ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు

——— సామెతలు ——— 
      క్లుప్త ధ్యానములు ( Part: 14)

*అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు  పరస్త్రీనుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యౌవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది. దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును. దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగిరారు జీవమార్గములు వారికి దక్కవు*. 
     సామెతలు 2:16-19

♻️ *జారస్త్రీ*

🔸మృదువుగా మాట్లాడుతుంది 
🔸మృత్యువు ఒడిలోనికి చేర్చుతుంది. 
🔸తన ప్రియుని విడచిపెడుతుంది 
🔸దేవుని నిబంధన మరచిపోతుంది 
🔸దాని మార్గం మృత్యు మార్గం
🔸జీవమార్గంలో దానికి ప్రవేశం లేదు. 

👉 *జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము. వెళ్లినయెడల పరులకు నీ యౌవన బలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు*.  సామెతలు 5:8,9
 
👉 *వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట*. (సామెతలు ‪23:27‬)

 👉 *నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము*.  సామెతలు 31:3
 
👉కానీ, నీవు చెయ్యాల్సింది ఏమిటంటే? *నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి*. 
     సామెతలు 5:18,19
 
👉ఇంకా వివాహం కాకపొతే, ఆ సమయం వచ్చేవరకు సాతాను వలలో చిక్కకుండా, నిన్ను నీవు కాపాడుకో. అంతేగాని,  *వ్యభిచరింప వద్దు*. 
              మత్తయి ‪19:18‬ 
 
పరిశుద్ధ గ్రంధం వ్యభిచారమనే పాపమును అన్ని పాపముల కంటే ఘోరమైన పాపముగా పేర్కొన్నది. కారణం? ఏ పాపమైనా ఒక్కరి వల్లనే జరుగుతుంది. కాని వ్యభిచారము మాత్రము ఒక వ్యక్తి పాపము చేస్తూ మరొకరిని పాపములోనికి లాగుతుంది. 
 
*ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును*. (మత్తయి ‪5:28)‬ (ఒక పురుషుని మోహపుచూపుతో చూచు ప్రతిస్త్రీ అప్పుడే తనహృదయమందు అతనితో వ్యభిచారము చేసినదగును.) అంటే? చేసినా? చూచినా? రెండూ ఒక్కటేనా? కానే కాదు. చేసినదానికీ, చూచినదానికీ శిక్ష ఒక్కటేనా? కానే కాదు. 
మరెందుకిలా? మోహపు చూపుతో చూస్తే, అది హృదయంలో ముద్రించబడి, ఆతప్పుచెయ్యడానికి శరీరాన్ని బలవంతం చెయ్యొచ్చు. అట్లాంటి చూపులే లేకపోతే? ఆ తప్పు చేసే అవకాశమే లేదు. అందుకే ఆయన వేళ్ళతోసహా ఆ పాపమును పెకిలించి వెయ్యాలని అట్లా చెప్పారు. అంతేగాని, చేసిన వాడు, చూచినవాడు ఇద్దరూ ఒక్కటే అని మాత్రం తలంచకూడదు. చేసినవాడికి చేసినంత శిక్ష. చూచినవాడికి చూచినంత. 

👉అయితే, నేటి దినాలలో, నూతనమైన, వక్రమైన బోధలు పుట్టుకొస్తున్నాయి. 
*కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచు చున్నారు* .... యూదా 1:4
 
మన మంచి పనులు దేవుని రాజ్యం చేర్చలేవు. కేవలం ఆయన 'కృప' మాత్రమే నిత్య రాజ్యం చేర్చగలదు. కాబట్టి వ్యభిచారం చేసినా తప్పేమి కాదు. దానికి శిక్షేమి లేదంటూ...ఆయన కృప మనలను రక్షిస్తుంది. మంటి నుండి తీయబడిన శరీరం మన్నై పోతుంది. ఆత్మ మాత్రమే దేవుని యొద్దకు వెళ్తుంది. కాబట్టి, ఆత్మ పరిశుద్ధంగా వుంటే చాలు. నశించిపోయే శరీరానికి పరిశుద్ధత అవసరం లేదు. అనేది వీరి వక్ర బోధ. శరీరం మాలిన్యమైపోయాక, ఆత్మ ఎట్లా పరిశుద్ధంగా వుండగలుగు తుంది? అది సాధ్యం కానే కాదు. అందుకే పౌలు గారు ఈ రీతిగా మాట్లాడు తున్నారు. *శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.  * 2కొరింధీ 7:1
 
దేవుని కృపకు కూడా కొన్ని పరిధులుంటాయి. నేనెట్లా జీవించినా దేవుని కృప నన్ను రక్షిస్తుందిలే అనుకోవడం అవివేకం. తప్పు చేసినవాడు ఎంతటి వాడైనా, పశ్చాత్తాప పడకపోతే, శిక్ష అనుభవించ తీరవలసిందే. 

జార స్త్రీ జోలికి పోకుండా మనలను కాపాడగలిగేది “జ్ఞానము” అనగా దేవునియందు భయభక్తులు కలిగియుండం. అది మాత్రమే మనలను ఆ మృత్యువునుండి రక్షించగలదు. 

వద్దు! అజ్ఞానులవలే జీవించొద్దు! వారి ఆలోచనలో చేరొద్దు! వారితో సహవాసం రద్దు! యెహోవాయందు భయభక్తులుకలిగి జ్ఞానులవలే నడచుకొనుటకు మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...