📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 ✳ *బైబిల్ ప్రకారము సృష్టి క్రమములో నాలుగో రోజు సూర్యుడు సృజింపబడ్డాడా...???...✍* 👉చాలా మంది బైబిల్ ని అర్ధం చేసుకోలేక తప్పుడు అర్ధాలు కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి క్రైస్తవులు చాలా మంది బైబిల్ ఒక పుస్తకము లాగానే చదువుచున్నారు *కాని జ్ఞానం ఇచ్చే గ్రంధంలా చూడటం లేదు.* 👉 బైబిల్ జ్ఞాన గ్రంధం అయినప్పటికి దానిని చదివినంత మాత్రాన జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటే. బంగారము కూడా అంత సులువుగా దొరకనప్పుడు బంగారము కంటే శ్రేష్టమైన బైబిల్‌లోని జ్ఞానం మనకు ఎలా దొరికేస్తుంది. *బైబిల్ పరిశోధిస్తే జ్ఞానం దొరుకుతుంది.* 👉 మనకు లభిస్తున్న బంగారం ఏవరో త్రవ్వుతారు, ఏవరో శుద్ధి చేస్తారు, ఏవరో విక్రయిస్తారు, అప్పుడు మీరు కొనుగోలు చేసి ధరిస్తారు. *కాని బైబిల్ వున్న జ్ఞానం అలాంటిది కాదు. మీరే వెతకాలి, మీరే త్రవ్వాలి, మీరే శుద్ధి చేయాలి , మీరే ధరించాలి.* 👉బైబిల్ ని కథల పుస్తకం లాగానో న్యూస్ పేపర్ లాగానో చదివితే ఎమ్ అర్ధం కాదు. *బైబిల్ ను దేవుని వాక్యం అని గుర్తించి మనస్సు పెట్టి చదివితే దేవుని మాటలు అర్థమవుతాయి...* *...