——— సామెతలు ———
క్లుప్త ధ్యానములు ( Part: 12)
అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును. సామెతలు 2:9-12
♻️ నిజమైన జ్ఞానము చెడుగు అంతటినుండి కాపాడును:
కీడుకు కారణమైన
🔸చెడ్డమాటల నుండి (12వ )
🔸చెడ్డ బాటలనుండి (13వ )
🔸చెడ్డ చర్యలనుండి (14వ )
🔸చెడ్డ ప్రేరేపణలనుండి (16వ)
♻️ జ్ఞానము దుష్టుల మార్గమునుండి
నిన్ను రక్షించును.
♨️ దుష్టులు:
దుష్టుడు తాను దుష్టత్వమును జరిగించుటయందే ఆనందిస్తాడు. ఇతరులకు కీడు చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. వానికి నెమ్మది ఉండదు. ఇతరులకు నెమ్మది లేకుండా చేస్తాడు. అతడు ఎక్కడవుంటే, అక్కడ దుష్టత్వం ప్రబలుతోంది. వారికి శ్రమ. వారి గమ్యం నిత్యనాశనం.
🔹దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు
సామెతలు 28:5
🔹దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చు చున్నాడు. (యెషయా 48:22)
🔹దుష్టులకు శ్రమ (యెషయా 3:11)
🔹దుష్టులు ఆయనకు అసహ్యులు, (కీర్తనలు 11:5)
🔹దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. సామెతలు 29:16
🔹దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. (యోబు 34:26)
అందుచే,
🔹 భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము. సామెతలు 4:14
🔹 దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.
(కీర్తనలు 1:6)
ఈ నాశనమునుండి తప్పించబడాలి అంటే, జ్ఞానము కావాలి. అదెట్లా లభిస్తుందంటే? యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట ద్వారా మాత్రమే సాధ్యం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి