ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మన ప్రభువు జీవితం 2️⃣

✳️ *మనప్రభువు జీవితం* ✳️

(రెండవ భాగము)

3️⃣ *యేసు క్రీస్తు ఆయన శిష్యులు*
మార్కు 3:3-19 


మార్కు3:13; 6:7; లూకా 22:28-30; యోహాను 20: 27,28; 16:15,16.

    మన ప్రభువు కొద్దికాలం చేసిన పరిచ్యర్యలోని ఒక ముఖ్య విషయం 12 మంది శిష్యులకు  శిక్షణ నివ్వడం అనేకమందికి అనేకవిధాలుగా ఆయన పరిచర్య చేశాడు గాని, *ఆయన శక్తి యుక్తులు ముఖ్యంగా మన శిష్యులకు బోధించడంలో కేంద్రీకరించాడు. ప్రభువుతో ఉండేందుకు 12 మంది ఎన్నుకోబడ్డారని మార్కు చెబుతున్నాడు (వ 14). వారిని బోధించమని ప్రభువు పంపించాడు (వ 14) దెయ్యాలను వెళ్లగొట్టే అధికారం వారికీ ఇచ్చాడు (వ 15). ఈ 12 మందినీ ప్రభువు అపోస్తలులు అన్నాడు. ఆది సంఘ యుగంలో ఒక విలక్షమైన స్థానం ఉంది.*

👉 అయితే ప్రభువు వారికీ ఇచ్చిన *మూడు ఆదేశ సూత్రాలు మనమూ పాటించాలి.*
1. *ప్రభువు మనలను తనతో కొంత సమయం గడపమంటున్నాడు* 
2. *తన రక్షణ శక్తిని గురించి ఇతరులకు సాక్ష్యం ఇమ్మంటున్నాడు.* 
3. *సాతాను సంబంధమైన ప్రతిదానిమీద ముందుగా మనలోని వాటి మీద వాక్యం పట్ల విధేయతను ఇతరుల మీద కూడా అధికారం ఇచ్చాడు.*

    12 మంది శిష్యుల పేర్ల  జాబితాను మార్కు ఇస్తున్నాడు. *వీరిలో మనకు కొంత పరిచయం ఉన్నవాళ్ళను చూస్తే కావలసిన అంత తేడ వారిలో వారికీ కనిపిస్తున్నది.*

👉 వారిని ఒక సహవాసంగా కూర్చడం తేలిక కాదు. సంఘ పునాదిలో వీరందరి ఐక్యతను చూస్తే ప్రభువు వివిధ వ్యక్తిత్వాలు గలవారిని ప్రేమ బంధంలో ఎలా బంధించగలడో అర్ధమౌతుంది. *ఫలానా విశ్వాసితో మనం కలివిడిగా ఉండలేము అనిపించిన సమయంలో సువార్త శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును అనుసరించాలన్న నిర్ణయాన్ని మనం చేసుకోగలిగితే ప్రభువును మనలో పనిచేయనిస్తే ఆ శక్తి మనలను ఏకం చేయగలదు.* 

      కొందరు శిష్యులు పేర్లు మరి ఇంకేం విశేషాలు మనకు తెలియవు. ఉదాహరణకు అల్ఫయి కుమారడైన యాకోబు, తద్దయి, మొదలైనవారు ఇక పేతురు యోహానల గురించి మనకు బాగానే తెలుసు శిష్యులలో కనిపించే మనస్తత్వాల వైవిధ్యాన్ని గమనించడం తేలికే. సిమోను తీవ్రవాది, దేశ భక్తి గల యూదుడు. మత్తయి రోమా ప్రభుత్వం తరుపున సుంకం వసులు చేసేవాడు. పేతురు దుడుకువాడు. యోహాను పేరుగల శిష్యుడు (అంతకముందు ఉరిమేవాడు). అంద్రేయ విశ్వాస వీరుడు, తోమ శంకితుడు.
 
  👉 అంతా ఒకే విధంగా ఉన్నవారిని యేసు పిలువలేదు. వారి సంబంధాలలో ఉన్న అవకాశాలూ, అవరోధాలూ అలా ఉండగానే వారిని ఇద్దరిద్దరిగా పంపాడు (మార్కు 6:7). వారికి ఎదురయ్యే సమస్యలు ఆయనకు తెలుసు. ఆయనలో వారు విజయం పొందారు. 

     *ఈ 12 మందినీ ఒక చిన్న సంఘం అనుకోవచ్చు. ప్రేమతో దేవుని ప్రజలంతా  ఐక్యంగా ఉండాలంటే సహవాసం ఉండాలనీ ప్రభువు శక్తి ఆవశ్యకమనీ ఈ శిష్యుల ఉదాహరణ. మనకు చెబుతున్నది. ప్రభువు బిడ్డలందరితోనూ, మన జీవితాల్లోనూ మరింత లోతైనసహవాసం కోసం ప్రార్ధన చేద్దాం.*


4️⃣ *యేసు క్రీస్తు ప్రార్థన* 
మార్కు 1:29-30 
మార్కు 1:21-38; యోహాను 5:30

    *“ఆయన పెందలకడనే లేచి, ఇంకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్ధన చేయుచుండెను”* (వ 35). 

👉 యేసు దేవుడు, అయినప్పటికీ ఆయన మానవుడే.  *ఆయన జీవితంలో ప్రార్థన ఒక ప్రముఖ పాత్ర వహించింది.* 

*ఆయన ఎప్పుడూ  తండ్రి పై ఆధారపడి జీవించాడు (యోహాను 5:30).*

 *ప్రార్థన ద్వారా తండ్రి చిత్తం జరిగించేందుకు ఆయన శక్తి పొందాడు (మార్కు 14:36).*
 
యేసు కపెర్నహూములోని సునగోగులో బోధిస్తూ ఉన్నాడు (1:21). అపవిత్రాత్మ పట్టిన ఒకడు లోపలికి వచ్చాడు. యేసు అతణ్ణి బాగుచేసాడు (వ 25). సునగోగును వదిలి సిమోను, అంద్రెయల ఇంటికి వెళ్ళాడు. అక్కడ సిమోను అత్త జ్వరాన్ని స్వస్ధపరిచాడు (వ 29-30). ఆ వార్త త్వరితంగా వ్యాపించింది. సాయంత్రానికల్లా అన్నీ రకాల రోగులూ పట్టణం నలుమూలల నుండీ ఆ ఇంటికి వద్దకు వచ్చి చేరారు. 
          ఆ ఉదయాన్నే మళ్ళీ అరణ్య ప్రదేశంలో ప్రార్థనకు వెళ్ళాడు (వ 35). అంతకు ముందు రోజు పరిచర్యలో ఆత్మలోను, శారీరకంగాను ఆయన అలసిపోయాడు. ఆధ్యాత్మిక శక్తి తిరిగి పుంజుకోవడం అవసరం. 

👉 *ఆయన దేనికోసం ప్రార్ధించాడో మనకు తెలియదు కాని తాను పంపబడిన కార్యం పూర్తి చేసేందుకు శక్తి కొరకు తప్పక ప్రార్థించి ఉంటాడు.*

సిమోను, అతనితో బాటు మరికొందరిని ఆయన ప్రార్థన చేసుకొంటున్న చోటుకు వచ్చారు (వ 36). స్వస్థపడదామని చాలా మంది వచ్చి ఉంటారు. మరికొందరు ఆయన అసలు ఎలా ఉంటాడో చూద్దామని వచ్చి ఉంటారు. అయితే ప్రభువు వారితో వెళ్ళలేదు. *“ఇతర సమీప గ్రామములలోను, నేను ప్రకటించునట్లు వెళ్ళుదము  రండి”* (వ 38). 

👉 *మన ప్రభువు లక్ష్యం ఒక్కటే. సువార్త ప్రకటన.*
 కనికర హృదయంతో వారికి ప్రకటించాడు. 

*ఆయన చేసిన స్వస్థతలు అన్నీ ప్రేమగల ఆయన హృదయంలో నుండి జాలువారినవే. కాని ఆయన వచ్చిన పనికి ఇవి అనుబంధాలు మాత్రమే.*

      ఆయన అసలు పని దేవుని రాజ్యన్ని బోధించడం. ప్రార్థన మూలంగా దీనిని ఆయన నిరంతరం తన ఎదుట ఉంచుకున్నాడు. దేహ స్వస్థత కొరకు తన చుట్టూ ఉన్న వారంతా ఎగబడుతుంటే సువార్త ప్రకటనకు ఆయన తన శక్తిని ఉపయోగిస్తున్నాడు. ఆయనకు శారీరక అవసరతలు లేకపోలేదు. అయితే కేవలం మేలు చేసేందుకే తన కాలం అంతా వెచ్చించే శోధనలో ప్రభువు పడలేదు. ఇలా చేస్తే మరింత ప్రయోజనకరమైన విషయం మూలన పడేది.
      *మనం కూడా ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. మనలను పిలిచేవారు చాలామంది ఉన్నారు. అయితే దేవుని చిత్తాన్ని ఎరిగి దానిని చేసేందుకు బలం పొందడమే ప్రాముఖ్యం.*



5️⃣ *రూపాంతరము*
_మార్కు 9:1-8_
మార్కు 8:31-33; 9:2-7 

         కైసరయ ఫిలిప్పిలో యేసు తన శిష్యులకు తనను తాను బయలుపరచుకొన్న తరువాత ఆరు రోజులకు రూపాంతరము సంభవించిoది (8:29). “నీవు క్రీస్తువు” అని పేతురు పలికినది అక్కడే. అప్పుడు యేసు తన శిష్యులకు తాను తృణీకరించబడి, బాధలు అనుభవించి, చనిపోయి మూడు రోజుల తరువాత తిరిగి లేవవలసి ఉన్నదని చెప్పాడు (8:31). అందుకు పేతురు నొచ్చుకుని ప్రభువును గద్దించసాగాడు (8:32). *“సాతానా నా వెనుకకు పొమ్ము. నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని, దేవుని సంగతులను మనస్కరించుట లేదు”* అని పేతురును ప్రభువు  గద్దించాడు. మెస్సీయ హింసలు పొందడం అంటే శిష్యులకు నమ్మశక్యం కాని  మాట. యేసు వారితో పలికిన మాట వారి విశ్వాసానికి గొడ్డలి మెట్టు.

        యేసు రూపాంతరం చెందినప్పుడు పేతురు, యాకోబు, యోహానులు ఆయనతో ఉన్నారు. అప్పుడు మోషే, ఏలియాలు ప్రత్యక్ష్యమై యేసుతో మాట్లాడారు. ఒక మేఘం వారిని కమ్మింది. ఒక స్వరం వినిపించింది, *“ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి”* (వ.7). శిష్యులు భయపడి ఏమి అనుకున్నప్పటికీ (వ.6) దేవుడు తన కుమారునిపై ఆమోద ముద్ర వేసి ఆయన కోరుకున్న సిలువను  ఆమోదించాడు. 

*కైసరయ ఫిలిప్పులో యేసు తన శిష్యులతో చెప్పినది అంతం కాదు.ముందు రాబోతున్న హింస, త్రుణీకారం, మరణాలలో పరాజయంలాగా కనిపించిన దానిలో నుండి విజయాన్ని వెలికి  తెచ్చే దేవుని ప్రేమ, శక్తి ఉన్నాయి. ఈ విజయం ప్రభువు పునరుత్ధానం గొప్ప మహిమతో వెల్లడి అవుతుంది.*

        మోషే ఏలియాలు ధర్మశాస్త్రం ప్రవక్తలకు గుర్తుగా ఉన్నారు. వారు ప్రకటించిన దానిని నెరవేర్చేందుకు యేసు వచ్చాడు. ధర్మశాస్త్రం, ప్రవక్తలలో తరతరాలుగా వస్తున్న బోధలు శిష్యుల మరో ప్రవృత్తిని మలిచాయి.అయితే యేసు వీటిని మిoచిన దాన్ని తెచ్చాడు. ఇతరులకు ఒక ధర్మశాస్త్రాన్నే కాక  ప్రతి మనిషి ఉనికినీ ప్రభావితం చేసే జీవాన్ని తెచ్చాడు. ఇతరులకు ఆ జీవాన్ని అందించేందుకు ఇప్పుడు గతంలోని ప్రవక్తలెవరూ తొక్కని మార్గాన ఆయన వెళ్ళవలసి ఉంది.

          రూపాంతరం వరకూ యేసు పాత నిబంధన ప్రవక్తల పరంపరలో ఒకడు. ఇప్పుడు వారిని వదిలిపెట్టి తనదే అయిన ఒక ప్రత్యేక మార్గంలో, *దేవుని చిత్తానికి తనను తాను సమర్ధించుకుంటూ బయలుదేరాడు. అదే సిలువ బలి మార్గం.*

   *సం”రం చివరికి వచ్చి కొత్త సం”రం ఆరంభంలో మనం ఉన్నాం. యేసు నడచిన కొత్త దారులలోకి రమ్మని దేవుడు మనలను పిలుస్తున్నాడు. దేవుడు ముందు నడుస్తున్నాడు. ఏమి ఎదురైనా అంతిమ విజయం మనదే. అందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

కామెంట్‌లు