ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు

❇️—— సామెతలు ——❇️
     క్లుప్త ధ్యానములు ( Part: 9)

జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభ వించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుస రించెదరు. జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.
        సామెతలు 1:29-33

ఒక విషయాన్ని ఇష్టపకపోవడం వేరు, దానిని అసహ్యించుకోవడం వేరు. కొన్ని సందర్భాలలో ఒక విషయాన్ని యిష్టపడకపోయినా, మరికొన్ని సందర్భాలలో యిష్టపడవచ్చు. కానీ, అసహ్యించుకోవడం అంటే? ఎప్పటికి యిష్టం కలుగదు. 

అజ్ఞానులు జ్ఞానమును అసహ్యించుకొంటారు. జ్ఞానము అంటేనే వారికి ఎప్పటికి యిష్టం కలుగదు. 

జ్ఞానం అంటే?
🔸దేవుని వాక్యం 
🔸దేవుని సలహా 
🔸దేవుని గద్దింపు
🔸 దేవుని ఉపదేశం 

జ్ఞానం ఎట్లా లభిస్తుంది? 
యెహోవాయందు భయభక్తులు నిలపడం ద్వారానే సాధ్యం. 

అయితే, అజ్ఞానులు ఈ పని చెయ్యరు. దేవుడంటే, వారికి లెక్కేలేదు. దేవుడు ఉన్నాడంటే, ఆయనకు భయపడాల్సివస్తుందని, దేవుడే లేడంటారు. అట్లాంటివారు బుద్ధిహీనులు ( మూర్ఖులు) వారికి, నచ్చినట్లుగా వారు జీవిస్తారు. 

♻️ వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు:

అజ్ఞానులు, దేవునియందు భయభక్తులు నిలుపక, వారినచ్చినట్లు జీవించడం ద్వారా దాని ప్రతిఫలాన్ని తప్పక అనుభవించితీరుతారు. 

👉 మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును (గలతీ 6:7)

👉 భూలోకమా, వినుము; ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను. (యిర్మియా 6:19)

👉 మీ క్రియల ఫలములనుబట్టి మిమ్మును దండించె దను, నేను దాని అరణ్యములో అగ్ని రగుల బెట్టెదను, అది దాని చుట్టునున్న ప్రాంతములన్నిటిని కాల్చివేయును;  ఇదే యెహోవా వాక్కు.
( యిర్మియా 21:14)

👉 దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు. సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు (కీర్తనలు 18:25,26)

♻️ జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు:

దేవునిని విసర్జించినవాడు క్రమమైన జీవిత విధానాన్ని కలిగియుండలేడు. ఈలోకంలో ఉన్నత స్థితిలోవున్నట్లు అనిపించినా వారు, కాలు జారే స్థలంలోనున్నట్లే. ఏ క్షణాన్న కాలుజారుతుందో, ఆ క్షణాన్న నాశనమవుతారు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. 

అయితే, జ్ఞానము యొక్క ఉపదేశమును విని, అనుసరించేవారు 

🔹సురక్షితముగా నివసిస్తారు 
🔹కీడును గూర్చిన భయము లేదు. 
🔹సమాధానంతో జీవిస్తారు. 

👉వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు  వాడు భయపడడు. ( కీర్తనలు 112: 7,8)

👉 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును. (కీర్తనలు 23:4)

అజ్ఞానులవలే కాక, జ్ఞానులవలే యెహోవాయందు భయభక్తులు కలిగి, సురక్షితముగా, భయములేకుండా, నెమ్మదికలిగి జీవిస్తూ, నిత్యమైన ఆశీర్వాదములను స్వతంత్రించుకొందము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!  ఆమెన్!  ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...