✳️ *తప్పు సిద్ధాంతం* ✳️
(మొదటి భాగము)
1️⃣ *సత్యాన్నే తప్పు దారి పట్టించడం*
_యిర్మీయా 3:19-25_
యిర్మియా 3: 20,25
*అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాస ఘాతకులైతిరి; ఇదే యెహోవా వాక్కు.*
*సిగ్గునొందినవారమై సాగిలపడుదము రండి, మనము కనబడకుండ అవమానము మనలను మరుగుచేయును గాక; మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులును మన బాల్యమునుండి నేటివరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినవారము.*
ఆది కాలం నుండే తప్పుడు సిద్ధాంతములు సంఘ జీవనాన్ని పట్టి పీడించాయి ఇప్పటికి అదే పరిస్థితి.
*తప్పుడు సిద్ధాంతమంటే అసలు అర్థమేమిటి?*
👉 స్వల్ప విషయాలలో ఇతరులను తప్పు సిద్ధాంతములు చెబుతున్నారని ఆక్షేపించడం తేలికే గాని *అసలు తప్పు సిద్ధాంతం అంటే ఏమిటో నిజంగా ఎంతమంది తెలుసు?*
పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మాటిమాటికీ దేవునికి దూరంగా వెళ్తుంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా వారిని వెనక్కు పిలిచాడు. కొన్ని సార్లు వారు బాహాటంగా అన్య దేవుళ్లను ఆరాధించారు. మిగిలిన సమయాల్లోనైతే యెహోవాను పెదవులతో కీర్తించారు గాని వారి హృదయాలు మాత్రం ఆయనకు దూరంగా ఉన్నాయి. ఈ విధంగా తప్పు త్రోవ పట్టడం క్రమక్రమంగా జరిగింది.
*తప్పు సిద్ధాంతం ఒక్కసారే విరుచుకుపడదు. అది దేవుని ప్రజల మధ్యకు చాప క్రింద నీరులాగా సాంప్రదాయ పధ్ధతి వేషంలోనే చొరబడుతుంది.* వారు దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరిచారని(వ 21) యిర్మీయా వ్రాస్తున్నాడు.
*దేవుని ప్రజలపై ఏదో ఒక కొత్తది, నీచమైనది అయిన దోషం దాడి చెయ్యలేదు. తమకు అర్థమైన దేవుని సత్యాన్నే వారు తమ నీచ ప్రవర్తనకు పాడుచేశారు.*
👉 తమ భర్తను వదిలి వేరొకడితో ఉంటున్న విశ్వాస ఘాతుకురాలైన భార్యలాగా వారు ప్రవర్తిస్తున్నారని దేవుడు అంటున్నాడు (వ 20). యెహోవా పట్ల వారి హృదయంలో ఏమీ వేడి లేదు. *తప్పుడు నమ్మకం వెనువెంటనే ప్రవేశించాయి.*
*సత్యం ఎలా పాడైపోతుందో అర్ధం చేసుకోవడం కష్టం కాదు. ఈనాడు మన ఎదుట ఉన్న సత్యదోషాలు అనేకం సత్యాన్ని మెలిదిప్పి, లేక దానిలో నుండి విపరీతమైన అర్థాలు బలవంతంగా లాగినందువల్లనే వచ్చాయి.*
*1* 👉 *దేవుని ప్రేమ* అనే సత్యాన్ని ఎలా తప్పు త్రోవ పట్టించారో చూడవచ్చునో చూడండి -
*"దేవుడు ప్రేమ. కాబట్టి శిక్షించాడు. కాబట్టి మనుషులు తమ ఇష్టం వచ్చినట్టు పాపంలో జీవించవచ్చు.*
*2* 👉 *దేవుని తీర్పు* అనే సత్యాన్ని -
*''దేవునికి కృప లేదు. తన ప్రజలు ఏమాత్రం తప్పటడుగు వేసిన మీదికి దూకి శిక్షించాలని చూస్తున్నాడు''* అని పాడు చేశారో.
*3* 👉 *బాప్తీస్మం* సత్యాన్ని
*''బాప్తీస్మం మాత్రం తీసుకుంటే చాలు, అదే రక్షణ కారణం''* అని పాడు చేశారు.
*4* 👉 *ప్రభువు బల్ల* సత్యాన్నే
*'' దాన్ని ఎలా ఆచరించినా సరే, అసలంటూ ఆచరిస్తే చాలు, దీవెనలు"* అని పాడు చేశారు.
*మానవుని స్వార్థం వల్ల పాడైపోయిన తప్పుడు సిద్ధాంతాల రూపుదాల్చి సంఘ జీవనాన్ని, సాక్షాన్ని నాశనం చేయగలదు. సత్యాన్ని తప్పు త్రోవ పట్టించకుండా ప్రభువు మనలను కాపాడాలని ప్రార్థన చేద్దాం.*
2️⃣ *అవిధేయత ఆరంభం*
_యూదా 1:1-8_
యూదా 1: 5- 7, 17-18, 20,21_
*"మనకందరికి కలిగెడు రక్షణను గురించి"* ఒక లేఖ వ్రాయాలని యూదాకు ప్రేరేపణ కలిగింది. *"పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని"* విశ్వాసులను వేడుకునే అత్యవసర పరిస్థితి కలిగింది (వ 3).
*'పోరాడవలెను' అనేది తీవ్రమైన పదం. విశ్వాసాన్ని అర్థం చేసుకునేందుకు మానసికంగా కృషి చేయాలనీ, ఆ అవగాహనను జీవితంలో ఆచరించేందుకు నైతిక బలం కూర్చుకోవాలనీ దీని భావం.*
3వ వచనం మిగతా భాగంలో విశ్వాసమంటే దేవుడు వెల్లడి చేసిన మొత్తం అంతిమ సంపూర్ణ సత్యం. ఇది సందిగ్దానికి తావు లేనిది. కాబట్టి అర్థం చేసుకోవడానికి ఏ ఆటంకమూ లేదు. కాబట్టే దాని విషయం పోరాడడం తేలిక.
యూదా విశ్వాసులను హెచ్చరిస్తూ ఈ సత్యానికి విరోధంగా కొందరు *"భక్తిహీనులు"* (వ 4) సంఘ సహవాసంలోనికి చొరబడి సత్యాన్ని భ్రష్ఠపరుస్తున్నారు అంటున్నాడు.
👉 ఇందువల్ల సంఘ జీవనం అపవిత్రం అయిపోతున్నది. ఇది సత్యాన్ని పాడు చేసి దోషంగా మార్చే వారి వల్ల కలిగే ప్రమాదం.
ఇలాంటి వారిని యూదా *'భక్తిహీనులు'* అంటున్నాడు దీనిలో *దేవుడంటే ప్రాథమికంగా గౌరవం లేనివారు అనే అర్థం ఉంది.* వారి జీవితాలు వారి చుట్టూ అల్లుకుంటారు గాని, దేవుని చిత్తం పట్ల ధ్యాసే లేదు.
👉 *పాపం చేసేందుకు దేవుని కృపను ఒక సాకుగా వారు వాడుకుంటారు* (వ 4). ఇలా చేయడంలో వారు *'మన అద్వితీయ నాథుడగు ప్రభువైన క్రీస్తును తృణీకరిస్తున్నారు'* (వ 4). అయితే నోటి మాటలతో మాత్రం ఆయన పట్ల విధేయత ప్రకటిస్తున్నారు.
వారి పైకి రాబోయే తీర్పును గురించి యూదా హెచ్చరిస్తున్నాడు. *ఇలా చేయడంలో అలాంటి వారిని అనుసరించి వెళ్లే విశ్వాసులను కూడా హెచ్చరిస్తున్నాడు.*
👉 అతడు రెండు ఉదాహరణలు ఇచ్చాడు.
🔹 *ఒకటి, ఐగుప్తు నుండి విముక్తులైన ఇశ్రాయేలు ప్రజలు* (వ 5),
🔹 *రెండు దేవదూతలు* (వ 6). ఈ రెండు గుంపులు మరెవరికీ లేని ఆధిక్యతలు ఉన్నాయి.
*ఈ ఇద్దరి పతనానికి అవిధేయత కారణం.*
🔺 *తప్పు సిద్ధాంతాలు సత్యాన్ని అర్థం చేసుకోలేని మానసిక అసమర్థతలో నుంచి పుట్టవు. వీటికి కేవలం కారణం అవిధేయతే.* ఇది అవగాహనా శక్తికి సంబంధించినది కాదు, మానవుని సంకల్పానికి సంబంధించినది.
*అవిధేయత అనేది స్థిరపడితే దానిని సమర్ధించే ఏ వాదాన్నైనా మనసు సమ్మతిస్తుంది. మనం పొరపాటు చేస్తున్నాం గనుక పొరపాటును నమ్ముతాం.*
*మనలను మనం మరొకసారి ప్రభువుకు సమర్పించుకుందాం. ఆయన మార్గాలలో నడిచే విధేయతనివ్వమని ప్రార్థన చేద్దాం.*
3️⃣ *మూల సత్యాలను నిరాకరించేది*
_1 యోహాను 2:18-25_
తన మొదటి పత్రికలో యోహాను నిజమైన దేవుని బిడ్డలో ఉండవలసిన మూడు గుణాలు రాస్తున్నాడు.
*యోగ్యమైన ప్రవర్తన,*
*యోగ్యమైన సహవాసము,*
*యోగ్యమైన నమ్మకము.* 18-19 వచనాలలో ప్రభువుకు చెందిన ప్రజలు, చెందని ప్ర్రజలు వీరిద్దరి మధ్య నిజమైన సహవాసం ఉండడం అసాధ్యమని చెబుతున్నాడు.
ఇలా సహవాసం లేకపోవడం నమ్మకాల్లో ప్రాథమికమైన తేడాలవల్లనే. అలాగైతే *సరియైన నమ్మకం లేక సిద్ధాంతానికీ, తప్పు సిద్ధాంతానికీ తేడా ఎలా తెలుసుకోగలం?*
సత్యానికీ, తప్పుకూ ఉన్న తేడాను గురించి యోహాను నిష్కర్షగా చెప్తున్నాడు (వ.21). అభిప్రాయ భేదాలన్నీ వ్యక్తిగత అవగాహనలో తేడాలకు సంబంధించినవి కావు. అవి రైటు,తప్పు అని విభజించదగ్గ తేడాలు కావచ్చు.
*నిజమైన విశ్వాసులంతా సామాన్యంగా నమ్మే మూల సత్యం ఒకటుంది. ఈ సత్యాన్ని మీరి బయటకు వెళ్ళడం అంటే భ్రష్టత్వమే.* ఈ సత్యాన్ని గ్రహించడంలో కష్టమేమీ లేదు అని యోహాను ఖచ్చితంగా రాస్తున్నాడు.
*సత్యమన్నది మానవుని ఊహాగానాల్లోనిది కాదు. అది దేవుని ద్వారా స్పష్టంగా సంపూర్ణంగా వెల్లడి చేయబడింది.*
🔺 *ఈ మూల సత్యంలో మొదటి భాగం*
👉 *మన ప్రభువైన యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని గురించినది. ఆయన మానవత్వంలో, ఆయన దైవత్వాల గురించినది. ఆయన యేసు అనే మనిషి* (వ.22).
👉 అంతేగాక *దివ్య త్రిత్వంలో రెండవ వాడైన కుమారుడు* (వ.23). దీన్ని నిరాకరించే వాడెవడైనా సరే వాణ్ణి యోహాను అబద్దికుడు, క్రీస్తు విరోధి అంటున్నాడు.
🔺 *ఈ మూల సత్యంలో రెండవ భాగం* దేవుని వెల్లడింపు గురించినది
*“మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి”* (వ.24).
*దేవుడు మనుషులకు అర్ధమయ్యే రీతిలో తన సత్యాలను వెల్లడించి తన పరిశుద్ధ గ్రంథంలో వాటిని సేకరించి ఇచ్చాడు. అలాటి వెల్లడింపు ఇవ్వబడిందన్న సత్యాన్ని త్రోసి పుచ్చడం బహు ప్రాధమికమైన పోరాపాటు.*
*నిత్య జీవం అనుగ్రహిస్తానన్న వాగ్ధానమే* (వ.25). విమోచన కార్యానికి గుర్తు.
*అందువల్ల మూల సత్యాలలో మరొక భాగం మన ప్రభువు మరణ పునరుత్థానాలు, సిలువకార్యం.*
*యోహాను ఇచ్చిన సిద్ధాంతాల జాబితాలోనే మానవుని గురించిన సత్యం ఇమిడి ఉంది. భ్రష్ట బోధను గురించిన యతని కంగారు మానవుని పాపస్థితిని అతడు ఒప్పుకుంటున్నట్టు తెలియజేస్తున్నది.* మనిషికి ఇంతకు ముందే ఆత్మీయ జీవితం ఉంటే నిత్యజీవం గురించి వాగ్ధానం చేసే అవసరమేముంది?
అందువల్ల మూల సూత్రాలను నాలుగు భాగాలుగా క్రోడీకరించవచ్చు.
*1* - *మనిషిని గురించిన సత్యం*
*2* - *యేసుక్రీస్తును, దేవుణ్ణి గురించిన సత్యం,*
*3* - *విమోచనను గురించిన సత్యo,*
*4* - *వెల్లడింపును గురించిన సత్యం.*
*సత్యానికి అంటిపెట్టుకుని ఉండవలసిన ఆవశ్యకతను దేవుడు మన మనస్సుల్లో ముద్రించాలని అడుగుదాం.*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి