ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు

——— సామెతలు ——— 
      క్లుప్త ధ్యానములు ( Part: 13)

చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు. వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనులు. 
            సామెతలు 2:13-15

♻️ *అజ్ఞానుల త్రోవలు అంధకారం:*

🔸చీకటి పాపమునకు సాదృశ్యం 
🔸పాపం చేసేవారు చీకటినే కోరుకుంటారు. 
🔸చీకటినే ప్రేమిస్తారు. 
🔸కారణం? చీకటిలో చేసే కార్యాలు కనిపించవుకదా అందుకు. 
🔸మనుష్యులు చూడకపోయినా దేవుడు చూస్తారు కదా? అందుకేగదా వారు దేవుడే లేదంటున్నది. 
🔸అనేకులు దేవుడున్నాడని ఒప్పుకొనినాగాని, ఆయన యందు భయభక్తులు నిలపడానికి మాత్రం ఒప్పుకోరు. 
🔸వీరు దేవునియందు భయభక్తులు లేనివారు కాబట్టి, వెలుగై యున్న దేవునిని అనుసరించరు. 
🔸అక్రమమైన జీవితాన్ని కొనసాగించడానికి, సక్రమమైన, యదార్ధమైన మార్గాన్ని విడచిపెట్టేస్తారు. 
🔸వీరి జీవితాలు గాఢాంధకారమే. 

🔸వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
యోహాను 3:19

🔸భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు. సామెతలు 4:19

♻️ *అజ్ఞానులు కీడుచేయ సంతోషించుదురు*

అజ్ఞానులు లేదా మూర్ఖులు లేదా భక్తిహీనులు వీరి ఆనందానికి మూలము ఏమిటంటే? 
🔹ఇతరులకు కీడు చేయడమే. 
🔹అతి మూర్ఖంగా ప్రవర్తించడంతోనే వీరి ఆనందం ముడిపడివుంది. 
🔹చెడుకార్యాలు ఎట్లా చెయ్యాలో వీరు అభ్యసిస్తారు (రోమా 1:32) 
🔹అదొక ఆటగా వారు భావిస్తారు. (సామెతలు 10:23)
🔹బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము
             సామెతలు 15:21

♻️ *అజ్ఞానుల త్రోవలు వంకరవి:*

అజ్ఞానుల త్రోవలు వంకర త్రోవలు. వారుకావాలనే వంకర త్రోవలను, అడ్డదారులను సిద్ధం చేసుకుంటారు, లంచాలు వంటి అక్రమ సంపాదన,  అన్యాయపు సిరి ఈకోవలోనికే వస్తుంది. కానీ వారిజీవితాల్లో శాంతి, సమాధానానికి చోటే ఉండదు. ఉన్నట్లు పైకి నటిస్తారు తప్ప, అంతరంగం మాత్రం, అల్లకల్లోలమైన సముద్రములా ఉంటుంది. వారి గమ్యం నిత్య నాశనం. 

🔸దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము. (సామెతలు 21:8)

🔸వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు. (యెషయా 59:8)

🔸తమ వంకరత్రోవలకు తొలగిపోవువారిని పాపముచేయువారితో కూడ యెహోవా కొనిపోవును (కీర్తనలు 125:5)

వద్దు! అజ్ఞానులవలే జీవించొద్దు! వారి ఆలోచనలో చేరొద్దు! వారితో సహవాసం రద్దు! యెహోవాయందు భయభక్తులుకలిగి జ్ఞానులవలే నడచుకొనుటకు మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక!ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...