✳️ *మనప్రభువు జీవితం* ✳️
1️⃣ *ఆయన జన్మ*
లూకా 2:1-7
_లూకా 2:4-7; 1తిమోతీ 3:16, మత్తయి 1:21,23_
జనాభా లెక్కలు సేకరించాని సీజర్ ఆగస్టస్ జారీ చేశాడు. అందువల్ల యోసేపు, అతని భార్యయైన మరియ, నజరేతు నుండి బెత్లేహేము బయలుదేరారు. ఎందుకంటే బెత్లెహేము యోసేపు పూర్వికు ఊరు, ఆ చిన్న ఊళ్లో ప్రపంచ చరిత్ర అంతటిలో మహోతృష్ట విషయం జరిగింది. యేసు పుట్టాడు.
*అవతారం మనకెప్పుడూ నిగూడ సత్యంగానే మిగిలిపోతుంది. దేవుడు మానవుడెలా అయ్యాడు? కాని కొత్త నిబంధన రతయితలు దీన్నొక వేదాంత సమస్యగా భావించక, రక్షకుని రాకగానే వర్ణించారు. ఈ ఆశ్చర్యకరమైన సంభవాన్ని మనమూ ఇలానే అర్థం చేసుకోవాలి.*
*దేవుని నిత్యుడైన కుమారుడు మానవుడయ్యాడని కొత్త నిబంధన చెప్తుచున్నది. ఇలా కావడం ఆయన దైవత్వాన్ని ఎంతమాత్రం తగ్గించలేదు. బెత్లెహేములో కన్యకు పుట్టిన పసివాని కథ ఆయన మానవత్వాన్ని తెలియజేస్తున్నది.*
👉 *"తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువు తొట్టిలో పరుండబెట్టెను’’*
👉 అప్పుడే పుట్టిన ఏ శిశువుకైనా ఎలాటి జాగ్రత్త అవసరమో అదే అవసరాలను కలిగి ఉన్న నిస్సహాయుడైన శిశువుగా యేసు ఈ లోకంలోకి వచ్చాడు. మన నూతన జన్మ తరువాత మనలో నివసించేందుకు పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు కాదు. *ఒక మనిషిలో నివసించేందుకు కుమారుడు దిగిరావడం కాదు ఈ జన్మం. కుమారుడైన దేవుడు సంపూర్తి మానవ జీవితాన్ని ఆరంభించాడు. అంటే మొదట మానవ తల్లిదండ్రుకు లోబడ్డాడు. అదే సమయంలో తన పరమ తండ్రి కూడా. మనమందరం పెరిగినట్టుగా పెరిగాడు.*
లూకా మాటల్లో చెప్పాలంటే *‘‘యేసు జ్ఞానమందును, వయస్సునందును దేవుని దయందును, మనుష్యు దయయందును వర్థ్లిుచుండెను’’* (వ 52).
*దేవుడు మానవుడయ్యాడు......ఇది అద్భుతం"*
👉నాకు అద్భుతం అంటే ఏంటో తెలియదు నాకు తెలిసిన అద్భుతం కేవలం *"ప్రభువైన యేసు"* మాత్రమే. ఆయన కంటే మరొక అద్భుతం లేదు...మరేది ఆయనకు సాటి కాదు
👉మానవుడు దేవుడైపోదామను కుంటున్నాడు అలాంటి వారు *"నేనే దేవున్ని అని చెప్పుకు తిరగాలి"*. ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్లను కోకొల్లలుగా చూస్తూ ఉంటాము.
*"దేవుడు మానవుడయ్యాడు......ఇది అద్భుతం"*
♻ గర్భాశయంలో నీ ఆరంభం...నిర్మాణం...ఈ భూమి మీదకు నీ ప్రవేశం ఎలా ఏర్పరచారో ఆ మాదిరి గానే
*"కంటికి కనపడని జీవకణ దశ నుండి అడుగు పొడవు శిశువుగా...శైవదశవరకు...అనంతశక్తివంతుడైన మహా దేవుడు ఒక ఆడకూతురు గర్భాశయములో తొమ్మిది నెలలు ఉన్నాడు..........ఇదీ అద్భుతం.*
👉ఎందుకంటే!!!!
*"పాపముతో పరలోకాని మనిషి వెళ్లలేడు పాపరహితుడే పరలోకం వెళ్లగలడు*
ఈ భూమి మీద పాపము లేని వాడు ఒక్కడు లేడు కాబట్టి ఎవ్వరూ పరలోకం పోలేరు.
👉 *మానవులు పాపవిముక్తులు అవ్వాలి అంటే పాపవిమోచన కార్యం జరగాలి...ఈ కార్యం జరిగించాలంటే పాపములేని దేవుడే పరలోకం నుండి రావాలి".*
👉 *"దేవుని పోలికగా మనిషి చేయబడ్డాడు - మనిషి పోలికగా దేవుడు పుట్టాడు....ఇదీ అద్భుతం".*
*"నిరాకారుడైన దేవుడు - శరీరాన్ని ధరించుకున్నాడు ....ఇదీ అద్భుతం".*
👉 *"పాపము వలన వచ్చు జీతం మరణం"* అంటే పాపానికి శిక్ష ఉంది...ఆ శిక్ష అనుభవించడానికే "
*"నిరాకారడైన దేవుడు - శరీరధారుడైనాడు"* ఇదీ అద్భుతం
*"రెండు వేల సం,,క్రితం ప్రభువైన యేసు మరణించాడు"*
*....కాని మరణం ఆయనను బంధించలేక పోయింది*
*ఎందుకంటే శరీరమందు నివశించిన దేవుడు గనుక మూడవ దినమున తిరిగి లేచాడు... ఇదీ అద్భుతం*
👉 యేసు ప్రభు ఒక గుర్తు కాదు *"ఒక వ్యక్తి"*
👉 యేసు ప్రభు ఒక మిధ్య కాదు *"ఒక చారిత్రక వ్యక్తి"*
👉 మన ఆలోచన అందుబాటులో ఆయన ధార్మికతలకు గొప్ప మాదిరి...
👉 ఆయన సన్నిధి హృదయం లో లేకుండ నిజమైన పరిపూర్ణ ధార్మికత సాధ్యం కాదు...
👉దైవావతారము నుండి మనము ఆశించేది......
*"పాపరహిత పరిపూర్ణత"*....
*దీనిని మనము కేవలం యేసు క్రీస్తులో మాత్రమే కనుగొంటాము"... ఇదీ అద్భుతం*
👉నా చివరి మాట......!!!!!!
నా ప్రభు యేసు ఇలా అన్నాడు.......
*"నాలో పాపమున్నదని స్ధాపించగలవాడెవడు....?"*
👉 *"అద్భుతం అంటే యేసే - యేసే అద్భుతం"*
*"మరొక అద్భుతం లేదు - మరేది ఆయనకు సాటి రాదు"*
*యేసు మానవుడు గనుక మనలాగానే* అన్ని అనుభవాలూ ఎదుర్కొన్నాడు, అందరికీ కలిగే శోధనను, *నైతిక సంఘర్షణను పొందాడు*. *ఇలా పొందినందువల్లే మన శోధన సమయాల్లో మనకు సహాయం చెయ్యగల వాడయ్యాడు (హెబ్రీ 2:18). అయిన ఆయన దేవుడు కాబట్టి శోధనకు లొంగిపోజేసేది ఏమీ ఆయనలో లేదు. ఆయన పాపం లేనివాడు (2 కొరింథీ 5:21). పాపంలేని వాడు కాబట్టి తన స్వంత పాపాల కోసం చనిపోవలసిన అవసరం ఆయనకు లేదు. అయితే ఇతరు (మానవాళి) పాపాల కోసం చనిపోయాడు.*
అవతారం అనే ఈ ఆశ్చర్యకరమైన సంగతిని బట్టి దేవునికి వందనాలు. కుమారుని రూపంలో ఈ భూమికి వచ్చి మన కోసం జీవించి మన కోసం మరణించిన ఆయన కృప కొరకు వందనాలు.
*మనలో ఏమేమి చేద్దామని ఆయన వచ్చాడో అదంతా ఆయన చేసేలా మనం ఆయనకు లోబడాని, అలాటి కృప కోసం ప్రార్థన చేద్దాం.*
2️⃣ *ఆయన బాప్తీస్మం*
_మత్తయి 3;13-17_
లూకా 2:41-52 లో వ్రాసి ఉన్న ఒక సందర్భం తప్పించి మన ప్రభువు పుట్టుక నుండి బహిరంగ పరిచర్య చేపట్టేవరకూ, అంటే దాదాపు 30 సం”ల వయసు వచ్చేవరకూ మధ్యనున్న కాలంలో ఏమి జరిగిందో సువార్తలేవీ చెప్పలేదు (లూకా 3:23).
అప్పుడు గలిలయ నుండి యోర్దాను నది దగ్గర బాప్తీస్మమిచ్చే యోహానును బాప్తిస్మమివ్వమని అడిగాడు (వ.13). యోహాను: తానూ యేసు కంటే అల్పుడు. యేసే వచ్చి తనకంటే అల్పుడుగా తన ముందు నిలబడ్డాడు. *“నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా?”* అని అడుగుతున్నాడు.
*యోహాను ఇచ్చేది పశ్చాత్తాప బాప్తీస్మం* (వ.6). అలాగైతే పాపం ఏమీ చేయనివానికి ఈ బాప్తీస్మంతో ఏం పని?
👉 *మన ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అర్ధం చేసుకోగలిగితే ఈ చిక్కుముడి విడిపోతుంది.ఆయన లోకానికి విమోచన కలిగించేందుకు వచ్చాడు. ఎవరిని రక్షించేందుకు వచ్చాడో ముందుగా వారిలో ఒకడుగా కలిసిపోయాడు.*
👉 *ఆయన పశ్చాత్తాపం అవసరమైన పాపి కాదు.* అయితే తరువాతి కాలంలో పాపరహితుడైన ఆయన మన కోసం మరణించినట్టే ఇప్పుడూ మన పక్షంగా పశ్చాత్తాప బాప్తీస్మం పొందాడు.
యేసు నీళ్ళలో నుండి బయటకు వస్తుండగా ఆకాశాలు తెరువబడి పరిశుద్దాత్మడు పావురం రూపంలో ప్రత్యక్ష్యమయ్యీ. పరము నుండి *“ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేనానందించుచున్నాను”* (వ16,17)అనే స్వరం వినిపించింది. ఇలా *దేవుడు, తన కుమారుని పాపరహిత స్థితిని గురించి సాక్ష్యమిచ్చాడు.*
👉 మన ప్రభువు అప్పటికి పరిచర్య ఆరంభంలో మాత్రమే ఉన్నాడు. అంతకు ముందు *ముప్పది సం”రాలలో పేద ఇంట్లో ఎదుగుతూ కష్టపడి పనిచేస్తూ సమస్యలు, శోధనలు చుట్టుముట్టిన ప్రపంచంలో పరిపూర్ణ నీతిమంతుడై జీవించాడు. అందువల్లనే తండ్రి “ఈయన వల్ల నాకు ఆనందం” అని చెప్పగలిగాడు.*
యేసుపై పరిశుద్దాత్మ దిగి రావడం దేవుడు ఆయనను అభిషేకించిన విధానమన్నమాట. తానూ ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడో ఆ పనిని చేపట్టేందుకు సిద్దంగా ఉన్నారు. అది శాంతి విమోచనలను తెచ్చే పని. పావురం శాంతికి చిహ్నం. అందువల్ల మన ప్రభువు బాప్తీస్మం సమయంలో ఆయనను అభిషేకించిన రీతిలో ఆయన జన్మ సమయంలో పలుకబడిన మాటలు గుర్తుకొస్తాయి. *“సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమిపై సమాధానము కలుగును గాక”* (లూకా 2:14).
*ప్రభువు బాప్తీస్మం దగ్గర మూడు అంశాలు కనిపిస్తున్నాయి.*
1. *ఆయన ఆభిషేకం*,
2. *ఆయన పరిశుద్ధత*,
3. *పాపుల పక్షంగా ఆయన నిలిచిన విధానం.*
*దేవుడు మనలను కూడా సువార్తను తీసుకుని పాపుల వద్దకు వెళ్ళమని అభిషేకిoచాడు. మనం పరిశుద్ధంగా జీవిస్తేనే, ఎవరి దగ్గరకైతే దేవుడు మనలను పంపాడో వారిని ప్రేమించగలిగితేనే ఈ నియామకాన్ని నేరవేర్చగలుగుతాం.*
స్వయముగా యేసయ్య ఇలా అంటున్నారు....
*"నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడ వచ్చునప్పుడు సిగ్గుపడును" అని....*
( మార్కు 8:38 )
👉మరి సువార్త అను ఈ దేవుని శక్తిని కలిగిన వారు, ఆ శక్తీ గురించి తెలిసిన వారు *దానిని ఇతరుల ముందు తన సాక్ష్యముగా ప్రకటించుటకు ఎందుకు సిగ్గుపడాలి....?*
ఇదే పౌలు తనకుతాను వేసుకున్న ప్రశ్న. తను తన జవాబును పొందుకున్నారు అందుకే ఏమాత్రం జడియకుండా అంటున్నారు....
*"సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను"*
👉పరిస్థితులు అనుకూలముగా లేవు అని నేను సిగ్గుపడువాడను కాను....
👉నా ముందు ఉన్న వారి గురించి నేను సిగ్గుపడువాడను కాను....
👉నాకు ఎదో అవుతుంది అని నేను సిగ్గుపడువాడను కాను....
👉ఎవరో ఎదో అంటారు అని నేను సిగ్గుపడువాడను కాను....
*నా దగ్గర ఉన్న ఈ సువార్తకున్న శక్తీ నాకు తెలుసు కనుక నేను సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఇది(సువార్త) విశ్వసించు వానిని రక్షించుటకు దేవుని శక్తీయైయున్నది.*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి