✳ *నేను నమ్ముతున్నాను యేసు వస్తాడని....✍*
వాక్యము ఇలాగు చెబుతుంది.... *యేసు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అయన అనేక అద్భుతాలు చేసారు, అనేకమందిని స్వస్థపరచారు. కానీ తన స్వదేశములో మాత్రము యేసు అనేక అద్భుతాలు చేయలేకపోయాడు....*
👉 కారణం.... ? *అక్కడివారి అవిశ్వాసము వలన;* ( మార్కు 6:5 ).
👉 *వారి అవిశ్వాసం యేసయ్య అద్భుతాలు చేయకుండా అడ్డుగామారింది అందుకే వారు అద్భుతాలు పొందలేకపోయారు.*
🔺 గమనించండి....
యేసు ఎవరిని స్వస్థపరచాలి అనుకున్న విడిపించాలి అనుకున్నా ఒక ప్రశ్న అడిగేవారు
*"నీవు నమ్ముచున్నావా....? "*
*నీవు విస్వసించుచున్నవా....?"*
👉 అని నమ్ముచున్నాను, విస్వసించుచున్నాను అని బదులు చెప్పిన ప్రతిఒక్కరు వారి వారి జీవితాలలో అద్భుతాలు చూసారు.
*" విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా."*
( Hebrews (హెబ్రీయులకు) 11:6 )
చిన్న నాటినుండి కలిసి పెరిగిన ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వారి పేర్లు Jonathan, David. కలిసి చదువుకున్నారు, ఎప్పుడు కలిసేవుండేవారు. ఆత్మీయముగా కూడా ఇద్దరు బలమైన వారు. వారి కలకూడా ఒక్కటే అది సైన్యములో చేరి దేశానికి సేవ చేయాలని.... ఎంతో శ్రమించారు సైన్యములో చేరారు:
*Jonathan కి యుద్ధరంగములో ముందుండి పోరాడే సైనికుడి ఉద్యోగము వచ్చింది.*
*David కి Control Room లో ఉద్యోగము వచ్చింది.*
అలా కొంతకాలానికి దేశములో యుద్ధము ప్రారంభము అయింది యుద్ధము హోరాహోరిగా జరుగుతుంది Jonathan యుద్ధరంగములో ఉన్నడు; David; Control Room లో ఉండి యుద్ధంక్రమాన్ని పరిశిలిస్తున్నాడు అంతలో Control Room కి ఒక ఫోన్ వచ్చింది, David ఆ ఫోన్ అందుకున్నాడు, ఆ ఫోన్ లో తనకి అందిన ఆ వార్త వినగానే David కళ్ళలో కన్నీరు. ఇది అంత గమనిస్తున్న ఆ Control Room అధికారి వచ్చి ఏమి జరిగింది అని అడిగాడు *" నా స్నేహితుడు Jonathan కి యుద్ధములో పెద్ద గాయాలు తగిలాయి అంట సర్, Jonathan చావుబ్రతుకులలో ఉన్నడు నేను వెంటనే వెళ్ళాలి "* అని ఆ అధికారికి బదులు ఇచ్చాడు.
అధికారి *" నువ్వు బయటకి వెళ్ళటానికి నీకు అనుమతిలేదు నువ్వు ఇక్కడే పనిచేయాలి అని హెచ్చరించాడు.... బయటకి వెళ్ళితే నీకు కూడా ప్రమాదము అని ఆపటానికి చూసాడు కానీ David అదేమీ వినకుండా బయటకి పరిగెత్తాడు.*
కొంతసేపటికి ఒంటినిండా గాయాలతో, భుజముమీద Jonathan మృతదేహముతో David Control Room కి వచ్చాడు.... అధికారి కోపముగా వచ్చి" చూడు నువ్వు ఏమి సాధించావు చెప్పు ? Jonathan చనిపోయాడు. నీకు ఒంటినిండా ఇంత పెద్ద గాయాలు అయ్యాయి, నేను చెప్పిన వినకుండా వెళ్లి నువ్వు ఏమి సాధించావు ? అని అడిగాడు.
*David ఏడుస్తూ.... నేను Jonathan ని రక్షించగాలనో లేదో నాకు తెలియదు, కానీ నేను Jonathan దగ్గరికి వెళ్లేసరికి వాడు నా కళ్ళలోకి చూస్తూ " నువ్వు వస్తావని నాకు తెలుసు" అని అన్నాడు సర్....*
👉 *తను ఆపదలో ఉన్నపుడు నేను తనకోసము వస్తానని Jonathan నమ్మాడు సర్.... అదే నేను వెళ్ళకపోతే Jonathan తో పాటు వాడు నామీద పెంచుకున్న ఆ నమ్మకము కూడా చనిపోయేది.... అని చెప్పి Jonathan ని కౌగిలించుకుని అక్కడే ప్రాణాలు విడిచాడు David.*
👉 Jonathan నమ్మాడు నేను ఆపదలో ఉంటే నా స్నేహితుడు నా కోసము వస్తాడు అని....
👉 David నమ్మాడు ఆపదలో ఉన్న ఆ స్నేహితుడు నా కోసము ఎదురుచుస్తుంటాడు అని....
*దీని అంతము విషాదము అయినాసరే.... ఆనందము అయినా సరే మనలను నమ్మిన వారిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఇది మన దేవుని లక్షణము. . . .*
*" నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులైయుందురు. . . .ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను,"*
( John (యోహాను సువార్త) 15:14,15 )
👉 అవును. . . .
*మనం నమ్మాలి జ్ఞనం వున్నా దారితెలియని చోట మనకి దారి చూపటానికి నక్షత్రములా యేసు వస్తాడని.*
*మనం నమ్మాలి సముద్రాన్ని పాయలుచేసి మనలను నడిపించేదుకు తూర్పు గాలిలా యేసు వస్తాడని.*
*మనం నమ్మాలి సింహల గృహలోకి మనం నేట్టబడిినప్పుడు వాటి నోరు ముయించటానికి యేసు వస్తాడని.*
*మనం నమ్మాలి యెరూషలేము నుండి యెరికోకు పోవు దారిలో మనం దొంగచే కొట్టబడినప్పుడు మంచి సమరయుడిలా యేసు వస్తాడని.*
*మనం నమ్మాలి దుర్వ్యపారాలలో పాడైయిపోయి ఇంటికి మనంతిరిగి వచ్చేటప్పుడు దూరంగా చూసి పరుగుపరుగున యేసు వస్తాడని.*
*మనం నమ్మాలి పాపములో మనం వున్నపుడు యాకోబు బావిదగ్గర మనలను కలిసేందుకు యేసు వస్తాడని.*
*మనం నమ్మాలి వేవేల దెయ్యలతో మనం సోదించబడుతున్నపుడు మనకోసం గెరాసేనుల దేశానికైనా యేసు వస్తాడని.*
👉 *మనం నమ్మాలి యేసు వస్తాడని.*
🔺 ఒక మాట ఉంది *" దేవుడు ముందు రాడు, అలా అని ఆలస్యంగా అసలురాడు.... తగు కాలములో, తన కాలములో దేవుడు తప్పక వస్తాడు"*
👉 *అవును.... నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్న సరే మన రక్షకుడైన యేసుక్రీస్తుపై నమ్మిక ఉంచు. అయన తనని నమ్మువారినెవ్వరిని విడిచిపెట్టాడు.*
*మనం నమ్మాలి యేసు వస్తాడని.మనం నమ్మాలి యేసు మరలా వస్తాడని.*
*హల్లెలూయ. . . .*
మన రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చిన ఈ ప్రకటన ప్రకారముగాను మిమ్మును వాక్యంలో స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమకలుగునుగాక.
ఆమేన్. ఆమేన్. ఆమేన్.
Written_By:- *Bhagath .N. Marshal....*
*_The_Gate_Of_Heaven.* ( Christian Literature) Ministries.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి