ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సాధు సుందర్ సింగ్"" గారు స్విట్జర్లాండ్ లో చెప్పిన ప్రసంగము = 1

*""సాధు సుందర్ సింగ్"" గారు స్విట్జర్లాండ్ లో చెప్పిన ప్రసంగము = 1*

పూర్తిగా చదవటానికి ప్రయత్నం చేయండి...🙏

అంశము::
*"ఇహసంబంధమైన వాటి కొరకు ప్రార్థించుట"...*

“మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు." 
మత్తయి 22:22.

*జెబదయి కుమారుల తల్లి రక్షకుని యొద్దకు వచ్చి తన ఇద్దరు కుమారులు విషయమై మనవి చేసెను. "నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను, ఒకడు నీ ఎడమవైపునను కూర్చొండ సెలవిమ్మనిఆయనతో అనెను "* అప్పుడు ప్రభువు - మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు అనెను.

*అనేకులవలె ఈ స్త్రీ కూడ ఇలాగు తలంచెను : "ఆయన ఈ లోకముందు పాలన చేయ్యబోవుచున్నాడు.* యెరూషలేము ఆయన రాజ్యము యొక్క రాజధానిగా నుండును గనుక నా కుమారులలో ఒకడు ప్రధానమంత్రిగాను మరొకడు విదేశాంగ మంత్రిగాను లేదా ప్రాముఖ్యమైన పదవీ బాధ్యతలు వహించవలసిందిగా కోరెను.
*" రక్షకుడు - మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు అని జవాబిచ్చెను.*

*ఆ స్త్రీ మరియు శిష్యులను మనము నిందించుట కాదుగాని చాలామంది క్రైస్తవులు ప్రస్తుతము అలాగే ప్రార్థించుచున్నారు. వారు ఏమి అడుగుచున్నారో వారికి తెలియదు.* వారు ఇహసంబంధమైన వాటికొరకు అడుగుచున్నారు. వారు జబ్బుపడియుంటే ఆరోగ్యము కొరకు అడుగుచున్నారుగాని ఆత్మసంబంధమైన వాటి కొరకు అడుగుటలేదు.

*“దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకుడి; అప్పుడివన్నియు మీకు అనుగ్రహించబడును" అని రక్షకుడు చెప్పెను.*

*మనము ఇహసంబంధమైన వాటి కొరకు ప్రార్థించక వాటిని దయచేయు దేవుని కొరకు ప్రార్థించవలెను.*

కేవలము జీవమును అడుగక జీవమునిచ్చు జీవదాత కొరకు ప్రార్థించవలయును.  చాలామంది సత్యాన్వేషకులు ఈ అనుభవమును పొందియున్నారు.

*లోకమంతయు, పరలోకము సహితము ఈయబడినను మన హృదయము తృప్తి చెందదు. మన హృదయము కేవలము ఆయనను బట్టియే తృప్తి చెందవలెను.*

ఆత్మీయ జీవము కొరకు ప్రార్థించుట ఎలాగు? అని మనము తెలుసుకొనవలెనని ఆయన కోరుచున్నాడు. మనలను సృష్టించిన దేవుని మనము కనుగొనినప్పుడు, సమాధానముయెడల వాంఛకలిగినపుడు మనము
భూమిమీదనే సమాధానమును కనుగొనుచున్నాము. గనుక మరిదేనిమీదనైనను మనకు కోరిక ఉండదు.

*ఇహసంబంధమైన వాటి కొరకు మనము ప్రార్థించకూడదనునది* *దేవుని వాటి కొరకు మనము ప్రార్థించకూడదనునది దేవుని*
*ఉద్దేశ్యమైన యెడల ఆయన - పరిశుద్ధాత్మను గూర్చి మాత్రము ప్రార్థించుడి.*
సహసంబంధమైన వాటి కొరకు ప్రార్థించవద్దు అని చెప్పెడివాడు కదా!" అని అనేకులు నన్ను ప్రశ్నించుచున్నారు. అయితే మనలో కోరిక లేనియెడల మనము అసలు ప్రార్థించెడివారమే కాదు. ఇహ సంబంధమైవాటియెడల మనకు కలుగు
కోరికను బట్టి మనము శ్రేష్టమైన వాటియెడలను కోరిక కలిగియుండవలెనని గుర్తించుచున్నాము.

*దీనిని స్పష్టపరచుటకు ఒక దృష్టాంతము వినండి.* నేను బలుచిస్తాన్ దేశమందు పయనించుచుండగా ఒక తండ్రిని గూర్చియు ఆయన ఇద్దరు కుమారులను గూర్చియు విన్నాను. *ఆయన తన ఇద్దరు కుమారులతో మీరు పొలమునకు వెళ్ళి త్రవ్వండి. అక్కడ లంకెబిందెలు ఉన్నవి అని చెప్పెను.*
ఆ మాట వినిన కుమారులు ఎంతగానో సంతోషించిరి. మనము త్రవ్వినపుడు వెండి, బంగారములు దొరుకునని తండ్రి చెప్పెనని వారు పని ప్రారంభించిరి.
*అయితే తండ్రి ఉద్దేశ్యము అదికాదు. ఆ గ్రామమందు నీటి కొరత ఉండెను. దాదాపు 3 మైళ్ళ అవతలినుండి వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలి.*

ఇద్దరుసహోదరులును ఉదయమునుండి సాయంకాలము వరకు త్రవ్వుతూ ఉండిరి. వారు ఎంతో ఆలసట చెందిరి. *"అధైర్యపడవద్దు. మిమ్మును ప్రోత్సహించు దానిని త్వరలో కనుగొందురు" అని తండ్రి ధైర్యము చెప్పెను.*

నాలుగుదినముల తరువాత వారు ఇంకనూ త్రవ్వుచుండగా ఎంతో నీరసించిన వారై, *"ఇదంతావ్యర్థము. మనమెంతో దాహముగా ఉన్నాము.*
వెండిబంగారములు దొరికినా అవి మన దాహమును
అతిప్రాముఖ్యమైనది నీరు" అని తమలో తాము చెప్పుకొనిరి.

*అంతలో ఆకస్మికముగా నీరు ఉబకసాగెను. వారు ఎంతో సంతోషించిరి.*
ఇద్దరు సహోదరులలో ఒకడు జరిగినదంతయు తండ్రికి వివరించెను. *అందుకు తండ్రి, “నీటి కొరకు త్రవ్వమని నేను చెప్పలేదు. ఒకవేళ అలాగు చెప్పియుంటే*
మీరు విధేయులు కాకపోవచ్చును. గ్రామ ప్రజలను త్రవ్వమనండి అని మీరు నిర్లక్ష్యము చేసెడివారు. *అక్కడ ధననిధి ఉందని చెప్పినందున మీరు త్రవ్వుట ప్రారంభించారు. త్రవ్వుట మీకు మంచి వ్యయాయము*. అంతేకాదు,

*మీకు అవసరమైన నీటిని మీరు కనుగొనిరి.* అది వెండి బంగారముల కన్నా విలువైనది" అని ప్రశంసించెను.

*ప్రార్థన అనునది త్రవ్వుటతో సమానము!* అది శోధనలను
ఎదుర్కొనగలిగినంత బలమును మనకు దయచేయుచున్నది.
*ఇహ సంబంధమైన వాటికొరు మాత్రముగాక వాటిని దయచేయు దేవుని కొరకు ప్రార్థించండి!*

*నేను అన్యునిగా ఉన్నపుడు నా ఆత్మను ఇహసంబంధమైనవాటితో తృప్తిపరచుటకు ప్రయత్నించాను కాని అది సాధ్యముకాలేదు.* సనాతన మత నియమములను పాఠించితిని కాని నేను ఏమియు మేలు పొందలేదు. క్రీస్తును గూర్చి కొంతమటుకు తెలుసును గాని నేను ఆయనను ఎరిగియుండలేదు.

*నేను ఆత్మీయముగా అంధత్వములో ఉంటిని గనుక ఆయనను ద్వేషించుచుంటిని.* అయితే ఆయనను నేను ఎరిగినపుడు ప్రేమించుటకు ప్రారంభించాను. "మీరేమి అడుగుచున్నారో మీరు ఎరుగరు” అనే పరిస్థితిలోనే నేను ఉంటిని. నేను ఏదో ఒక దాని కొరకు అడుగుచు ఉంటిని. అనగా
ఇహసంబంధమైన వాటినే అడుగుచుంటిని. దేవుడు తన అత్యంత కృపను బట్టి నేను దేనికొరకు అడుగవలెనో చూపించెను. *ఆయన నాకు ఇహసంబంధమైన కొన్నిటిని ఇచ్చుటకాదు, ఆయన నాకు తన్నుతానే ఇచ్చెను గనుక నేను ఆయనయందు తృప్తి చెందితిని.*

ఆయన నాకు తన్ను బయలు పరచిన విధము మీకు తెలుసు. దానిని నేను ప్రతిచోట ప్రభువు నామ మహిమార్ధమై సాక్ష్యముగా చెప్పుచున్నాను. మార్పు
చెందిన తర్వాత నా ప్రార్థన ఇది: 
*"ప్రభువా, నేను నిన్ను కలిగియుండాలి."*

అవును, ఇదే నిజమైన ప్రార్థన! *ఆయన యందు తప్ప మరి దేనియందును మనము తృప్తిచెందజాలము.*
చాలామంది క్రైస్తవులు ఒకరినొకరు ద్వేషించుచున్నారు.
ప్రేమించుటలేదు. ఒకరితోనొకరు పోట్లాడుకొనుచున్నారు. క్రీస్తు ఎడల వారికి ప్రేమలేదు. ఆయన ప్రేమామయుడు: అయితే వారి హృదయమందు ప్రేమలేదు. *మన జీవితమందు దేవుడు నివసించినయెడల ఇతరులకు ప్రేమ చూపుదుము. మనము జీవము పొందియున్న యెడల ఇతరులను ప్రేమించుటకు ఇష్టపడుదుము.*

 ప్రార్థనద్వారా మనము ఆయనను
ఎరుగవలెను. ఆయనలో జీవించవలెను; ఆయన మనయందు జీవించవలెను.
లేని యెడల అంత్యదినమున ఆయన "నేను మిమ్మును వ్యక్తిగతముగా ఎరుగను" అని చెప్పుట జరుగును. 
*"మీకు నన్ను గూర్చి తెలుసు. నా బైబిల్ చదివితిరిగాని మీరు నన్ను ఎరుగరు, నేను మీ హృదయమందు ఉండలేదు" అని ఆయన చెప్పును*
.
మనమాయనను ఎరిగినపుడు పరలోకమందు సదా ఆయనలో కూడా జీవించుదుము. ఆయన మన సమీపములోను మనతోను ఉన్నాడు గనుక ఆయన ప్రసన్నత మనతోను మనలోను ఉండుటను గ్రహించుచున్నాము.
*ఒకవేళ ఆయన మీ హృదయమందు లేని యెడల ప్రార్థించండి. దేవా, నా హృదయములోనికి రమ్ము."*

*ఇహసంబంధమైన వాటి కొరకు ప్రార్థించక, ఆయనే కావాలని ప్రార్థించండి!* అప్పుడు ఆయన మీయందు నివసించును. ఆయన మనతో కూడ ఉన్నాడు. అయితే మనమాయనను తెలుసుకొనుట మాత్రము చాలదు.

*మనమాయనను ఎరిగియున్న ఎడల ఎన్నడు అధైర్యము చెందము. మనము దుఃఖము, విచారములో ఉండవచ్చునుకాని ఆయన ప్రసన్నతను గ్రహించుదుము.* జీవమిచ్చు ఆయన ప్రసన్నత మన జీవితమును భూమిమీద పరలోకముగా మార్చును.

*మనమాయనను ఎరిగియుంటే శ్రమలయందు అధైర్యపడము,* లోకమంతయు మనకు వ్యతిరేఖముగా నుండినను అధైర్యపడము, చెప్పశక్యముకాని ఆశ్చర్యమైన సంతోషమును అనుభవించుదుము.

*కొంతకాలము క్రిందట టిబెట్టులో ఒక దైవజనుని కలుసుకొంటిని, అతడు తన అనుభవమును నాకు వివరించెను. తన పై వస్త్రమును తీసివేసి తాను పొందిన గాయములు, మచ్చలను చూపించెను*. కొన్నిదినముల క్రిందటనే ప్రజలు అతనిని రాళ్ళతో కొట్టియుండిరి. ప్రారంభములో అనగా రాళ్ళు తగులుచుండిన కొన్ని నిమిషములు అతడు బాధపడినను, తరువాత
ప్రార్థించుట మొదలు పెట్టినపుడు ఆశ్చర్యకరమైన సంతోషమును అతడు పొందెను. *అది ఎంతటి సంతోషమనగా తనమీద రాళ్ళురువ్విన వారికొరకు ప్రార్థించ గలిగినంత సంతోషముగా నుండెను.* "ఎంతో విచిత్రమైన సమాధానమును బట్టి నేను విస్మయము చెందితిని...... 

అది ఒక గొప్ప అద్భుతముగా నాకు కనబడెను" అని అతడు వివరించెను. *అవును లోకమందు కనుగొనలేని శాంతి సమాధానమును మనము క్రీస్తునందు కనుగొనగలము.*
నేను హింసింపబడినపుడు, ఆయన కొరకు హింసింపబడుట గొప్ప ఘనతగా భావించితిని. ఆయన మహిమగల ప్రసన్నతను గ్రహించితిని గనుక ఆయన నాకు సమీపముగా మాత్రముగాక నాలోను ఉండెను,

*ఒక దినము టిబెట్ దేశమందు చెరశాలలో వెయ్యబడితిని, చెరశాలలోని రాళ్ళన్నియు నాకు పుష్పములుగా కనబడెను. ఆ రాళ్ళలో ఏమియులేదుకాని ఆయన ప్రసన్నత వాటిని మార్చివేసెను*. చెరశాల నాకు పరలోకమువలె ఉండెను,
నేను వివరించలేనంతగా అది నిజముగానే పరలోకము వలె ఉండెను. లోకానుసారమైన భాషలో ఆ ఆత్మీయ సమాధానమును తెలుపలేను.

*ఆయన ప్రసన్నతను గ్రహించు నిమిత్తము మనము తప్పక ప్రార్థించవలెను*. అలాగు దానిని పొంది అనుభవించినపుడు అది భూమి మీద పరలోకముగా ఉండును.

*ఆ చెరశాల ఒక చిన్న గది. దాని చుట్టూ ఇనుప కడ్డీలు. నాకు ఆహారము ఇయ్యబడలేదు. ఎంతో వేదనకరముగా ఉండెను.*
అయినను పూర్వము ఆడంబర స్థితిలో మా గృహమునందు జీవించిన జీవితము చెరశాలవలెను, నేనిప్పుడు ఉన్న చెరశాల పరలోకముగాను నాకు
ఉండెను. *ఆ చెరశాలలో - దేవా, నాకు ఫలానా ఫలానా ఇమ్ము అని ప్రార్థించుట పొరపాటు! నీవే నాకు కావాలి. నీ జీవము నాకు కావాలి అని ప్రార్థించాను.*

ఆయన సమస్తమును ఇచ్చువాడు కదా! ఆయనను కలిగియుంటే చాలును.

*మరో సందర్భమున సువార్త ప్రకటించినందున నేను 13,000 అడుగుల ఎత్తయిన పర్వతము మీద చెట్టుకు బంధింపబడితిని.* ఎంతో విపరీతమైన చలి! 
రాత్రి అంతయు నన్ను అలాగే విడిచి పెట్టిరి. బంధింపబడినందున కలదలలేని స్థితిలో ఉంటిని. అపవాది నన్ను ఎంతో శోధించెను. “క్రీస్తు నీకు సహాయము చేయలేడు" అని ఎగతాళి చేసెను. *అయితే దేవుని మాటలు నన్ను బలపరచెను. “నీవు బ్రతుకు దినములలో నీకు బలము కలుగును”* (ద్వితి 33:25). 
నాలోనికి దేవుని శక్తివచ్చెను. “అది ఎలాగు సాధ్యమయ్యెను?" అని మీరు నన్ను అడుగవచ్చును. రక్షకుడు మనతోనున్నపుడు అది సాధ్యము! 

*ఆయన మహిమగల ప్రసన్నతను గ్రహించలేకపోవుట మన పొరపాటేగాని ఆయన పొరపాటు కాదు!*
 మరణము తరువాత మనము పరలోకమందు జీవించుటయేగాక ఇప్పుడే మనము పరలోకమును భూమిమీద అనుభవించుట జరుగుచున్నది.

*ఆయనను ఎంతో అవమాన పరచిన ఘోరపాపినగు నేను అట్టి సమాధానమును కనుగొని రక్షింపబడిన యెడల; రక్షణ పొంది, ఆశ్చర్యకరమైన సంతోషమును అనుభవించగలిగిన యెడల, క్రైస్తవ దేశమందు జీవించుచున్న మీకు ఆయన ఇంకా అధికముగా ఇచ్చునుకదా*! 

ఈ దేశమందు ఆయనను
గూర్చి తెలుసుకొనిన అనేకులు ఉన్నారుగాని వారిలో ఎందరు ఆయనను ఎరుగుదురో నాకు తెలియదు.

*మనమాయనను ఎరుగునట్లుగా ప్రార్థన చేయుటకు ప్రభువే సహాయము చేయునుగాక!* మనము ఆయనను ఎరుగవలెను. అప్పుడు మాత్రము మనము ఆయనతో కూడ పరలోకమందు ఉండగలము. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించండి.

*ఇహసంబంధమైన వాటి కొరకు కాదుగాని ఆయనే కావాలని ప్రార్థించండి.*
నేను మరల మిమ్ములను కలుసుకొనక పోవచ్చును. అయితే ఒకదినము మరల పరలోకమందు ముఖాముఖిగా కలుసుకొందుము. మిమ్ములను
మరొకసారి కలసి నా సాక్ష్యము చెప్పుటకు అవకాశము లేకపోవచ్చును.
క్రీస్తు మనకొరకు గొప్ప కార్యములను చేసియున్నాడు. ఆయనను ప్రేమించి, వెదకువారు గలరు. అయితే ప్రధాన పాపినగు నేను ఆయనను ద్వేషించితిని కాని ఆయన నన్ను ప్రేమించెను. అది ఆశ్చర్యకరమైన ప్రేమ!
అట్టి ప్రేమకు సాదృశ్యమైనది లేదు. *మీరు ఆయనను ప్రేమించుటకును, స్తుతించుటకును దేవుడు సహాయము చేయునుగాక!*


ప్రతి ఉదయము కనీసము 20 నిమిషములు ప్రార్థించండి. *మీకు సమయమున్నపుడెల్ల ప్రశాంతమైన స్థలములో కూర్చొనండి. ఆయన వాక్యమును చదివి, ప్రార్థించండి.*
ఆయన యందు మీరు సమస్తమును కనుగొనెదరు. మనము ఇహసంబంధమైన వాటి విషయమై చింతించవలసిన అవసరము లేదు.


*పండ్లతో నిండిన ఒక చెట్టు ఉన్నదనుకోండి. మీకు ఒకపండు కావలసినయెడల చెట్టు యజమాని యొద్దకు వెళ్ళి మీరు దానికొరకు అడగవలెను. ప్రతిరోజు వెళ్ళి ఒకటి, రెండు పండ్లను అడిగి పొందవలెను.*

అయితే ఆ చెట్టును మీ సొంత ఆస్థిగా చేసుకొంటే అవి మీకు చెందును కదా!
*దేవుని మన తండ్రిగా చేసుకొనుటకు ప్రయత్నించెదము.* ఆయనను అంగీకరించుటకు మనసులేక పోవుటయే మన పొరపాటు! ఇహ సంబంధమైన వాటి కొరకు ప్రార్థించుచు సమయమును వ్యర్థము చెయ్యకండి. 

*దేవుడు తన్నుతాను మీకు ఇయ్యగోరుచున్నాడు. అప్పుడే మీరు దేవుడు మనలో నివశించవలెను.* దానికొరకు ప్రార్థించుటకు ప్రభువు మిమ్మును ప్రేరేపించునుగాక! ఆయనే జీవమిచ్చువాడు! ఆయనను కనుగొనినయెడల
మనము ఆయన యందు జీవించెదము. ఆయన కొరకు జీవించెదము. ఆమేన్...


ఈ ప్రసంగము
*సాధు సుందర్ సింగ్ గారు స్విట్జర్లాండ్ లో చెప్పిన ప్రసంగములు అను పుస్తకములోనిది...*
పేజీ నెం. 16-22

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...