ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

_బైబిలు వాక్యధారంతో టెలివిజన్ కనుగొన్న J.L. బయర్డ్

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚



♻️ *_బైబిలు వాక్యధారంతో టెలివిజన్ కనుగొన్న J.L. బయర్డ్_*💠



▶️_*టెలివిజన్ కనుగొన్నది "JOHN LOGIE BAIRD" (1888 - 1946). ఈయన తండ్రి పాస్టర్. ఈయన తన తండ్రి కోరిక మేరకు స్కాట్లాండ్ లోని "HELENS BURG" అను ప్రాంతంలో పాస్టర్ గా దేవుని పని చేసేవాడు. అయితే J.L. BAIRD కు చిన్నప్పుడు నుండి ఏదో ఒకటి సాధించాలని, క్రొత్తదాన్ని కనిపెట్టాలని ఆరాటపడేవాడు. అయితే J.L. BAIRD యొక్క తండ్రి యిట్టి కార్యములను ప్రోత్సహించలేదు. ఎక్కడ లోకంలో పడి "దేవుని పనికి" దూరం అవుతాడో అనే కారణం చేత ఎటువంటి సహకారం యివ్వలేదు అతని తండ్రి.*

▶️*_అయితే "UNIVERSITY OF GLASSGOW" లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాస్ చేసుకొన్న J.L. BAIRD "ఒక పక్క దేవుని సేవ చేస్తూనే" ప్రపంచ ప్రజలకు ప్రయోజనకరమగునట్లు తాను చదువుకున్న చదువుని బట్టి ఏదైనా కొత్త్డది కనిపెట్టాలని గొప్ప వ్యక్తిగా రాణించాలన్న దాహం అతనిలో తీవ్రంగా ఉండేది... అలా ఒక రోజు తన కోరికను తన అక్క "ANNIE" కు తెలియచేసాడు. అక్కయ్య నేను ఏదో ఒకటి కనిపెట్టాలనుకుంటున్నాను. అది ప్రపంచ ప్రజలందరికి ఉపయోగ పడాలని నాకొక మంచి ఆలోచన ఇవ్వమని తన అక్కయ్యను అడిగాడు J.L. BAIRD._

▶️_*అందుకు తన సహోదరి ఈలాగు ప్రశ్నించింది. BAIRD గత వారం నాన్న గారు వాక్యం బోధిస్తున్నప్పుడు "అంత్య దినములలో పరలోకంలో నుండి యిద్దరు వ్యక్తులు వస్తారని వారిని కౄరమృగము చంపుతుందని, అప్పుడు ప్రపంచ ప్రజలందరూ వారి శవములను చూసి సంతోషించి, ఉత్సహిస్తారని" నాన్నగారు చెప్పారు... యిదెలా సాధ్యము? వారి శవములు జెరుసలేములో వుంటే ప్రపంచ ప్రజలందరూ ఎలా చూస్తారని ప్రశ్నించింది.*

▶️*_J.L. BAIRD అప్పటికి దేవుని సేవ చేస్తుండటంతో అతనికి BIBLE గురించి తెలుసు కనుక అతని సహోదరి ఆ ప్రశ్న వేయగానే J.L. BAIRD కి బైబిల్ లోని ప్రకటన గ్రంథం గుర్తొచ్చింది_.

▶️_*"మరియు ప్రజలకును, వంశములకును, ఆ యా భాషలు మాటలాడువారికిని, జనము లకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవము లను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్స హించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు." (ప్రకటన 11:9-10*).

▶️ *_నిజమే జెరుసలేము సంత వీధిలో పడి వున్న ఆ శవములను లండన్ లోని ప్రజలు, ఇండియా లోని ప్రజలు, స్కాట్లాండ్ మరియు యిలా ప్రపంచ భూనివాసులు అందరు చూడాలంటే టెలివిజన్ ద్వారానే సాధ్యం అని నిర్ణయించుకొన్న J.L. BAIRD అప్పటి నుండి టెలివిజన్ కనిపెట్టడానికి ప్రయత్నించాడు. కొన్ని సార్లు ప్రయోగాలలో విఫలం అయినా చివరకు 1928 లో టెలివిజన్ కనిపెట్టాడు. ఈరోజు మనం ప్రపంచ వార్తలను మన కంటి ముందు చూడగలుగుతున్నాము అంటే J.L. BAIRD నె కారణం. J.L. BAIRD తన అక్క యిచ్చిన సలహా మేరకు దేవుని వాక్యం మీద విశ్వాసంతో టెలివిజన్ కనిపెట్టుటకు ప్రయత్నం చేసి విజయం సాధించాడు_.

▶️_*క్రీ.శ. 95 లో టెలివిజన్స్ లేవు, రేడియోలు లేవు, కరెంట్ లేదు. యింత టెక్నాలజీ అసలు లేనేలేదు. కాని "యోహాను" ప్రకటన గ్రంథములో ఆ యిద్దరు శవములను ప్రపంచ ప్రజలందరూ చూస్తారని ఎలా రాసాడు? ఎందుకనగా రాసింది యోహానే అయినా రాయించింది దేవుడు. దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి కనుక దేవునికి ముందుగానే తెలుసు. మానవుని జ్ఞానం పెరుగుతుందని టెలివిజన్ను కనుగొంటారని. అందుకే దేవుడు తన పరిశుద్ద గ్రంథంలో జెరుసలేము సంతవీధిలో పడివున్న ఆ యిద్దరు వ్యక్తుల శవములను ప్రపంచ ప్రజలందరూ చూస్తారని టెలివిజన్ కనిపెట్టక ముందే 1800 సంవత్సరాల క్రితమే రాయించాడు.*

▶️*_నేడు మానవుడు తన జ్ఞానం ద్వారా కనిపెడుతున్నవన్ని కూడా బైబిల్ మరింత సత్యం అని బైబిల్ దైవగ్రంథం అని నిర్ధారణ చేస్తున్నాయి. హల్లెలూయ_.

_*సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమెన్*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...