✳ *కిబ్రోతు హత్తావా. . . .✍*
*"మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు " కిబ్రోతు హత్తావా " అను పేరు పెట్టబడెను."*
( సంఖ్యాకాండము - 11 : 34 )
👉కిబ్రోతు హత్తావా అనగా *"దురాశ"* అని అర్ధము....
వాక్యం ఇలాగు చెపుతుంది. . . .
ప్రార్ధించుటకు ఇద్దరు వేక్తులు దేవాలయమునకు వెళ్లారు కాని ఒక వేక్తి మాత్రమే సమాధానంతో తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. . . .
*ఎందుకనగా అతని ప్రార్ధనలో తగ్గింపు, విధేయత ఉంది కనుక.*
గమనించండి....
👉 మోకరించి ప్రార్ధిచే సమయంలో *మన మాటలలో దురాశ ఎంతమాత్రమూ కనిపించకూడదు,*
👉 మన ప్రార్ధనలో *"నీతి"* ఉండాలి,
*మనం "పొందగోరు ఖ్యాతి" కాదు. . . ."దురాశ కాదు"*
👉మరి ఆనాడు *"ఇశ్రాయేలీయులును మిశ్రితజనమును"* దేవుని సన్నిధిలో తమ అక్కరల నిమిత్తం ఎలాగు ప్రార్ధించారో చూడండి.
( సంఖ్యాకాండము - 11 : 6 )
*"వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు ? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి."*
🔅 ఇది నిజమా. . . ?
*వారు ఐగుప్తులో అంతగా సుఖపడ్డారు అంటారా. . . ?*
*దేవుని సన్నిధి నుండి వచ్చే మన్న వారికీ తక్కువగా కనిపించింది.*
*మేము ఐగుప్తులో ఉన్నపుడే మాకు బాగుగా జరిగేది అంటూ ఏడ్చారు ఆనాటి ఇశ్రాయేలీయులు.*
ఇశ్రాయేలీయులు....
👉 *ఎవరీ ఇశ్రాయేలీయులు. . . ?*
🔹దేవుని సొంత జనాంగము;
🔹దేవుడు అబ్రహాము, ఇస్సాకు,యాకోబులకు చేసిన వాగ్ధనమునకు సమవారసులు;
🔹రాజుల, అధికారుల అహమును, అధికారాన్ని కొట్టివేసి ఐగుప్తులో నుండి బయటకు నడిపించిన జనాంగము;
🔹ఐగుప్తులో దేవుడు 10 అధ్బుతాలు చేసింది వీరికోసమే,
🔹ఎర్రసముద్రాన్ని రెండుగా చేసింది వీరికోసమే,
🔹దేవతల ఆహారంగా పేరుపోందిన మన్నాను కురిపించింది వీరికోసమే,
🔹బండ నుండి నీటిని ప్రవహింపచేసింది వీరికోసమే,
🔹దేవుడే పగటివేళ మేఘస్తంభములోను, రాత్రివేళ అగ్నిస్తంభములోను వారికి ముందుగా నడచుచు, తోడుగావుండి నడిపించిన జనాంగము విరే. . . .వౌ.
👉 *ఈ ఇశ్రాయేలీయులు ఎప్పటిలాగానే దేవుని సన్నిధిలో ఏడ్చారు,*
👉 *దేనికోసం తిండికోసం.*
ఐగుప్తులో వారు తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును వారికీ జ్ఞాపకమునకు వచ్చుచున్నవి.
*అదికూడా "మేము ఉచితముగా తినినవి మాకు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి" అంటూ ఏడ్చారు,*
♻ *ఐగుప్తులో వారు తినినవి*
◼ ఏమిటి పిడిగుద్దులు,
◼ కొరడాదేబ్బలు,
◼ఐగుప్తులో వారు మోయలేని బరువులను వారి చేత మోయించారు,
◼ఐగుప్తులో వారు రుచి చూసినవి ఏమిటి కరువుని, బానిస బ్రతుకుని,
*అలాటి పరిస్థితి నుండి దేవుడు వారిని బయటకి నడిపిస్తే "మేము ఐగుప్తులో ఉన్నపుడే మాకు బాగుగా జరిగేది అంటూ ఏడ్చారు"*
*సర్వసంపదలకు సమానమైన దేవుని సన్నిధి వారికీ ఉండగా వారు వారి కడుపుకోసం ఏడ్చారు, ప్రార్దించారు.*
👉 *యెహోవాను నిర్లక్ష్యము చేసి; ఆయన సన్నిధిలో దురాశతో ఏడ్చిన వారు పోందుకున్నది ఏమిటి. . . ?*
👉దేవుడు వారితో ఇలాగు చెప్పారు;
మాకు ఎవరు మాంసము పెట్టుదురు ? అని ఏడ్చి, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పు కొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు.
ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు,
అయిదు దినములు కాదు, పది దినములు కాదు,
ఇరువది దినములు కాదు. ఒక నెల దినములవరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; అని.
అలాగునే దేవుడు వారికీ విస్తారమైన మాంసాన్ని ఇచ్చారు, పూరేళ్ళను వారి పాళేముకు రాప్పించెను,
♻ *"ఆ మాంసము ఇంక వారి పండ్లసందున ఉండగానే, అది నమలకమునుపే, యెహోవా కోపము జనులమీద రగులుకొనెను; యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను.మాంసాపేక్షగల వారిని జనులు అక్కడే పాతిపెట్టారు.*
👉ఇది ఎంతో బాధాకారము అండీ. . . .
గమనించండీ.... యాకోబు భక్తుడు ఇలాగు చెప్పుచున్నాడు.... *"ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును."*
(James (యాకోబు) 1:14,15).
👉ఏందుకండీ....
ఈ ఇశ్రాయేలీయులు వారి ఆహారం ఇంకా పూర్తిగా నమలకమునుపే చనిపోయారు....?
*వారి దురాశ కదా.... అడగకూడనివి ఆశించటం వల్లే కదా....*
👉 ఏందుకండీ....
*కొందరు అధికారులు లంచాలు తీసుకుని, డబ్బులు దొంగిలించి 420-చీటింగ్ కేసుల్లో చిక్కి జైలు సువ్వలు లెక్కలు వేస్తున్నారు....?*
🔺వారి దురాశ కదా....
*"దురాశ" గర్భము ధరించి "పాపమును" కనగా, పాపము పరిపక్వమై "మరణమును" కనును.*
👉నా ప్రియ స్నేహితులారా. . . .
🔺 మరి మన ప్రార్ధన ఎలాంటిది. . . ?
◼దురాశతో కూడినదా ?
◼సొంత లాభంతో కూడినదా ? ,
◼ఇతరులకు హాని కలగాలని చేసే ప్రార్ధనా ? ,
◼కడుపునింపుకోనుటకు చేసే ప్రార్ధనా ? ,
*ఒక్కసారి మేలుకువగాలిగి ఆలోచించవలసిన సమయం ఇది......*
*హల్లెలూయ. . . .*
మన రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చిన ఈ ప్రకటన ప్రకారముగాను మిమ్మును వాక్యంలో స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమకలుగునుగాక.
ఆమేన్. ఆమేన్. ఆమేన్.
Written_By:- *Bhagath .N. Marshal....*
*_The_Gate_Of_Heaven.* ( Christian Literature) Ministries.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి