❇️———సామెతలు ———❇️
క్లుప్త ధ్యానములు ( Part: 18)
నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును. సామెతలు 3 :7,8
♻️ *నేను జ్ఞానినిగదా అని నీవనుకొనవద్దు *
చాలా మందిలోనున్న లోపం ఇదే. తమ దృష్టిలో తామే జ్ఞానులమనుకొని, దేవుని మాటలు చెవినిబెట్టరు. వారి అహంకారమే వారిని సత్యానికి దూరముగా, అజ్ఞానంలో బంధించి ఉంచుతుంది.
🔸వీరు మూర్ఖులకంటే మూర్ఖులు
🔸వీరికి శ్రమ
👉 *తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.* సామెతలు 26:12
👉 *తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచు కొనువారికి శ్రమ.* యెషయా 5:21
♻️ *ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనము: *
🔸ఈ లోకంలో నీవు తీసుకున్న డిగ్రీలు జ్ఞానం కాదు.
🔸ఇతరులను మోసం చెయ్యడం జ్ఞానం కాదు.
🔸చాకచక్యంగా మాట్లాడడం జ్ఞానం కాదు
*ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును; మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.* 1 కొరింథీ 3:18-20
♻️ *నిజమైన జ్ఞానం దేవునియందలి భయభక్తులే:*
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. (సామె 1:7)
♻️ *దేవుని భయములేకపోతే చెడుతనము విస్తరిస్తుంది: *
అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని. ఆది 20:11
♻️ *దేవునియందలి భయభక్తులే మనకు, జీవము మరియు ఆరోగ్యము:*
🔸శారీరిక ఆరోగ్యము
🔸ఆత్మీయ ఆరోగ్యము
నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. (సామె 4:20-22)
ఇదెట్లా సాధ్యం అంటే? మన జ్ఞానమును బట్టి అతిశయించకుండా, యెహోవాయందలి భయభక్తులే నిజమైన జ్ఞానమని గుర్తెరిగి, అట్టిరీతిగా జీవించినప్పుడే సాధ్యమవుతుంది. ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి