✳ *దేవుని స్తుతించుట, ఆరాధించుట ....✍* అందరికి ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు. *ఈ రోజు ఆదివారం, అందరూ దేవుని మందిరానికి వెళ్తున్నారుగా?* 👉మందిరానికి వెళ్ళడం మాత్రమే కాదు, *దేవుని స్తుతించి, ఆరాధించాలి.* 👉 పాటలు పాడటం వేరు, ఆరాధించుట వేరు. ♻ *స్తుతి, ఆరాధన - ఈ రెంటికి భేదముంది.* ♻ ♻ *స్తుతి* *ప్రశంసను ,ఆమోదాన్ని ప్రాథమికంగా వ్యక్తీకరించడం స్తుతి.* పొందిన అనుగ్రహాలకు కృతజ్ఞతాభివందనాలను వ్యక్తీకరించడం కూడా ఇందులో ఇమిడి ఉంది. *అలా స్తుతి, కృతజ్ఞతలు రెండు తరచుగా జంటగా వెళుతూ ఉంటాయి.* 👉 అయితే శుద్ధమైన స్తుతిలో కృతజ్ఞత ఇమిడి ఉండదు. *ఒకరి నుండి మేలు పొందినా, పొందకున్నా అతనిపై గల ప్రశంసా, మెచ్చుకోలులను వ్యక్తీకరించడమే స్తుతి.* ♻ *ఆరాధన* 👉 *ఆరాధన అంటే ఏమిటి ?* 🔹 ఒకరిని గూర్చి సదభిప్రాయాన్ని వ్యక్తపరచడం , 🔹ప్రశంసించడం, 🔹 అభినందించడం, 🔹 కొనియాడడం, 🔹 శ్లాఘించడం, 🔹 ప్రస్తుతించడం, 🔹కీర్తించడం, *పొగడడమే స్తుతి .* *భక్తి ప్రపత్తులు కలిగి ఉండడం, ఒకరిపట్ల ఆశ్చర్యకరమైన మెప్పును ప్రదర్శించడం, ఆరాధ్య వ్యక్తి ముందు సాష్టాంగ పడడం, ప్రణమిల్లడమే ఆరాధన.* 👉 *అర్హుమైన వ...