📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 💠 *తొలినాళ్లలో పాత నిబంధన గ్రంథము యొక్క స్వరూపము*💠 👉 ప్రస్తుతము బైబిలునందు పాత నిబంధన గ్రంథము (యూదుల పవిత్ర లేఖనము) లో ఉన్న 39 పుస్తకములు సెప్టువజింటు భాషాంతరములో ఉన్నవే. క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము నాటికి హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి ఈ పుస్తకములన్నిటినీ అనువదించారు. అప్పట్లో వాటిని ఒకే గ్రంథముగా సంకలనము చేయబడలేదు. యూదుల పవిత్ర లేఖనముల్లో ఏయే గ్రంథములను ఏయే ఆధారముల ప్రకారము చేర్చియున్నారో చెప్పుటకు నిర్దుష్టమైన ఆధారములు లేవు. అయితే పాత నిబంధన గ్రంథములోని పుస్తకములను యేసు క్రీస్తు కాలములోనే మూడు ప్రత్యేక భాగములుగా వర్గీకరించియున్నట్లు, ఆ వర్గీకరణను యేసు క్రీస్తు సైతము సూచించినట్లు బైబిలు లేఖనము స్పష్టము చేయుచున్నది. *"అంతట ఆయన_మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు నేరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరివని వారితో చెప్పెను" లూకా 24 : 44.* 👉 పై వచనము యేసుక్రీస్తు పలికిన మాటలు. క్రీస్తు కాలములో పాత నిబంధన గ్రంథమును ఒకే గ్రంథముగా కాకుండ మోషే ధర్మశాస్త్రము, ప్రవక్...