ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

*హెబ్రీ లేఖనములను గ్రీకు భాషాంతరము చేయబడిన ప్రక్రియ ఎలాంటిది?*

*హెబ్రీ లేఖనములను గ్రీకు భాషాంతరము చేయబడిన ప్రక్రియ ఎలాంటిది?*



క్రీస్తు పూర్వము 3వ శతాబ్ధములో గ్రీకు భాష మాట్లాడే ప్రాంతాల్లో నివసించే యూదుల సౌలభ్యము కొరకు పాత నిబంధన లేఖనములను హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేయడంతో అనువాదమునకు నాందిపడినట్లయినది. ఈ అనువాదము జరిగిన విధానమును క్రీస్తు పూర్వము 2వ శతాబ్దమునకు చెందిన అరిస్టియస్ అనే వ్యక్తి తన సోదరుడైన ఫిలోక్రేట్స్ కు రాసిన ఓ లేఖ తెలియజేస్తుంది. అరిస్టియస్ చేత రాయబడిన లేఖ కావడంతో దానిని అరిస్టియస్ లేఖగా పేర్కొంటున్నారు.

*అరిస్టియస్ లేఖ ప్రకారము:*

"క్రీస్తు పూర్వము 281_246వ సంవత్సరముల మధ్య ఐగుప్తును పరిపాలించిన రెండవ టాలోమి ఫిలడల్ఫస్ ప్రపంచ విఖ్యాతి గాంచిన అలెగ్జాండ్రియా పట్టణములోని గ్రంథాలయములో యూదు (ఇప్పటి పాత నిబంధన) లేఖన ప్రతులను కూడ ఉంచాలని భావించియున్నాడు. ఈ నిమిత్తము యెరూషలేములోని ప్రధాన యాజకుడైన ఏలియెజరును సంప్రదించియున్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల్లోని ఒక్కొక్క గోత్రమునకు ఆరుగురు యూదు పండితుల చొప్పున 12 గోత్రములకు 72 మందిని ఎన్నుకొని వారిని రాజు వద్దకు పంపియున్నాడు. అక్కడ వారికి యూదు లేఖనములను హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి అనువదించు బాధ్యతలు అప్పగింపబడినవి. ఒక్కొక్కరికి ఒక్కోక్కటి చొప్పున 72 మంది యూదు పండితులకు 72 ప్రత్యేక గదులను రాజు కేటాయించెను. అనువాద ప్రక్రియ ముగిసే వరకు ఒకరతో నొకరు మాట్లాడుకొనకూడదని నిబంధన పండితులకు నిబంధన విధించబడెను. అదే విధముగా యూదు పండితులు 72 రోజుల్లో తమ అనువాద ప్రక్రియను పూర్తి చేసియున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరందరి అనువాదములు ఒకే విధముగా ఉండటం. అందువలన ఈ అనువాద ప్రక్రియ దైవావేశముతో వ్రాయబడినట్లు విశ్వసించియున్నారు." ఈ గాథనే క్రీస్తు పూర్వము 20వ సంవత్సరము మరియు క్రీస్తు శకము 50వ సంవత్సరము మధ్యకాలములో నివసించిన ఫిలో అను యూదు తత్త్వవేత్త మరియు క్రీస్తు శకము 37_100 మధ్యకాలములో నివసించిన యోసఫస్ అనే యూదు చారిత్రకారుడు సైతము విశ్వసించియున్నారు. అయితే ఈ 72 మంది యూదు పండితుల సంఖ్యను మాత్రము యోసఫస్ యూదు చారిత్రకారుడు 70గా విశ్వసించియున్నాడు. పూర్వ కాలములో యూదులు మరియు గ్రీకుల యొక్క విద్యానాగరికత కేంద్రముగా ప్రసిద్ధి గాంచిన అలెగ్జాండ్రియా పట్టణములో ఈ తర్జుమా జరిగినట్లు విశ్వసిస్తున్నారు.

*అరిస్టియస్ లేఖ సారాంశముపై విమర్శలు*

అరిస్టియస్ లేఖలోని గాథ కల్పన మాత్రమే అనే విమర్శలు ఉన్నాయి. చారిత్రక అధ్యాయనము ద్వారా పాత నిబంధన లేఖనములను క్రీస్తు పూర్వము 3వ శతాబ్దము నుంచి క్రీస్తుపూర్వము 1వ శతాబ్దము మధ్యకాలముల్లో గ్రీకు భాషలోకి అనువదించినట్లు చారిత్రకారులు విశ్వసిస్తున్నారు. క్రీస్తు పూర్వము 3వ శతాబ్దములో తోరా (పంచకాండములు), క్రీస్తు పూర్వము 185వ సంవత్సర కాలములో కీర్తనల గ్రంథము, ఆ తరువాత యెహెజ్కేలు మరియు 12 మంది చిన్న ప్రవక్తలుగా పిలువబడిన హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ గ్రంథములను, ఆ తరువాత చారిత్రక గ్రంథములైన యెహోషువ, న్యాయాధిపతులు, 1,2 సమూయేలు, 1,2 రాజులు, 1,2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, గ్రంథములను, చివరగా యెషయా గ్రంథమును, క్రీస్తు పూర్వము 150వ సంవత్సరములో దానియేలు, యోబు, క్రీస్తు పూర్వము 1వ శతాబ్ధములో పరమగీతము, విలాపవాక్యములు, రూతు, ఎస్తేరు తదితర గ్రంథములను అనువదించియుండవచ్చని భావిస్తున్నారు.

*సెప్టువజింటు*

పాత నిబంధన లేఖనములను హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి అనువదించిన యూదు పండితులను 'సెప్టువజింటు' అను పేరుతో వ్యవహరిస్తున్నారు. లాటిన్ భాషా యందు "సెప్టువజింట' అనగా 70 అని అర్థము. పాత నిబంధన లేఖనములను గ్రీకు భాషలోకి అనువదించిన యూదు పండితుల సంఖ్య 70గా విశ్వసించడంతో ఆ అనువాదకర్తలను 'సెప్టువజింటు' గా వ్యవహరిస్తున్నారు. సెప్టువజింట అనే లాటిన్ పదమును సంఖ్యారూపములో రోమన్ అంకెలను ఉపయోగించి LXX తో సూచిస్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...