✳ *దేవుని సేవ-పరిచర్య* ✳
(ఐదవ భాగము)
5⃣ *దేవుని సేవ-పరిచర్య రకములు-2*
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:28,29,30
28. *మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను*_.
29. _ *అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా_?*
30. _ *అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా_?*
ప్రియ దైవ జనాంగమా!
ఇంతవరకు మనం *Fivefold ministry* కోసం ధ్యానించాము.
👉ఇక మిగతా భాగాలు కోసం ధ్యానం చేద్దాము.
👉అందరూ ప్రవక్తలు, అపోస్తలులు, అద్భుతాలు చేసేవారు, భోదకులు, సువార్తికులు అయితే సంఘంలో పరిచర్య చేసేవారు ఎవరు? సంఘాన్ని నడిపించే వారు, హెచ్చరించేవారు, ప్రార్దించేవారు ఎవరు? అందుకే పౌలు గారు అంటున్నారు కృపా వరములు ఎన్నో ఉన్నాయిగాని,
*ఆత్మ ఒక్కడే, పరిచర్యలు ఎన్నో ఉన్నాయి గాని జరిగించువాడు ఒక్కడే, సంఘానికి శిరస్సు క్రీస్తు!*
👉 *మనమంతా ఆ సంఘానికి అవయవాలు. సంఘాభివృద్ధికోసం, పెండ్లికుమార్తె సంఘం అందంగా అలంకరించబడటం కోసం దేవుడు కొందరిని ప్రవక్తలుగా, అపోస్తలులుగా, కాపరులుగా వాడుకొంటూ, మిగిలిన వారిని మరో పనికి వారి విశ్వాస పరిమాణం ప్రకారం వాడుకొంటున్నారు!*
గొప్ప ఇంటిలో వెండిపాత్రలు, బంగారం పాత్రలు- ప్రస్తుతం అయితే స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు అన్నీ ఉంటాయి.
అయితే వాటిని వాడేవిధానం, వాడబడే విధానం వేరు. వేరువేరుపనులకోసం వేరువేరు పాత్రలు వాడతాము.
*అలాగే దేవుడు సంఘంలో వేరువేరు పరిచర్యలు కోసం ఒక్కో వ్యక్తిని ఒక్కో విధానంలో వాడుకొంటారు.దేవుడు మన CEO. ఆయన ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.*
*అయితే ఇక్కడ మనం దేవుని పనికై వాడబడుతున్నామా లేదా?*
*Fivefold ministry* తర్వాత విభాగం వారు
♻ *అద్భుతాలు చేసేవారు*.
👉అయితే దీనిని చేయడానికి పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రార్ధనా శక్తి,
అచంచలమైన విశ్వాసం అవసరం. అయితే మార్కు 16:16 ప్రకారం *ఈశక్తి అధికారం అందరికి ఇవ్వబడింది. దానిని వాడుకొనే శక్తి, విశ్వాసం లేక, వాడే విధానం తెలియక ఇటుఅటు తిరుగులాడుతున్నాం! నాయందు విశ్వాసముంచువాడు నాకంటే ఎక్కువ కార్యాలు చేయును. అన్న యేసయ్య మాట ద్వారా మనం అద్భుతాలు చేయగలము.*
తర్వాత విభాగం
♻ *భాషలు మాట్లాడువారు-అర్ధం చెప్పువారు*.
👉పెంతుకోస్తు పండుగనాడు దేవుడు పరిశుద్ధాత్మను పంపించి భాషలు మాట్లాడే వరాన్ని ఇచ్చారు. పౌలు గారు అంటున్నారు- మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను, మరి విశేషముగా ప్రవచింపవలెనని కోరుచున్నాను.ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు గ్రహింపడు గాని ఆత్మవలన మర్మములు మాట్లాడుచున్నాడు అని పౌలు గారు చెబుతున్నారు. అయితే మరో ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు- భాషలకు అర్ధం చెప్పేవారు లేకపోతే సంఘంలో భాషలు మాట్లాడువారు మౌనంగా ఉండాలి అని వ్రాయబడి ఉంది. కాబట్టి భాషలకు అర్ధం చెప్పే వరం కోసం ప్రార్ధించాలి.
తర్వాత విభాగం వారు
♻ *ఉపకారాలు చేసేవారు*.
👉మరల మనం మత్తయి 25:31కి వెళ్ళాలి. ఆపదలో ఉన్నవారికి, నిరుపేదలకి, దిక్కులేనివారికి సహాయం చేయాలి. ఇది దేవుడు మెచ్చే సేవ!! అదే నిజమైన భక్తి అని బైబిల్ సెలవిస్తుంది.యాకోబు 1:27; యెషయా 58
♻ *పరిచర్య చేసేవారు*.
👉 సంఘంలో ఇది ప్రాముఖ్యమైనది. దీనికి ట్రైనింగ్, చదువు అవసరం లేదు. చేయాలనే ఆశ, తగ్గింపు, commitment (స్తిరమైన ఒడంబడిక)ఉండాలి.
*ఈరోజుల్లో కుర్చీల్లో కూర్చోడానికి చూస్తున్నారు గాని కుర్చీలు, చాపలు ఎత్తడానికి ఇష్టపడటం లేదు. ఆలయాన్ని తుడవటానికి, కడగటానికి ఎవరు సిద్దపడటం లేదు.*
కారణం ప్రిస్టేజ్, ఇగో, అయితే వీటిని పక్కన పెట్టి ఎవరైతే ఈ పరిచర్యలు చేస్తారో దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదిస్తారు.
దానికి ఉదాహరణ నేనే! నా చిన్నతనములో ప్రతీరోజు ఆలయం తుడిచేవాడిని, ఆరాధనకు చాపలు వేయడం, తీయడం, ఎంగిలాకులు ఎత్తడం, నీరు మోయడం ఇవన్నీ చేసేవాడిని.
*ఇప్పుడు కూడా చేస్తాను. ఫలితం- ఆశ్చర్యంగా దేవుడు నన్ను ఆత్మీయంగా, ఆర్దికముగా దీవించారు.* నీకు ఆశీర్వాదాలు కావాలంటే ఇలాంటివి చెయ్యాలి.
చివరగా
♻ *ప్రభుత్వాలు చేసేవారు*.
👉 అనగా సంఘంలో సంఘపెద్దగా సంఘంలో పనులు నిర్వహించే వారు. నిస్వార్ధముగా పనిచేసి సంఘాన్ని ముందుకు నడిపేవారు.
*అయితే ఈరోజుల్లో పదవులు, పేరు ఆశించేవారే తప్ప ప్రభువుకోసం పనిచేసే వారు తక్కువ.
ఓ సంఘపెద్ద! నీవు అలా ఉంటే నేడే నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువు పరిచర్యకై పాటుపాడమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నారు.
చివరగా రక్షింపబడిన విశ్వాసి అది ఎవరైనా సరే ఈ *tenfold ministry* లో ఎదో ఒక పని చెయ్యాలి.
👉దేవుడు దీవించి ఆశీర్వదిస్తే ఒకటే కాకుండా నాలుగైదు విభాగాలలో భాగస్తులై ఉండాలి.
👉అయితే వీటిలో ఏదీ చెయ్యడం లేదా, అలా అయితే నీవు నులివెచ్చగా ఉన్నావన్నమాట!!!
అందుకే యేసయ్య
*నీవు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు కాబట్టి నానోట నుండి నిన్ను ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను అంటున్నారు.*
(ప్రకటన 3:15-16)
👉ఒకవేళ నీకు సువార్త ప్రకటించడం వీలు కాదా- అయితే వెళ్ళేవారిని పంపండి. *మీ ప్రవర్తన ద్వారా సువార్త చెయ్యండి.*
మరీ ముఖ్యముగా భారముతో కన్నీటితో ప్రార్ధన చెయ్యాలి.
అట్లు జరిగించిన నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇంకా తనసేవలో వాడుకొంటారు. లేదంటే విడువబడే గుంపులో ఉంటావు.
*దయచేసి ఇప్పుడే నిన్ను నీవు సరిచేసుకో/సరిదిద్దుకో!*
👉 అయితే ఇప్పటికే కొన్ని వరాలు-ఫలాలు ఉన్నాయా? అయితే మరో మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయు.
అట్టి కృప ధన్యత మనందరికీ మెండుగా కలుగును గాక!
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి