిలిచేది. మానవులకు ఆయన నిత్యజీవాన్ని ప్రసాదిస్తాడు. (యోహాను 10:28; య...

చంద్రుడిపైకి తీసుకెళ్ళినా మొట్టమొదటి బైబిల్

*చంద్రుడిపైకి తీసుకెళ్లినా మొట్టమొదటి బైబిల్* 🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔻🔻 🔻భూమిపైనే కాదు అంతరిక్షంలో చంద్రుడి పై కూడా విద్యుత్ బల్బ్ వెలుగులో చూడబడి చదవబడిన మొట్టమొదటి గ్రంధం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ మాత్రమే అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది... 🔻ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) పరిశుద్ధ గ్రంధాన్ని (The Holy Bible) ఫిబ్రవరి 1971 అపోలో మిషన్ 14 (NASA's February 1971 Apollo 14 mission) ద్వారా【1×1inch (2.5/2.5.Cm)】ఇంచ్ పరిమాణం గల మూడువందల (300 Bible's) బైబిల్స్ ని అంతరిక్షం (Space) లోకి పంపించారు... 🔻అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బైబిల్స్ అతి సూక్ష్మమైన ఛాయాగ్రహణా (Microfilm) లో 1,245 పేజీలు మరియు 773,746 పదాల నిడివి (Length) తో ఒక్కో బైబిల్ ని ముద్రించి అలా 300ల బైబిల్స్ ని , మహోన్నతుడైన మహా దేవుని కృపతో చంద్రుడిపై నడిచిన అస్ట్రోనాట్ ఎడ్గర్ మిచెల్ (Edgar Mitchell) కృషి వలన అపోలో ప్రేయర్ లీగ్ ( Apollo Prayer League ) సహకారంతో అంతరిక్షంలోకి తీసుకువెళ్లడం జరిగింది... 🔻అలాగే నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో నమ్మకమైన క్రీస్తు విశ్వా...

రెండవ క్రూరమృగము(అబద్ధ ప్రవక్త )

రెండవ క్రూరమృగము(అబద్ధ ప్రవక్త ) 🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడు చుండెను; అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధి కారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరై...

క్రూరమృగము పార్ట్.2

క్రూరమృగము  పార్ట్.2 🎯🎯🎯🎯🎯🎯🎯🎯 అయితే, ప్రకటన గ్రంధములో ఈ క్రూరమృగమును గురించిన మరికొంత సమాచారాన్ని తెలుసుకోగలం.  * పది కొమ్ములు * ఏడు తలలు * దాని కొమ్ములమీద పది కిరీటములు * దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లు * ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. * దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి * దాని నోరు సింహపునోరు వంటిది * దానికి ఆ ఘటసర్పము (సాతాను), తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఆ మృగమునకు (అంత్య క్రీస్తుకు) ఇచ్చెను. * డంబపు మాటలు మాట్లాడుతాడు. * దేవ దూషణ చేస్తాడు. * పరిశుద్ధులతో యుద్ధం చేసి జయిస్తాడు. * ప్రతీ జనము మీద మూడున్నర సంవత్సరాలు సంపూర్ణ అధికారం కలిగివుంటాడు. ప్రకటన 13:1-7  *ఎవరీ క్రూరమృగము?* అంత్య క్రీస్తు ( క్రూరమృగము వంటి స్వభావము కలిగిన వాడు)  *పది కొమ్ములు* ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; దానియేలు 7:24  ( ఆ రాజ్యము నుండి అనగా? దానియేలుగారికి అనుగ్రహించబడిన దర్శనము ప్రకారము, “రోమా సామ్రాజ్యము నుండి”) నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. (ప్రకటన 17:12)  *ఏడు తలలు:* ⭕⭕⭕⭕⭕ 🎯a) *ఆ యేడు తలలు ఆ స్...

క్రూరమృగము:పార్ట్.1

క్రూరమృగము:పార్ట్.1 🎯🎯🎯🎯🎯🎯🎯 మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. ప్రకటన 13:1,2  *ఎవరీ క్రూరమృగము?* అంత్య క్రీస్తు  *అంత్య క్రీస్తుకు గల పేర్లు:* ⭕⭕⭕⭕⭕⭕⭕⭕ * క్రీస్తు విరోధి (1యోహాను 2:18) * బాబేలు రాజు (యెషయా 14:4) * తేజో నక్షత్రము, వేకువ చుక్క (యెషయా 14:12) * చిన్న కొమ్ము ( దానియేలు 7:8,9) * నాశన పాత్రుడు ( 2థెస్స 2:3) * మృగము( ప్రకటన 13:1) * క్రూర ముఖముగల రాజు (దానియేలు 8:23) * నాశన పుత్రుడు (2థెస్స 2:2,8) * ఇష్టానుసారంగా ప్రవర్తించు రాజు (దానియేలు 11:36)  క్రూర మృగమును గూర్చిన సంపూర్ణ అవగాహన కొరకు దానియేలు గ్రంథములోని, నెబుకద్నెజరు మరియు దానియేలుకు కలిగిన దర్శనములను తప్పక ధ్యానించాలి.  రాజైన నెబుకద్నెజరు తన రాజ్యములోని జ్ఞానులందరిని పిలిపించి, నేను ఒక కల కని, మ...

క్రీస్తు_శాస్త్రము_పార్ట్-1

#క్రీస్తు_శాస్త్రము_పార్ట్-1  #దైవ_లక్షణములు... యేసు ప్రభువుయొక్క వ్యక్తిత్వములో దైవ లక్షణాలు లేదా గుణగణాలు ప్రస్ఫుటమవుతున్నాయి.  ఈ గుణశీలాలు కేవలం దేవునికి మాత్రమే పరిమితం. దేవుడు తప్ప సృజింపబడింది ఏది కూడా దేవదూత అయినా, మానవుడు అయినా ఈ లక్షణాలు మూర్తీభవించినవారుకారు. దేవుని ఈ గుణగణాలను దేవునికి తప్ప మరి ఎవరికి ఆపాదించినా అది దైవదూషణ అవుతుంది.  యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కనుకనే దేవునికే స్వంతమయిన గుణశీలాలను తను కూడా కలిగి ఉన్నాడు అన్నది నిర్వివాదాంశం. 1. స్వయంభవుడు (self-existent): దేవుడు “స్వయంభవుడు” అనగా తనంతట తానే కలవాడు. మరెవ్వరూ దేవుని యొక్క ఉనికికి కారణం కాదు. దేవుణ్ణి ఎవ్వరూ సృష్టించలేరు. దేవున్ని ఏ శక్తి కూడ సృజించలేదు. దేవుడు తనంతట తానే ఉన్నవాడు, ఉన్నవాడు అనగా కలిగినవాడుకాదు. ఉంచబడినవాడు కూడా కాదు. దేవుడు స్వయంభవుడు. స్వయంభవత్వం వలన దేవుడు సర్వ స్వతంత్రుడు. దేవుడు ఎవరిమీద ఆధారపడడు. పరాధీనుడు కాదు. క్రీస్తు ప్రభువు స్వయంభవుడు.  యోహాను 5:26 లో యేసుప్రభువు బహుతేటగా ఈ విషయాన్ని వెల్లడిచేశాడు. “తండ్రి ఏలాగు తనంతట తానే జీవంగలవాడై యున్నాడో, అలాగే కుమారుడు తనంతట త...

క్రీస్తు పుట్టుకలో ప్రపంచ 7 వింతలు

క్రీస్తు పుట్టుకలో ప్రపంచ 7 వింతలు 🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 👉1. పాపసహితునిలో నుండి పాపరహితుడుపుట్టుట-మొదటి వింత. 🟫🟫🟫🟫🟫🟫🟫🟫🟫 "పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంతమేలు? (యోబు 14:4) -జన్మతః పాపియైన మరియ గర్భములో ఏ పాపము అంటకుండా యేసు జన్మించుట వింతయే గదా!  👉2 .సర్వలోకమునకు ప్రజాసంఖ్య భూమిమీద మొట్టమొదటిగా వ్రాయబడడం.. 🟪🟪🟪🟪🟪🟪🟪🟪🟪🟪 (లూకా 2:1-2) ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.  👉3. పురుషసంయోగము లేకుండా, ఒక కన్యక గర్భము దాల్చుట. 🟦🟦🟦🟦🟦🟦🟦🟦🟦🟦 "ఇదిగో ప్రభువుదూత అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపూ, నీభార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్దాత్మవలన కలిగినది."(మత్తయి 1:20)  👉4. పరలోక సైన్య సమూహం - దూతతో మొట్ట మొదటిసారిగా భూమి మీద ప్రత్యక్షము కావటం. - 🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩 వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము కలుగునుగ...

క్రీస్తు జన్మకు సంబంధించిన చారిత్రక నిదర్శనాలు

 క్రీస్తు జన్మకు సంబంధించిన చారిత్రక నిదర్శనాలు  🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 పరిచయము :  ✴️✴️✴️✴️✴️✴️✴️ ప్రపంచ చరిత్రలో క్రీస్తు ఎప్పుడూ విభిన్నమైన వ్యక్తే. మానవ చరిత్రలో ఎంతోమంది ప్రముఖుల యదార్ధ గాధల్నీ పరిశీలించేటప్పుడు ఫలానా వ్యక్తికి చారిత్రాత్మకత ఉందా ? అని అడిగితే సరిపోతుంది. కారణం కొందరి గాధలో వాస్తవికత సందేహమైతే కొందరిది వారి వారి ఉనికినే శంకించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. క్రీస్తు నరావతారం కాలాన్ని విభజిస్తే (క్రీస్తు పూర్వం-క్రీస్తుశకం), క్రీస్తు సిలువ నిత్యత్వాన్నే (పరలోకం-నరకం), విభజించింది. మానవ చరిత్ర చట్రానికి క్రీస్తే ఇరుసు. ఇహమునకు, పరమునకు ఆయనే నిర్దేశ ప్రమాణం.  క్రీస్తుకు చరిత్రాత్మకత వుందా అనటం కంటే ఆయన చరిత్రాత్మకత ఎంత ? అనడం ఉత్తమమం. క్రీస్తు చారిత్రక పురుషుడు మాత్రమే కాదు ఆయన చరిత్రకు మూలపురుషుడుగా గుర్తించబడ్డాడు. క్రీస్తు చారిత్రాత్మకత ఎంత ?  క్రీస్తు జన్మకు సంబంధించిన చారిత్రక నిదర్శనాలు : ✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️  ఎ) నైసర్గిక నిదర్శనం :  💥💥💥💥💥💥💥💥💥 పాలస్తీనా నైసర్గికంగా చాలా ప్రాముఖ్యమైన సుందర ప్రదేశం. మూడు ప్రాముఖ్యమైన మతాలకు ప...

బైబిలులోని_70_అతిముఖ్యమైన_సంఘటనలు

#బైబిలులోని_70_అతిముఖ్యమైన_సంఘటనలు... 1. సృష్టి నిర్మాణము ఆదికాండము 1 2. మానవుని పతనము ఆదికాండము 3:6 3. జలప్రళయము ఆదికాండము 6-8 4. బాబెలు గోపురము ఆదికాండము 11:1-9 5. అబ్రాహాము దేవుని అంగీకరించుట మరియు అతనికి దేవుని పిలుపు ఆదికాండము 12:1-3 6. దేవుడు అబ్రాహాముతో నిబంధన చేయుట  ఆది. 12:7; 13:14-17; 15:1-21 7. బానిసగా యోసేపును ఐగుప్తుకు అమ్ముట ఆదికాండము 37 8. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల బానిసత్వము నిర్గమకాండము 1 9. మోషేకు పిలుపు నిర్గమకాండము 3:1-10 10. పది తెగుళ్లు నిర్గమకాండము 7-12 11. ఐగుప్తును విడచుట నిర్గమకాండము 12-15 12. సబ్బాతు దినాచారమును నియమించుట నిర్గమకాండము 16:29 13. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమును ఇచ్చుట నిర్గమ. 20:1-17 14. మోషే ప్రత్యక్షపు గుడారముయొక్క పని సంపూర్తి చేయుట నిర్గమ. 40:33, 34 15. అహరోనును ప్రప్రథమ ప్రధాన యాజకునిగా అభిషేకించబడుట లేవీయ. 8:1-12 16. ఇశ్రాయేలీయులు పాలస్తీనా చేరుటకు యొర్దాను నదిని దాటుట యెహోషువ 3 17. యెరికో పట్టణముపై విజయము యెహోషువ 6 18. రూతు బోయజుల వివాహము రూతు 4 19. సౌలు ఇశ్రాయేలీయుల ప్రప్రథమ రాజుగా అభిషేకించబడుట 1 సమూయేలు 9, 10 20. దావీదు ఇశ్రాయేలీయులకు...

జగద్రక్షకుని జననం

జగద్రక్షకుని జననం 🎯🎯🎯🎯🎯🎯🎯🎯 యేసే రక్షకుడు ⭕⭕⭕⭕⭕⭕ “యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి”(యోహాను.4:42)  “తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను”. (మత్తయి 1:21)  “పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది”.(I తిమోతి 1:15)  “ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు” (లూకా 2:11)  “ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను”.  (I తిమోతి 3:16)  క్రీ.పూ. ప్రవచించిరి  ⭕⭕⭕⭕⭕⭕⭕⭕ 🔸 యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. (యెషయా 11:1; యిర్మీయా 23:5; 33:15; జెకర్యా 3:8; 6:12)  🔸 కన్యక గర్భాన పుట్టు కుమారుడు ఇమ్మానుయేలు. (యెషయా 7:14; మత్తయి 1:21-22)  🔸యూదా బేత్లేహేములో జన్మించును. (మీకా 5:2; మత్తయి 2:5; యోహాను 7:42)  🔸 మోషేవంటి ప్రవక్త మీలోనుండి వచ్చును....

దేవుడు

అంశం) దేవుడు 🎯🎯🎯🎯🎯🎯🎯 పరిచయం... 🔰🔰🔰🔰🔰🔰🔰 దేవుడు మహా మహిమాన్వితుడు .ఆయన్ను మనము పూర్తిగా అర్ధం చేసుకోలేము.ఆయన ఆది అంతాలు లేనివాడు.ఆయన సర్వాంతర్యామి. ఆయన లేని స్ధలము లేదు.యోబు 11: 7 దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానముకలుగునా?.దేవుడు పరలోకంలో నివసిస్తూ సర్వలోకాన్ని పరిపాలిస్తున్నాడు.బైబిల్ లో ఇలా చెబుతున్నది.యెషయా 66: 1యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము . కీర్తనలు 47: 8 దేవుడు అన్యజనులకు రాజైయున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై యున్నాడు.  1) దేవుడు ఎలాంటి వాడు. 🌀🌀🌀🌀🌀🌀🌀🌀 A) దేవుడు సర్వ సృష్టికర్త. 💥💥💥💥💥💥💥💥 నెహెమ్యా 9: 6 నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. కీర్తనలు 139: 13 నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.  B) దేవుడు సర్వ శక్తి సంప...

బెత్లేహేము గురించి ఆసక్తి గల విషయాలు*

*బెత్లేహేము గురించి ఆసక్తి గల విషయాలు* 🎯🎯🎯🎯🎯🎯🎯🎯 👉ప్రపంచ ఖండములలో ఆసియా పెద్దది. ఇందు చిన్న, పెద్ద దేశములు 76కలవు. ఆసియా అన్ని ఖండములకు మధ్యగా నున్నది. దానిలోని చిన్న దేశమే పాలస్తీనా.  👉ఇది మధ్యధరా సముద్రమునకు, అరేబియా ఎడారికి మధ్య 70 మైళ్ళవెడల్పును, 145 మైళ్ళ పొడవును కలిగియున్నది. పాలస్తీనా దక్షిణ భాగంలోనిఇశ్రాయేలు దేశమునకు యెరూషలేము ముఖ్య పట్టణము. ఈ యెరూషలేమునకుప్రక్కనే ఉన్న చిన్న గ్రామము బెత్లేహేము. "యూదయ   భెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును". (మత్తయి 2:7)  👉లోకరక్షకుడైన యేసు   బెత్లేహేములో జన్మిస్తాడన్న సత్యాన్ని పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించినట్లుగా సుమారు 2021సంవత్సరముల క్రితము జగద్రక్షకుడైన యేసు క్రీస్తు సర్వ మానవులను జన్మ, కర్మ పాపముల నుండి విడిపించి రక్షించుటకుయెరూషలేము ప్రక్కనున్న బెల్లెహేము అను గ్రామములో కన్యకకు జన్మించి, 33 1/2 సం||లు యెరూషలేము ప్రాంతములలో సంచరించి; కుంటి వారికి కాళ్ళు.మూగవారికి నోరు, చెవిటివారికి చెవులు, కుష్ఠురోగులకు స్వస్థత, అం...

*హెబ్రీ లేఖనములను గ్రీకు భాషాంతరము చేయబడిన ప్రక్రియ ఎలాంటిది?*

*హెబ్రీ లేఖనములను గ్రీకు భాషాంతరము చేయబడిన ప్రక్రియ ఎలాంటిది?* క్రీస్తు పూర్వము 3వ శతాబ్ధములో గ్రీకు భాష మాట్లాడే ప్రాంతాల్లో నివసించే యూదుల సౌలభ్యము కొరకు పాత నిబంధన లేఖనములను హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేయడంతో అనువాదమునకు నాందిపడినట్లయినది. ఈ అనువాదము జరిగిన విధానమును క్రీస్తు పూర్వము 2వ శతాబ్దమునకు చెందిన అరిస్టియస్ అనే వ్యక్తి తన సోదరుడైన ఫిలోక్రేట్స్ కు రాసిన ఓ లేఖ తెలియజేస్తుంది. అరిస్టియస్ చేత రాయబడిన లేఖ కావడంతో దానిని అరిస్టియస్ లేఖగా పేర్కొంటున్నారు. *అరిస్టియస్ లేఖ ప్రకారము:* "క్రీస్తు పూర్వము 281_246వ సంవత్సరముల మధ్య ఐగుప్తును పరిపాలించిన రెండవ టాలోమి ఫిలడల్ఫస్ ప్రపంచ విఖ్యాతి గాంచిన అలెగ్జాండ్రియా పట్టణములోని గ్రంథాలయములో యూదు (ఇప్పటి పాత నిబంధన) లేఖన ప్రతులను కూడ ఉంచాలని భావించియున్నాడు. ఈ నిమిత్తము యెరూషలేములోని ప్రధాన యాజకుడైన ఏలియెజరును సంప్రదించియున్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల్లోని ఒక్కొక్క గోత్రమునకు ఆరుగురు యూదు పండితుల చొప్పున 12 గోత్రములకు 72 మందిని ఎన్నుకొని వారిని రాజు వద్దకు పంపియున్నాడు. అక్కడ వారికి యూదు లేఖనములను హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోన...

పరలోక_నిచ్చెన_ప్రసంగము

#ముంగమూరి_దేవదాసు_అయ్యగారు_చెప్పిన #పరలోక_నిచ్చెన_ప్రసంగము... దా.కీర్తన. 39; మార్కు 16:16; గలతీ. 1:1. పై అంతస్తుకు చేరుటకు ఆశించిన ప్రియ విశ్వాసులారా! ఆదినుండి నేటివరకు, మనము జన్మించిన దినమున ఉన్న పసి పిల్లలముగానే లేము. కాబట్టి శరీర విషయములో ఏరీతిగా ఎదుగుచున్నామో ఆ రీతిగా జ్ఞానములో కూడా ఎదుగవలెను. అవును చిన్నప్పుడు ఉన్న తెలివితేటలకంటె పెద్దయినప్పుడు తెలివి ఇంకా ఎక్కువగానే ఉన్నది. కాబట్టి జ్ఞాన విషయములో ఎదుగుచున్నాము. ఇందాక చెప్పినట్లు శరీర విషయములో ఎదుగుచూనేయున్నాము. ఈరెండును మనుష్య జీవితమునకు ముఖ్యము. అయితే ఈ రెండు లోకానికే. శరీరము ఇక్కడే ఉండిపోవుచున్నది. మనకు జ్ఞానమున్నది. అందుచేత మనము అన్నవస్త్రాదులను సంపాదించుచున్నాము. పొలములో, పాఠశాలలో, ఆఫీసులో ఉద్యోగము చేసికొనుచున్నాము.  కాని ఇవి పరలోకములో లేవు. ఈ లోకములో జీవించినంత కాలము మనము జీవించి పరలోకమునకు వెళ్లాలి. భూలోకములో రెండు గొప్ప అంతస్థులున్నవి.  1. శరీరములో, 2. తెలివితేటలలో ఎదుగుట.  ఈరెండు గొప్ప అంతస్తులే. ఈ రెండింటికంటే పరలోకములోనికెళ్లుట గొప్ప అంతస్థు. ఈ రెండు ఇక్కడ అభ్యాసము చేసికొంటే పరలోకము వెళ్లుట సుళువు. అయితే ఈ...

ధన్యులైన గొర్రెల కాపరులు (క్రిస్మస్ సందేశాలు)

అంశం) ధన్యులైన గొర్రెల కాపరులు (క్రిస్మస్ సందేశాలు) 🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 గొర్రెలను పొలములో మందకట్టు దినాలు అనగా శీతాకాలము (అక్టోబరు-డిసెంబరు మాసములు). పస్కా పండుగ తరువాత  పశువులను పొలములోనికి తీసుకువెళ్ళి తొలకరి వరకు అక్కడే వారు గొర్రెల మందలతో పాటు వుంటారు. ప్రభువు డిసెంబరు మాసములో పుట్టినట్టు చెప్పటకు ఆధారాలు తక్కువైనా, ఆయన పుట్టినది సత్యము కాబట్టి శీతాకాలములోనే పుట్టి యుంటాడని మాత్రము చెప్పడానికి ఆధారం; కాపరులు గొర్రెలను పొలములో కాచుకొనుచున్న సందర్భము మాత్రమే. కాపర్లు సర్వసాధారణముగా పామరులు. తమ గొట్టెలపట్ల ప్రాణసహితమైన బాధ్యత కలిగివుంటారు. వారి గొర్రెలే వారికి సంపద, సమస్తము. యేసు జన్మమును గూర్చిన వర్తమానము ప్రధమంగా కాపరులకే తెలియజేయబడింది. ఆయన జ్ఞానులకుకాక అజ్ఞానులకే ప్రాధాన్యత నిచ్చినాడు. “నేను జ్ఞానిని” ” అనుకొనువారికి సువార్తలేనట్టే. ఆ దినాల్లో మోషే ధర్మశాస్త్రాన్ని బోధించే పండితులు ఎందరో వున్నా ఆ వారందరికి ప్రాధాన్యత నివ్వలేదుగాని, ఆజ్ఞానులకు బయలుపరిచాడు. ఎందుకనగా వారు సులువుగా లోబడు ప్రజలు. మరి లోకరక్షకుని కొరకు యదార్థముగా ఎదురు చూచువారు. దైవ వర్తమానము వినిన కాపరులు ఏవిధంగా ఆశ...