ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు

——— సామెతలు ——— 
  క్లుప్త ధ్యానములు ( Part: 16)

నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవ త్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్య  కుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. 
               సామెతలు 3:1-4

♻️ *జ్ఞానోపదేశము:*

🔸దేవునియందు భయభక్తులు 
🔸దయ 
🔸సత్యము

1️⃣ *జ్ఞానోపదేశమును మరచిపోకూడదు *

▪️కంఠభూషణముగా ధరించుకోవాలి. 
▪️హృదయమను పలకమీద వాటిని వ్రాసుకోవాలి 

నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. 
                      హెబ్రీ 12:5

వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము. సామెతలు 6:21

నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. సామెతలు 7:3

నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ద్వితీ 6:6

మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి. కొలస్సి 3:16

2️⃣ *జ్ఞానోపదేశమును ఆజ్ఞగా తీసుకోవాలి. *

▪️ఆజ్ఞ అంటే? తప్పక చేసితీరాల్సిందే.  
▪️మన అనుకూలతపై అది ఆధారపడదు 

3️⃣  *జ్ఞానోపదేశాన్ని హృదయపూర్వకంగా గైకొనాలి:*

▪️తప్పక చెయ్యాలికాబట్టి చెయ్యడం కాకుండా, 
▪️కష్టంతో కాకుండా 
▪️యిష్టంతో గైకొనాలి
▪️మనస్ఫూర్తిగా గైకొనాలి. 

♻️ *ప్రతిఫలం:*

🔸దీర్ఘాయువు
🔸సుఖజీవము
🔸శాంతి
🔸దేవుని దయ
🔸మనుష్యుల దయ

Note: 
ఇవన్నీ, ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. అయినప్పటికీ, యెహోవాయందలి భయభక్తులు కలిగియుండడం ద్వారా  ఈలోకంలో కూడా వీటి ఫలితాలను కొంతవరకు పొందగలము. 

♻️ *మనుష్యుల దయ అవసరమా? *

ఈలోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని దయతోపాటు, మనుష్యుల దయ కూడా అవసరమే. 

👉 యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను.  (లూకా 2:52)

👉 బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను.  (1 సమూ 2:26)

ఇవన్నీ మనకెట్లా సాధ్యం? జ్ఞానోపదేశాన్ని  అనుసరించడం ద్వారా మాత్రమే సాధ్యం? అనగా, దేవునియందు భయభక్తులు కలిగియుండడం ద్వారామాత్రమే సాధ్యం! 

అజ్ఞానులవలే జీవించొద్దు! వారి ఆలోచనలో చేరొద్దు! వారితో సహవాసం వద్దు! యెహోవాయందు భయభక్తులుకలిగి జ్ఞానులవలే నడచుకొనుటకు మన హృదయాలను సిద్ధపరచుకొందము. నిత్యమైన ఆశీర్వాదములు స్వతంత్రించుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు