——— *సామెతలు* ———
క్లుప్త ధ్యానములు ( Part: 15)
*నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.*
సామెతలు 2: 20-22
ఎవరైతే? జ్ఞానమును అనగా యెహోవాయందలి భయభక్తులు కలిగి యుంటారో? వారు
1️⃣ *సజ్జనులమార్గమందు (జీవమార్గం) నడుస్తారు. *
👉 Note:
మునుష్యులు రెండురకాలు:
▪️సజ్జనులు అనగా మంచివారు (మంచిపనులు చేసేవారనికాదుగాని, దేవుని మార్గములో నడిచేవారని)
▪️దుర్జనులు అనగా చెడ్డవారు. ( దేవునియందు భయభక్తులు లేనివారు.
2️⃣ *నీతిమంతులు ఎట్లా ప్రవర్తిస్తారో ఆరీతిగా ప్రవర్తిస్తారు. *
👉 Note:
▪️నీతిమంతుడు అనగా?
దేవునియందలి నమ్మకము గలిగినవాడు
▪️మూర్ఖుడు లేదా బుద్ధిహీనుడు అనగా?
▫️దేవుడే లేడని చెప్పేవాడు.
▫️దేవునియందు భయభక్తులు నిలపనివాడు
3️⃣ *యథార్థవంతులు దేశమందు నివసించుదురు. *
👉 Note: దేశమందు యధార్ధతలేనివారు, యదార్ధముగానున్నవారి కంటే ఎక్కువ సంతోషముగానే జీవిస్తూ వుండవచ్చు. కానీ, నూతన యెరూషలేములో వారికి స్థానం లేదు.
4️⃣ *లోపములేనివారు దానిలో నిలిచియుందురు.*
👉 Note: లోపములేనివారు అనగా పాపములేనివారు అనికాదుగాని, క్రీస్తు రక్తము ద్వారా పాపమునుండి విమోచించబడినవారు.
♻️ *జ్ఞానులు పొందుకొనే మరికొన్ని ఆశీర్వాదములు: *
🔸 దేశమును స్వతంత్రించుకొందురు.
🔸భూమిని స్వతంత్రించుకొందురు
🔸బహు క్షేమముకలిగి సుఖించెదరు.
🔸నిత్యము నిలుచుదురు
🔸వారెన్న టెన్నటికి కాపాడబడుదురు
🔸నిత్యము నివసించెదరు.
🔸యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము
(కీర్తనలు 37: 9-11, 27-29,38)
♻️ *భక్తిహీనుల జీవితాలకు ప్రతిఫలాలు: *
🔸కీడు చేయువారు నిర్మూలమగుదురు
🔸ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు
🔸వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.
🔸భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.
(కీర్తనలు 37: 9-11, 27-29,38)
*వద్దు! అజ్ఞానులవలే జీవించొద్దు! వారి ఆలోచనలో చేరొద్దు! వారితో సహవాసం రద్దు! యెహోవాయందు భయభక్తులుకలిగి జ్ఞానులవలే నడచుకొనుటకు మన హృదయాలను సిద్ధపరచుకొందము*. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి