*క్రైస్తవ సహోదరులారా ఒక్కసారి ఆలోచించండి...🙏🙏🙏*
తల్లి తనకు పుట్టిన బిడ్డకు పాలు ఇచ్చి పెంచుతూ ఉంటుంది.
ఆ బిడ్డ అవసరాలు, ఆలనా, పాలనా అన్ని చూసుకుంటుంది....
*ఆ అమ్మకు మరొక బిడ్డ పుట్టాకా మొదట పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వడం తగ్గించి, అన్నం పెట్టడం ప్రారంభించి మరొక బిడ్డకు పాలు ఇవ్వడం మొదలుపెడుతుంది....*
అంత మాత్రానా మొదట పుట్టిన బిడ్డ మీద అమ్మకు ప్రేమ తగినట్టా??
*కాదు ఆ బిడ్డకు పాలు విడిచి అన్నము తినే వయస్సు వచ్చింది కాబట్టి తనకు ఆహారం పెట్టి, చిన్న బిడ్డకు పాలు ఇస్తుంది... చిన్న బిడ్డ మీద కొంచెం సమయం ఎక్కువ కేటాయిస్తుంది..*
అది అమ్మ ధర్మము....
*అలాగే క్రీస్తులోకి మనము క్రొత్తగా వచ్చినప్పుడు చంటిపిల్లలము కాబట్టి దైవ సేవకుడు మన మీద ఎక్కువ ప్రేమ, శ్రద్ధ చూపి, ఎక్కువగా మనకు సమయాన్ని ఇస్తూ వుంటారు...*
కొద్ది కాలం గడిచినప్పటికి మనకి కొంచెం వయస్సు వస్తుంది అనగా....
*వాక్య జ్ఞానము, దేవునిలో లోతు తెలుస్తాయి.*
అప్పుడు దైవ సేవకుడు మనకు కొంచెం సమయము తగ్గించి *క్రొత్తగా వచ్చిన మరొక విశ్వాసులపై ప్రేమను, శ్రద్ధను చూపుతారు ఎందుకంటే వారు దేవునిలో చంటిబిడ్డలు కాబట్టి...*
అంత మాత్రానా సేవకునికి నీమీద ప్రేమ తగ్గింది అనటం న్యాయమా??
*దేవునిలో మనకు కొంచెం అనుభవం వచ్చింది కాబట్టి దైవ సేవకుడు క్రొత్త విశ్వాసులను బలపర్చడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు.*
అది చూసిన మనము అదిగో పాస్టర్ గారికి ముందొచ్చిన నాకంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళమీదే ప్రేమ ఎక్కువ అయిపోయింది.
*మా ఇంటికి రావడం తగ్గించేశారు, నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు.*
పాస్టర్ గారు పిలిచినా రావటం లేదు. మారిపోయారు.
అని కొంతమంది విశ్వాసులు అనుకుంటారు, సన్నిధికి రావటం మానేస్తారు... అలా చేయటం న్యాయమా??
*ప్లీజ్ అలా ఎవరు అనుకోవద్దు.*
*పాస్టర్ గారు ఎప్పుడూ నీతోను, నాతోను ఉంటే మిగిలిన ఆత్మలను ఎలా రక్షించగలరు?*
నశించిపోతున్న ఆత్మలను దేవునిలోకి ఎలా నడిపించగలరు?
ఒక్కసారి ఆలోచించండి.
*ఎప్పుడూ దేవునిలో మనం చంటిబిడ్డలముగా ఉండిపోదామా??*
వయస్సులోకి రావొద్దా??
*వయస్సు వచ్చిన బిడ్డ తన తల్లిదండ్రులకు తోడుగా, సహకరిగా ఉంటే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది.*
అలాగే మనము కూడా సేవకునికి సహకారులముగా ఉంటే దేవుని కుటుంబం (సంఘం) అభివృద్ధి అవుతుంది.
*ప్లీజ్ అందరూ ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి....*🙏
*సేవకునికి సహకారులముగా ఉండాలి కానీ ఆయనపై లేనిపోని అపోహలు పెంచుకుంటూ దేవునికి, దేవ రాజ్యానికి దూరం అవ్వకండి.*
క్రొత్త వారు సంఘంలోకి వస్తే వారిని ప్రేమిద్దాము, వారితో సహవాసం చేద్దాము, బలపర్చుదాము, ఐక్యతను పెంచుకుందాము...
*దేవుని రాజ్య విస్తరణకు మూల స్థంబాలుగా మారదాము...*
తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి.
*కానీ దేవునికి, దైవ సేవకునికి సహకారులుగా ఉండండి.*
మీ అందరికి నా ప్రేమపూర్వకపు విన్నపము, విజ్ఞాపణ🙏🙏🙏
1కొరింథీయులకు 14:20
*సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక, బుద్ధి విషయమై పెద్దవారలైయుండుడి.*
ఎఫెసీయులకు 4:14
*అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత* *వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత* *ఎగురగొట్టబడినవారమైనట్లుండక,*
*ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ""ఎదుగుదము.""*
1యోహాను 3:10
*దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.*
మన జీవితము, మాదిరి ద్వారా *మన దేవాది దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక!!!!*👏👏👏
గమనిక::
*మన ప్రభుని రాకడ అతి సమీపముగా ఉంది. ఎవరు నిర్లక్ష్యంగా ఉండకండి.*
మన లక్ష్యము ఆయన రాకడలో ఎగిరివెళ్లిపోవటమే.....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి