ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నడిపింపు

✳ *నడిపింపు* ✳

 1⃣ *వాక్కు ద్వారా నడిపింపు*

యోహాను 6:60-71 
యోహాను 6: 63, 68-69, 27, 58, కీర్తనలు 119:112 

*దేవుని పిల్లల జీవితం నడిపింపు గల జీవితం. అయితే అనేకమంది విశ్వాసులకు ఇది పెద్ద సమస్య.* 

యేసు ప్రభువు చెప్పినదాన్ని స్వీకరించడం చాలామంది శిష్యులకు చేతకాలేదు. తాను దేవుణ్ణని చెప్పుకుంటున్నాడనీ, ఆయన ద్వారా నడిపించబడితేనే తప్ప నిజమైన జీవం ఎవరు పొందలేరనీ ఆయన బోధిస్తున్నట్టుగా వారు గ్రహించారు. *ఈ కారణం వల్లనే అనేకమంది ఆయన్ను విడిచిపోయారు (వ 66).*

👉 *పన్నెండుమంది మాత్రం ఆయనతోనే ఉన్నారు.*

👉 అలాగని వారిలో భయాలు సందేహాలు లేవని కాదు. వారందరిలో ఉన్న ఏకాభిప్రాయం పేతురు పలికాడు. 
*“ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము ? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు” (వ. 68).*

👉 *నడిపింపు అంతటికీ ఆధారం ఇదే. యేసు క్రీస్తు పట్ల విధేయత, ఆయన దైవత్వం గురించిన సత్యం, ఆయన  పునరుత్థాన, ఆరోహణలలో ఋజువైంది.*

యేసు చెప్పాడు, *“ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి”* (వ.63) 

👉అంటే *ఆయన ఉద్దేశ్యం తన మాటలను సరిగా అర్ధం చేసుకుని పాటిస్తే తన శిష్యులకు అవి మార్గదర్శకాలవుతాయి.*

 *శరీరరీతిగా, అంటే మన ఇష్టం చొప్పున చేద్దామన్న ధోరణిలోనే వాక్యం చదివితే నిజంగా దేవుని చిత్తానికి లోబడకపోతే వాక్యంలోని అర్ధాన్ని మన స్వార్ధ ప్రయోజనాల కోసం అపార్ధం నిండిన ఆలోచనల కోసం తప్పుగా వ్యాఖ్యనించుకుంటాం.* 

🔺 *దేవుని వాక్యం మనకు మార్గదర్శం కావాలంటే రెండు ముఖ్య విషయాలున్నాయి.*

*1. మొదటగా, దానిని సరిగా అర్ధం చేసుకోవాలి.* వాక్యం గజిబిజిగా ఉన్నా, అనేక భాగాల కూర్పు కాదు. అవి ఇదమిద్దమైన ఆధ్యాత్మిక సూత్రాలతో, ఉదాహరణలతో ఉన్న పుస్తకాలు. *వాటిని అర్ధం చేసుకుని వివేకంతో మన పరిస్థితికి అన్వయించుకోవాలి.*

 కొందరైతే తమ పరిస్థితులకు సరిగ్గా సరిపోయినట్టున్న ఒక వచనాన్ని పట్టుకుని నడిపింపు పొందాలని చూస్తారు. ఇది కొన్నిసార్లు ప్రమాదకరం. ఆ భాగంలోని అసలైన అర్ధాన్ని విస్మరించి వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మలుచుకునే ప్రమాదం ఉంది.

*2. అవశ్యకమైన రెండవ అంశం ఏమిటంటే, దైవ చిత్తానికి పూర్తిగా లోబడడం. లేఖనాలిచ్చే నడిపింపు ఎల్లప్పుడూ మన పాలిట అత్యంత మేలుకరమైనది.* 

👉 అయితే అది మనకు ఇష్టం లేని మార్గం కావచ్చు. మన స్వంత ఇష్టం కంటే దైవ చిత్తానికి అధిక ప్రాధాన్యత ఇవ్వకుంటే బైబిలు మనలను నిరాశపరిచేదిగా ఉంటుందే గాని నడిపింపు ఇచ్చేదిగా ఉండదు. 

*ఆయన వాక్కులోని నడిపింపుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించుధాం దానిని అర్ధం చేసుకుని ఆయన చిత్తానికి నిజంగా లోబడగలిగేల ఆయన సహాయం కోరుదాం.* 

2⃣ *ఆత్మ నడిపింపు* 

నిర్గమ 13:17-22
నిర్గమ 13:21; 1 కొరింథీ 2:11,14; నెహెమ్యా 9:19;

*దేవుడు మనుష్యులను మెల్లగా నడిపిస్తాడు ఇశ్రాయేలువారి అసమర్ధతలు ఆయనకు తెలుసు.* ముందు కాలంలో యుద్ధాలు చేయవలసి ఉంటుందన్న విషయాన్నీ వారికీ చెప్పకుండా ఉంచలేదు. అందుకే వారు యుద్ధ సన్నద్దులయ్యారు (వ. 18) కాని వారింకా పూర్తిగా తయారు కాకముందే ఆయన యుద్ధాలు రప్పించలేదు (వ. 17). 

*దేవుడు మనలను కష్టతరమైన పరిస్థితులలో నడిపించే సమయంలోనే వాటిని అధిగమించగల ఆధ్యాత్మిక బలాన్ని కూడా చేకూరుస్తాడు.* 

పరిశుద్ధాత్మను సూచించే అనేక చిహ్నాలు పాత, కొత్త  నిబంధనలలో కనిపిస్తాయి. 
*ఇక్కడ మేఘ స్తంభం, అగ్ని స్తంభం అనే రెండు కనిపిస్తున్నాయి* (వ. 21 -22). దేవుడు తన ప్రజలకు పగలు, రాత్రి కూడా నడిపించే సదుపాయాలు కల్పించాడు. ఈ రెండు స్థంబాల కదలికలు బట్టి ప్రజలు నడిచేవారు. వాటిని అనుసరించి వెళ్లేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఇప్పటిలాగా పరిశుద్ధాత్మ వెల్లడింపు ఆనాడు వారికి లేదు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ వారిని నడిపించారు. 

*దేవుని ప్రజలకందరికీ ఆత్మ నడిపింపు అనేది ఒక అద్భుతమైన వాస్తవం.*

👉 అయితే *ఏది ఆత్మ నడిపింపో, ఏది స్వసంకల్పమో అనే విషయంలో జాగ్రత్త వహించాలి. దేవుని వాక్కుకు సన్నిహితంగా ఉన్నట్టయితే మనకు ఈ సందిగ్ధం ఉండదు.*

 ఇలాటి ఆత్మ నడిపింపు మన మనస్సులో ఊహించుకునే ఒక విషయం మాత్రమే కాదు. మనుష్యులు చూసి గ్రహించగల ప్రత్యక్ష సూచనల సహాయంతో ఈ నడిపింపు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మేఘ స్థంభం వాటి కదలికలు స్పష్టంగా తెలిపాయి.

*నేటి కాలంలో ఆత్మ నడిపింపుకు గీటురాయి బైబిలు గ్రంథం. ఆత్మ ఎప్పుడూ వాక్యానుసారంగా నడిపిస్తాడు. ఆయన వాక్కును మనం గౌరవించినంత మేరకు ఆయన మనలను నడిపిస్తాడు.*

👉 ఆత్మ నడిపింపు అంటే అంతరంగంలో తళుక్కున మెరిసే ఒక ఆలోచన మాత్రమే కాదు. ఆ ఆలోచన లేఖనాలను పరిశీలించడం ద్వారా సరిచూసుకోవచ్చు. మనం మన స్వంత ఆలోచనలను పరిశుద్ధాత్మ నడిపింపుకు అంటగట్టకుండా ఉండగలిగేలా దేవుణ్ణి వేడుకుందాం.

3⃣ *పరిస్ధితుల ద్వారా నడిపింపు*  

అపొ. కా 16:6-12    
అపొ. కా. 16:6, 7, 9, 10, ఆది 24:27 

*పౌలు, సీల, తిమోతి ఆత్మ నడిపింపుకై తమ చెవులు రిక్కించి వింటున్నారాన్నది స్పష్టం. ముందుకు నడవాలన్న, ఆగిపోవాలన్న అంతరంగంలో నుండి నడపించే ఆత్మ వాల్ల ఎలాటి జంకూ లేకుండా అవసరమైనది చేయగలిగారు* (వ 6). 

దేవుడు పౌలు, అతని అనుచరుల పరిచర్యలో వారికిచ్చిన నడిపింపు అంతటి వెనుకా వారిలో వాక్యం, జ్ఞానం, దాని పట్ల విధేయత ఉన్నాయి. 

*అపోస్తలులను నడిపించేందుకు ఆత్మ ఆ పరిస్ధితులను కూడా ఉపయోగించుకున్నాడు. దేవుడు తన పిల్లల మార్గాలన్నిటిలోనూ వారిని తన ఇష్ట ప్రకారం నడిపిస్తాడని మనం నమ్మితే ఆశ్చర్యం కలిగించదు.*

 *దేవుడు మనకు అవగాహన శక్తినీ, సామాన్య జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని వాక్కు ఆధారంగా ఈ యుక్తాయుక్త విచక్షణను మనం ఉపయోగిస్తే వాటి ద్వారా దేవుడు మనకు మార్గం చూపుతాడు.* 

పౌలు, అతని బృందం బితునియలోనికి వెళ్లే ప్రయత్నం చేసారని లూకా వ్రాస్తున్నాడు. అయితే *“యేసు యొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు”* (వ 16). ఎటు వెళ్ళాలో సరియైన అవగాహన లేక బితునియ వైపుకు వారు వెళ్తూ  ఉన్నారు. అయితే ఆత్మ వారిని అడ్డగించాడు. అది ఏ విధంగానో మనకు చెప్పబడలేదు.

 *దేవుని నుండి స్పష్టమైన మాట రానంతవరకూ పౌలు, అతని బృందం సోమరులుగా కూర్చోలేదు. వారి అనుభవం, ఆసక్తులను బట్టి ఒక దిశగా ప్రయాణం సాగించారు. ఆత్మ స్పష్టంగా తమ దారిని తెరుస్తాడనీ, అలా కానీ పక్షంలో వెళ్ళవలసిన దిశను చూపుతాడనీ వారికి గట్టిగా నమ్మకం.* 

*తల్లిదండ్రులు పిల్లలు ఎదిగిన తరువాత కూడా వారు వేసే ప్రతి అడుగునూ తరచి చూడరు. పిల్లలు తమ జ్ఞానాన్ని, నేర్చుకున్న సూత్రాలను ఉపయోగించుకొని నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. దేవుడు కూడా తన పిల్లల విషయంలో ఈలాగే ప్రవర్తిస్తాడు. వారు గనక దారి తప్పితే దయతో సరిచేస్తాడు.* 

త్రోయకు వెళ్ళమని ఆత్మ పౌలు తిమోతిలకు ప్రత్యేకంగా చెప్పినట్టు ఇక్కడ వ్రాసిలేదు. అయితే సహజంగా అటు వెళ్ళాలని వారికి అనిపించి ఉండవచ్చు. త్రోయకు వెళ్ళాలన్న వారి నిర్ణయం దేవుని నడిపింపేనన్న విషయం అటు తరువాత జరిగిన సంభవాల వాళ్ళ ఋజువైంది. 

ఒక దర్శనం ద్వారా మాసిదోనియలో తనకున్న పని గురించి పౌలు తెలుసుకున్నాడు. తద్వారా ఐరోపా ఖండంలోనికి సువార్త వ్యాపించింది. 

*మన పరిస్ధితులు ప్రభువు నిర్దేశించే విధానం కొరకు ఆయనను స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ నడిపింపు, అవరోధాలకు మనం లోబడగలిగేల ఆయన సహాయం కొరకు వేడుకొందాం.* 

4⃣ *దేవుని ప్రజల సహవాసం ద్వారా నడిపింపు* 

అపొ . కా 15:6 -21  
అపొ. కా 1:14; 15:25 ఫిలిప్పీ 2:2; ఎఫెసీ 3:18,19; 4:25

*రక్షణ దొరకాలంటే సున్నతి అవసరమని వాదిస్తూ కొందరు అంతియొకయ నుండి యూదయ ప్రాంతానికి వచ్చారు* (15:1). 

ఈ విషయంలో అధికార తీర్మానం ఒకటి అవసరమైంది. తమ అభిప్రాయాలు సరియైనవేనన్న విషయంలో పౌలు, బర్నబాలకు ఎలాటి సందేహమూ లేదు. 

👉 *అయితే ప్రాముఖ్యమైన విషయంలో వారు మరింత విస్తృతంగా దేవుని ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవలసి ఉంది. అందువల్ల ఈ ప్రశ్నను  యెరుషలేములో పెద్దల యెదుట ఉంచడం జరిగింది.ఈ సమస్యను కూలంకషంగా చర్చించడం జరిగింది.*

 *“బహు తర్కము”* జరిగింది (వ 6). పేతురు లేచి అన్యజనులకు సున్నతి లేకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ సాక్ష్యం ద్వారా రక్షణ నిశ్చయత ఇవ్వబడిందని చెప్పాడు. అన్యజనుల మధ్య దేవుడు తమ ద్వారా జరిగించిన అద్భుత కార్యాల గురించి పౌలు, బర్నబాలు సాక్ష్యమిచ్చారు. వీరి  ముగ్గురి మాటలను యాకోబు బలపరస్తూ ప్రవక్తయైన ఆమోసు గ్రంథంలోని మాటలను ఉదాహరించాడు (వ 16-18). 

*ఈ నిర్ణయానికి రావడంలో మూడు అంశాలు తోడ్పడ్డాయి.*

🔹 *అవి దైవ వాక్కు* 

🔹 *ఆత్మ సాక్ష్యం*  

🔹 *ఆ వాదానికి బలం చేకూరుస్తూ ఉన్న అప్పటి పరిస్ధితులు.*

👉 *ఇవి కాక అపోస్తలుల, పెద్దల  జ్ఞానయుక్తమైన సమాలోచన. వీరు సామన్యమైన మనుష్యులు కాదు. ఈ సమస్య విశ్వాసులందరిపైనా ప్రభావం చూపించేది. అందువల్ల బాధ్యత గల పెద్దలు, దేవుని ప్రజల ప్రతినిధులు దీనిని పరిష్కరించవలసి ఉంది.* 

*నడిపింపు అనేది మానవ పరిస్ధితులకు అతీతంగా ఎన్నడూ ఉండదు. వాక్యం, ఆత్మ స్పష్టంగా మాట్లాడవచ్చు గాని మానవ మాత్రులైనవారు చక్కగా విని, వివేచించాలి గదా. అందువల్ల పొరపాటు జరిగే అవకాశం లేకపోలేదు.*

👉 ఇలా ఒక మనిషిలో పొరపాటును మరొకడు తనలోని ఆత్మ వివేచన వాళ్ళ సరిదిద్దగల సదుపాయం కొరకే *దేవుడు సహవాసాన్ని ఇచ్చాడు.*

 *దేవుని నడిపింపును మనం ప్రార్ధనా సహాయంతో వెతికే సమయంలో ఇతర విశ్వాసుల అభిప్రాయాలు కూడా పరిగణించాలి.* 
ఇలా సాటి విశ్వాసులతో సహవాసాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇలాటి వారి ద్వారా మనకు ఆయన కనబరిచే నడిపింపును మనం గౌరవించగలిగేల   ఆయన మనకు నేర్పించాలని ప్రార్ధన చెద్దాం.

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...