✳ *నీవు క్రీస్తు వలే రూపాంతరం చెందాలి అంటే?....✍*
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి – (రోమా 12:2)
👉ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన అంశము *“రూపాంతరం”.*
👉 ప్రభువైన యేసు క్రీస్తు భౌతికముగా రూపాంతరం చెందినట్లు *మూడు సువార్తలలో* వ్రాయబడినది. (మత్తయి 17:1-8, మార్కు 9:2-13, లూకా 9:28-36)
🔹 రూపంతరము అను పదమునకు ఉపయోగించిన గ్రీకు పదం *"Metamorphoo",*
👉 అంటే *“మరొక రూపం పొందుట లేదా ఒక రూపం నుండి వేరొక రూపంలోకి మారుట”* అని అర్ధం.
👉 ఒక రోజు యేసు క్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తుండగా భౌతికముగా రూపాంతరం (మార్పు) చెందారు. అయన మరో రూపంలోకి మార్పు చెందారు. అయన ముఖరూపం మారిపోయింది, వస్త్రములు తెల్లనివిగా ధగ ధగ మెరుస్తున్నాయి.
👉మరో మాటలో చెప్పాలంటే *అయన మహిమ శరీరం ధరించారు* (లూకా 9:28-35).
ఈ సంఘటన *త్వరలో యేసు క్రీస్తు సిలువ మరణం పొంది, పునరుద్ధానుడై మహిమలో ప్రవేశించుటను ముంగురుతుగా సూచిస్తుంది.*
(హెబ్రీ 1:3, ప్రకటన 1:12-17), లూకా 24:26 వచనం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. *“కీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా”* అని యేసు క్రీస్తే స్వయముగా చెపుతున్నారు. కనుక యేసు క్రీస్తు అక్కడ రూపాంతరం చెందడం, త్వరలో అయన మహిమలో ప్రవేశిస్తాడు అని ముంగురుతుగా తెలియజేస్తుంది.
👉ఆయన అన్నట్లుగానే సిలువ మరణం పొంది, పునరుద్ధానుడై మహిమలో ప్రవేశించాడు.
*అక్కడ యేసు క్రీస్తు రూపాంతరం చెందినపుడు ఇద్దరు వ్యక్తులు అయనతో సిలువ మరణం గురించి మాట్లాడుతున్నారు. వారే మోషే మరియు ఎలియా* (లూకా 9:30)
♻ *మోషే* ♻
యేసుక్రీస్తు రాకడలో *“చనిపోయిన వారు తిరిగి లేచి, మార్పు చెంది ప్రభువును ఎదుర్కొనుటకు సాదృస్యముగా”* ఉన్నాడు .
♻ *ఏలియా* ♻
*మరణం లేకుండానే ఆకాశమునకు ఆరోహణం అయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది*
(2 రాజులు 2:11)
కనుక ఏలియా ఈ రూపాంతర సందర్భములో *“రాకడ సమయంలో బ్రతికి ఉండి భౌతికముగా మార్పు చెంది ప్రభువును ఎదుర్కోను వారికి సాదృస్యముగా”* ఉన్నాడు.
👉యేసు క్రీస్తు ప్రభువును రాకడలో ఎదుర్కొను సమయం వచ్చినప్పుడు మనం భౌతికముగా రూపాంతరం చెందుతాము. యేసు క్రీస్తు ఈ రూపాంతర సమయములో ఏ విధముగా అయితే భౌతికముగా మార్పు చెంది మహిమని ధరించాడో అదే విధముగా మనం మహిమను ధరించి యేసు క్రీస్తును ఎదుర్కొంటాము (కొలస్సి 3:4, 1 యోహాను 3:2, రోమా 8:17 చదగలరు).
అందుకే పౌలుగారు ఇలా అంటున్నారు.
1 కోరింధి 15:51-52 -
*ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించముగాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.*
🔺 *ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు యేసు క్రీస్తు వలే భౌతికముగా రూపాంతరం చెందాలంటే, అంతకంటే ముందు నీ మనసు రూపాంతరం (మార్పు) చెందాలి.*
🔺 *నీ మనసు మార్పు చెందకపోతే, నువ్వు భౌతికముగా కూడా రూపాంతరం చెందలేవు.*
🔺 *క్రీస్తు రాకడ సమయంలో ఎత్తబడలేవు అనే విషయం గ్రహించు.*
👉అందుకే యేసు క్రీస్తు *“ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు”* అని అంటున్నారు. (యోహాను 3:3)
👉ఈరోజు అనేకులు యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించినా కాని తమ పాప జీవితాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. మారుమనసు లేని వారిగా జీవిస్తున్నారు.
👉యేసు క్రీస్తును విశ్వసించక ముందు ఏ విధముగా అయితే జీవించారో క్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా అలానే జీవిస్తున్నారు.
*కోపం, ద్వేషం, వ్యభిచారం, మోహపు తలంపులు, విగ్రహారాధన సంబందమైన పనులు, బలులు అర్పించిన వాటిని తినడం, సినిమాలు, సీరియళ్ళకు బానిసలుగా ఉండుట, ధనాపేక్ష, అబద్దాలు, అన్యాయం, మోసం, దురాశ, లంచాలు, ఇంకా అనేకమైన పాపపు క్రియలలోనే జీవిస్తున్నారు.*
కోపపడుడి గాని పాపము చేయకుడి; *సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచి యుండకూడదు.*
ఎఫెసీ. 4:26
👉మన శరీరం లోకి వెళ్లిన ఆహారం
24 గంటల్లో....మలినంగా బయటికి వెళ్లిపోవాలి.లేక పోతే జబ్బులు.
👉మన శరీరం లోకి వెల్లిన నీరు 4 గంటల్లో బయటికి వెళ్లిపోవాలి. లేకపోతే....జబ్బులు
👉మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా బయటికి వెళ్లిపోవాలి...లేకపోతే..మనం రోగస్థులం అవుతాం..
♻ *మరి మనలోకి చేరిన కోపం, అసూయ, ద్వేషం,...మోసం..*
ఇలాంటివన్నీ
సంవత్సరాలుగా మనలోనే ఉంటే....ఏమౌతుందో తెలుసా...
*మనం దినదినము ఆత్మీయ రోగగ్రస్తులము అవుతాము*..
📖బైబిలు వాక్యము ఏమి చెబుతుంది ... *ఎఫెసీ. 4:26* కోపపడుడి గాని పాపము చేయకుడి; *సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచి యుండకూడదు.*
మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్నా.....
నిజానికి మనం రోజూ కొద్దీ కొద్దీ గా మరణిస్తున్నాం.
మనకు వయసు పెరిగితే...ఆయుష్షు తగ్గినట్టా ,పెరిగినట్టా?...
👉 మనం ప్రతి రోజూ...నెగెటివ్ ఎనర్జీ లతో కొద్ది కొద్దిగా ఆత్మీయంగా మరనణిస్తున్నామన్న చేదు నిజాన్ని త్వరగా గ్రహించాలి,ఒప్పుకోవాలి...
♻ *మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని....మన ఆత్మీయ జీవితాల్ని మృతప్రాయం చేస్తున్న కోపాన్ని,ఒత్తిడిని,ద్వేశాన్ని, బద్ధకాన్ని ,అనారోగ్యాన్ని....ప్రతి రోజూ ప్రార్థన, వాక్యద్యానం చెయ్యడం ద్వారా ఆత్మ శక్తిని ఎక్కువగా పొంది వాటిని దూరం చెయ్యాలి.*
👉బైబిలులో కొలస్సి సంఘము కూడా క్రీస్తును విశ్వసించినప్పటికి వారి మనసు మాత్రం రూపాంతరం చెందలేదు. అందుకే పౌలుగారు వారిని హెచ్చరిస్తూ పూర్వం మీరు అనుసరించిన వాటిని విసర్జించి నూతన హృదయాన్ని ధరించుకోండి అని పత్రిక వ్రాస్తున్నాడు (కొలస్సి 3, 4 అధ్యాయాలు)
🔺 *ఈ సందేశం చదువుతున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా నీ మనసు రూపాంతరం చెందిందా?*
🔺 *మునుపటి వాటిని విసర్జించావా?*
🔺 *ఒక సారి నిన్ను నువ్వు పరీక్షించుకో.*
🔺 *నువ్వు భౌతికంగా యేసు క్రీస్తు వలే రూపాంతరం చెందాలి అంటే ముందుగా నీ మనసు రూపాంతరం చెందాలి.*
*అప్పుడు రాకడ సమయంలో నీవు మహిమ శరీరం ధరించి ఎత్తబడ గలవు.*
👉 *ఒక వేళ నీ మనసు రూపాంతరం చెందాలి అని ఆశ పడితే పరిశుద్ధాత్ము దేవుని సహాయము అడుగు*
(లూకా 10:13). పరిశుద్ధాత్మ దేవుడే నీ మనసు మారడానికి సహాయ పడతాడు.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి – (రోమా 12:2)
*"రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును"*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి