ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు

▫️——— సామెతలు ———▫️
      క్లుప్త ధ్యానములు ( Part:2)

*యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు*. సామెతలు 1:7
                       
♻️ *జ్ఞానమునకు ఆరంభం* (మూలము)?
యెహోవాయందలి భయభక్తులు 

అయితే, మనలో 
🔹భక్తికి లోటులేదు. 
🔹భయమునకు చోటులేదు. 

🔸 *భక్తి అంటే?*
దేవుడు నీనుండి ఆశించే పరిశుద్ధమైన జీవన విధానం. 

🔸 *మన దృష్టిలో భక్తి అంటే?*
🔹మెడలో సిలువ 
🔹గోడలకు దేవుని వాక్యాలు 
🔹ప్రతీవారం దేవుని సన్నిధికి వెళ్లడం 
🔹కానుకలు సమర్పించడం, ఇట్లా.....

అయితే, 
భయములేని భక్తి, భక్తిపరులముగా నటింపజేస్తుందేమోగాని, నిత్య నరకం నుండి మాత్రం తప్పించలేదు. 

♻️ *దేవునియందు భయము కలిగియుండేవారిలో వుండే, ప్రాముఖ్యమైన మూడు లక్షణాలు*:
1. పశ్చాత్తాపము 
2. విధేయత 
3. పరిశుద్ధత 
ఇప్పుడు, నీవే నిర్ణయించుకో! దేవునియందు “భక్తి మాత్రమే” కలిగియున్నావో? భయభక్తులు కలిగియున్నావో? 

దేవునియందు “భయభక్తులు లేకుండా”, ఈలోక విద్యలో నీవెంతటి ప్రావీణ్యము సంపాదించినా గాని, బైబిల్ అంతా తెలిసినాగాని,  దేవుని దృష్టిలో నీవు జ్ఞానము కలిగియున్నట్లు కానేకాదు.

*జ్ఞానులు అంటే? *
🔸దేవుని నీతి, న్యాయములను అనుసరిస్తూ, ఆయన చిత్తానుసారం జీవించేవారు. 

*మూర్ఖులు అంటే? *
🔸వక్రబుద్ధి గలవారు 
🔸నైతికంగా బ్రష్టులు 
🔸వారికి నచ్చినట్లుగా జీవించేవారు
🔸దేవునిని తిరస్కరించేవారు. 
🔸దేవుడు లేడని చెప్పేవారు. ( వారెందుకట్లా తలంచుతారంటే? అసలు దేవుడే లేడంటే, ఇక ఆయనకు భయపడాల్సిన పనిలేదు. నచ్చినట్లు జీవించొచ్చు)

ఇట్లాంటివారు, జ్ఞానమై యున్న దేవునినే తిరస్కరిస్తారు. ఇకవారి గమ్యమేమిటో నేను చెప్పాల్సిన అవసరతలేదు కదా? వారిలో నీవుండొద్దు. 

ఆయనను నమ్మడంతోనే, భయభక్తులు ఆరంభమవుతాయి. జ్ఞానమైయున్న దేవునియందు భయభక్తులు నిలపగలిగితే, ఆయనిచ్చే జ్ఞానముద్వారా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించగలవు. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...