ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు

▫️——— సామెతలు ———▫️
      క్లుప్త ధ్యానములు ( Part:3)

నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును. సామెతలు 1:8,9

కుమారుడా అంటే, ఈ మాటలు కుమార్తెలకు సంబంధించినవికావని అర్ధం కాదు. పిల్లలందరికీ సంబంధించినవి. 

♻️ పిల్లల అసలైన తర్ఫీదు కేంద్రం “కుటుంబమే”. 

అయితే, వారిని తర్ఫీదు చెయ్యడానికి
🔸 స్కూల్ లేదా 
🔸సండే స్కూల్ కి 
అప్పగించి, మనకేమి పట్టనట్లు నిర్లక్ష్యం వహించకూడదు. 

♻️ వారికి తర్ఫీదునిచ్చే బాధ్యత తలిదండ్రులదే. 

మన కుటుంబాలలో పిల్లల బాధ్యత ఎవరో ఒకరు మాత్రమే తీసుకుంటారు. 
అట్లా కాదు, 
🔸తండ్రి ఉపదేశము 
🔸తల్లి బోధ 
ఈ రెండూ తప్పనిసరి. 

♻️ఎప్పుడు? ఎక్కడ? 

నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; (ద్వితి 6:6,7)

తలిదండ్రుల ఉపదేశము బిడ్డల,
🔸తలకు మాలిక (పూలదండ, ప్రకాశమానమైన కిరీటము)
🔸కంఠానికి హారము, వలే ఉంటాయి. 

♻️ తలిదండ్రుల ఉపదేశము వలన 

1️⃣ బిడ్డలు వివేకవంతులగుదురు 

కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి. ( సామె 4:1)

2️⃣ బిడ్డలు బ్రతుకుతారు. 

నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు. ( సామె 4:4, 7:2)

3️⃣ దీర్ఘాయువు
4️⃣ సుఖజీవము
5️⃣ శాంతిని అనుగ్రహించును. 

నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. (సామె 3:1,2)

6️⃣ వెలుగు 
7️⃣ జీవమార్గము 

ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. (సామె 6:23)

8️⃣ జీవపు ఊట

జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.
              సామె 13:14

♻️ తండ్రి ఉపదేశము 
తల్లి బోధను త్రోసివేస్తే? 

🔹వివేకాన్ని కోల్పోతాము
🔹ఆధ్యాత్మికంగా, నైతికంగా 
🔹మరణమవుతాము. 
🔹దీర్గాయువు ఉండదు 
🔹సుఖజీవం లేదు 
🔹శాంతిని కోల్పోతాము 
🔹జీవితం అంధకారమవుతుంది 
🔹మరణ పాశములో చిక్కుకుంటాం. 

Imp Note ✍🏻
నీవూ ఒక తండ్రివి, తల్లివి కావొచ్చు. అయినప్పటికీ, నీవు ఒకరికి కుమారుడవు, కుమార్తెవు అనేవిషయం మరచిపోకుండా వారి దైవికమైన ఉపదేశానుసారం జీవించగలిగితే, నీ జీవితం ధన్యం. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు