ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మహోన్నతమైన పిలుపు...✍*

✳ *దేవుని సేవ-పరిచర్య* ✳

(రెండవ భాగము)

2⃣ *మహోన్నతమైన పిలుపు...✍*

      Numbers(సంఖ్యాకాండము) 16:9

*తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడుచున్నదా*



Ephesians(ఎఫెసీయులకు) 4:2,3

*మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,* 
3. *ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.* 
   
Ephesians(ఎఫెసీయులకు) 1:4,5,6

4.
*ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,* 
5. *తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,* 
6. *మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.* 

   Ephesians(ఎఫెసీయులకు) 1:12

12. *దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను(లేక,మనకొక స్వాస్థ్యము నేర్పరచెను) . ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.*  
  
👉కాబట్టి నీవు రక్షించబడటం అది దేవుని కృప వలన మాత్రమే. నీ యొక్క సొంత నీతివలన గాని,నీయొక్క స్తితిగతుల వలన గాని ఎంతమాత్రము కాదు!

👉  ఇశ్రాయేలీయులతో అంటున్నారు: దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోడానికి మీ స్వంత నీతి గాని, మీరు ఎక్కువ జనాంగము అయినందున గాని కాదు గాని కేవలం తన గొప్ప కనికరం వలననే ఏర్పరచుకొన్నారు! ద్వితీ 7:7
   
Ephesians(ఎఫెసీయులకు) 2:1,5

1.మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను. 
5.కృపచేత మీరు రక్షింపబడియున్నారు.

మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింప బడితిరి. ఎఫెసీ 2:5,8.  
ఇది మనవలన కలిగినది కాదు.
 *కేవలం దేవుని వరమే!!!*

👉ఒకానొకప్పుడు ప్రజ కానివారం అనగా దేవుని ప్రజలు కానివారం గాని దేవుడు ఇప్పుడు ప్రజగా చేసారు! ఇశ్రాయేలీయులతో సహా పౌరులనుగా చేసారు! ఎఫెసీ 2:11-32, 3:6.

👉 అయితే, మన పిలుపును ఏర్పాటును మనం కాపాడుకొంటున్నామా?లేదా?

పేతురు గారు కూడా ఇదే అంటున్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజగా మారారు, ఒకప్పుడు కనికరింపబడక, ఇప్పుడు కనికరింపబడితిరి. 1పేతురు 2:10,  ఇంకా అంటున్నారు

1 Peter(మొదటి పేతురు) 2:9

9.అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు. 

👉మన తండ్రి ఏర్పాటు చూసారా?

1⃣ *ఏర్పరచబడిన వంశము,*

2⃣ *రాజులైన యాజక సమూహము:*
 రాజులుగాను, యాజకులనుగాను చేసారు. ఒకనాడు దేవునితో కలసి రాజ్యమును రాజులుగా ఏలుతాము!  

  ప్రస్తుతం బలిపీటం యొద్ద నిలిచి, దేవునికి-ప్రజలకి మధ్య మధ్యవర్తిగా ప్రజల పాపాలు, అపరాధములకోసం కన్నీటితో దేవునిదగ్గర వేడుకోవాలి. వాళ్ళ రక్షణార్ధం కన్నీటితో వేడుకోవాలి. 
ప్రార్ధన విజ్ఞాపనలనే ధూపములు నైవేద్యాలు అర్పించాలి!

3⃣ *పరిశుద్ద జనము:* 
నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలని దేవుడంటున్నారు.

4⃣ *దేవుని సొత్తయిన ప్రజలు:*
 ఇశ్రాయేలూ నీవు నా సొత్తు! అని సెలవిచ్చారు దేవుడు! యెషయా 43

👉ఇన్ని గొప్ప అధిక్యతలు ఇచ్చారు దేవుడు.

 *ఎందుకు?!!!* 

👉 చీకటి నుండి తనవెలుగులోనికి మిమ్ములను పిలచినవాని గుణాతిశయములను ప్రచురము చేయడానికి!!!

*దేవుని గుణతిశయములు* అనగా
1.కనికరము,
2.దయ,
3.దీర్ఘశాంతము,
4.విస్తారమైన కృపాసత్యములు,
5.వేయి వేలమందికి కృపను చూపువాడు,
6.అపరాధమును పాపమును క్షమించు వాడు
7.దోషులను నిర్దోషిగా ఎంచని వాడు.
(నిర్గమ 34:6,7)

*మరి నీవు ప్రచురం చేస్తున్నావా?*

Mark(మార్కు సువార్త) 16:15

15. *మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి .* అన్న యేసయ్య చివరి ఆజ్ఞ గుర్తుందా???!!! 
మరి ప్రకటిస్తున్నావా లేదా???

*మొదటగా నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొన్నావా?*
 2పేతురు 1:10

*మరి ప్రార్ధనలో కనిపెట్టి అడిగావా?* 

*ప్రభువా నేను ఏ రకంగా నీ సేవ చేయడం నీ చిత్తము?*
 
*నా జీవితంలో నీ చిత్తమేమిటి?*
 
*ప్రార్ధన ద్వారానా, ప్రకటించుట ద్వారానా, నీ సేవకు ఇవ్వడం ద్వారానా, పరిచర్య చేయడం ద్వారానా, పాటగాడిగానా, హెచ్చరించుటలోనా . . .అని ఎప్పుడైనా ప్రార్ధించావా? లేదా నులివెచ్చగా ఉన్నావా?*

*ఇంతగొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగు తప్పించుకొందువు?*

కాబట్టి ప్రియ దేవుని బిడ్డా!
 నీ పిలుపును, ఏర్పాటును తెలుసుకొని, దానికి తగినట్లు జీవించమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను!
దేవుడు మిమ్ములను దీవిచును గాక!!!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...