✳ *దేవుని సేవ-పరిచర్య* ✳
(నాల్గవ భాగము)
*దేవుని సేవ-పరిచర్య రకములు-1*
Ephesians(ఎఫెసీయులకు) 4:13,15
13 *పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను*
15. *ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము*
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:4,5,6,7,8,9,10,11
4. *కృపా వరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే_.*
5. *మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే*
6. *నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే*
7. *అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.*
8. *ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,*
9. *మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను*_
10. _*మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి*_.
11. _*అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు*_.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:28,29,30
28. _*మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను*_.
29. _*అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?*
30. _*అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?*
👉 ప్రియులారా ఇంతవరకు మనం దేవుని పిలుపు, ఏర్పాటు కోసం ధ్యానించాము! *ఇప్పుడు సేవలో గల రకాలు కోసం ధ్యానం చేద్దాం!*
సంఘం అభివృద్ధి చెందడానికి దేవుడు , సంఘంలో ప్రతీ ఒక్కరికి వారి వారి విశ్వాస పరిమాణం ప్రకారం, కొన్ని వరాలు-ఫలాలు ఇస్తారు!
*కొందరిని ప్రత్యేకమైన సేవకోసం ఎన్నుకొంటారు! వారు అనేక రకాలుగా ఉన్నారు.*
👉 వీరిని రెండు వర్గాలు చేసారు.
*1. Fivefold Ministry- ఐదు మడతల/ఐదు మెట్ల సేవ,*
*2. Tenfold Ministry- పదిమెట్ల / పది మడతల సేవ .*
*Fivefold ministry is a part of Tenfold Ministry.*
*ఈ Fivefold ministry లో సేవ చేసేవారు చాలా వరకు fulltime minstry(సంపూర్ణ సేవ) చేస్తారు.*
*మిగతా ఐదు భాగాల వారు, తమ తమ పనులు చేసుకొంటూనే part time ministry చేస్తారు.*
👉 *ఈరోజు Fivefold ministry కోసం ధ్యానిద్దాం!*
వీరు
*1. అపోస్తులులు,*
*2. ప్రవక్తలు,*
*3. భోదకులు,*
*4. కాపరులు,*
*5. సువార్తికులు/ఉపదేశకులు,*
మిగతా ఐదు భాగాలు :
6. అద్భుతాలు చేసేవారు,
7. భాషలు మాట్లాడువారు/భాషలకు అర్ధం చెప్పేవారు,
8. ఉపకారాలు చేసేవారు,
9. పరిచర్య చేసేవారు,
10. ప్రభుత్వాలు చేసేవారు.
*రక్షించబడిన ప్రతీ విశ్వాసి, వీటిలో ఎదో ఒకటి తప్పకుండా చేయాలి. లేకపోతే ఆ విశ్వాసి నులివెచ్చగా ఉన్నట్లు లెక్క!*
👉 ఈ Fivefold ministry లో మొదటగా
🔹 *ఉపదేశకులు*: సువార్తికులు/ఇవాంజిలిస్టులు, బైబిల్ టీచర్లు, మిషనరీలు ఈ లెక్కలోకి వస్తారు. సువార్త ప్రకటించడం, విశ్వాసులను బలపరచడం వీరిపని.
తర్వాత
🔹 *కాపరులు*:
ఈ Fivefold ministry లో చాల ముఖ్యమైన వారు. సువార్తికుని పనిచేస్తూనే సంఘకాపరిగా భాద్యత నిర్వహించాలి.
తర్వాత
🔹 *బోధకులు*: సంఘకాపరిగా చేస్తూనే సంఘాన్ని హెచ్చరిస్తూ-సరిచేస్తూ దేవుని సందేశాలు అందించడం వీరి పని.
తర్వాత
🔹 *ప్రవక్తలు*: వీరు పరిశుద్ధాత్మ పూర్ణులై, దేవుని దగ్గర అనునిత్యం కనిపెడుతూ, దేవుని ప్రవచనాలు- వర్తమానాలు ప్రజలకి తెలియజేస్తూ సంఘాన్ని సరిదిద్దే వారు.
👉పై నాలుగు వరాలు కలవారు లేక నాలుగు భాగాలులో భాగస్తులై, ఆ ఆధిక్యత గలవారిని అపోస్తులులు అంటారు. అనగా సువార్త ప్రకటిస్తూ, సంఘాలలో భోదిస్తూ, అద్భుతాలు చేయగలిగే వరాన్ని కలిగి, ప్రవచన వరం కలిగి సంఘాన్ని ముందుకు నడిపించేవారే అపోస్తులులు.
ఇది అత్యంత గొప్పవిషయం!
👉ఈ Fivefold ministry లో అపోస్తలులు, ప్రవక్తలు top ఎఫెసీ 2:20 ప్రకారం. Ephesians(ఎఫెసీయులకు) 2:20
20. *క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు*_.
ప్రియ దైవసేవకుడా!
👉నీవు సువార్తికుడివా? కాపరిగా మారుటకు ప్రయత్నం చేయు.
కాపరివా- ప్రవచనవరం కోసం, అద్భుతాలు చేసే వరం కోసం ప్రయత్నం చేయు.
ప్రవక్తగా, అపోస్తులుడిగా మారడానికి ప్రయత్నం చేయమని ప్రభుప్రేమతో ప్రోత్సాహపరుస్తున్నాను.
అయితే
*దానికోసం గొప్ప ప్రార్ధనా శక్తి అవుసరం. పరిశుద్దాత్ముని అభిషేకం పొందుకొని అద్భుతాలు చేసే శక్తిని వాడుతూఉండాలి.*
(operate చెయ్యాలి) అప్పుడు దేవుడు నీసేవను ఆశీర్వదిస్తారు. నిన్ను ఒక లైట్ హౌస్ లా వాడుకొంటారు!
అట్టి కృప ధన్యత దైవ సేవకులందరికి కలుగును గాక!
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి