📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 💠 *చరిత్రలో నమోదు కాని ''ఒకరోజు ?'' బైబిల సత్యం అని రుజువు చేసిన నాసా*💠 సర్వ సృష్టికర్తయైన దేవుడు లేనే లేడని తలంచే కొందరు శాస్త్రజ్ఞులు బైబిలు సత్యజ్ఞానమని గ్రహింపలేని కొందరు విజ్ఞులకు, ఆయన అద్భుత శక్తి ప్రభావములను, ఆయన సార్వభౌమత్వమునుఋజువు పరిచే సంఘటన ఇటీవల నాసా {అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం}లో జరిగింది. చరిత్రలో నాసా స్పేస ప్రోగ్రాం కన్సల్టెంట గా పనిచేస్తున్న హెరాల్డ హిల ఆ విషయాన్ని ఈ విధంగా వెల్లడించారు. కొందరు అంతరిక్ష వ్యోమగాములు మరియు శాస్త్రవేత్తలు మేరీల్యాండ లోని పరిశోధనా కేంద్రంలో కొన్ని కంప్యూటర్లు పరిశోధనలు చేస్తున్నారు. రాబోయే 100 మరియు 1000 సంవత్సరాలలో సూర్య చంద్ర నక్షత్రాల మరియు గ్రహాల కదలికలు, వాటి వాటి స్థానచలనాలు, కంప్యూటర ద్వారా అంచనాలు వేయడమే వాళ్ళ పరిశోధన. రాబోయే శతాబ్దాలలో ఆకాశ నక్షత్ర స్థానాలను అంచనా వేయడం చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఈ కీలక అంచనాల ఆధారంగానే కొన్ని వందల మానవ నిర్మిత శాటిలైట వాటి నిర్దిష్టమైన కక్ష్యలలో అంతరిక్షంలో పనిచేస్తుంటాయి. ఈ అంచనాలు సెకండ్లు, మిల్లీ సెకండ్లుతో సహా చాలా ఖచ్చితంగా ఉండాలి....