📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 🌐 *జగదుత్పత్తికి ముందే నిత్యదేవుడు త్రిత్వమై యున్నారు (God is Love)* 👉 మన చుట్టూ కమ్ముకొనియున్న ప్రకృతి వలయం, సమస్త ప్రాణ కోటి, ఆకాశమండలపు జ్యోతులైన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు దేనిని బయలుపరచుచున్నవి ? ఇవన్నియు తమంతట తామే కలుగాలేదనియు, వీటిని సృష్టించిన సృష్టికర్త ఒకరు ఉన్నారు అనియు మనకు తెలియ జేయుచున్నవి గదా? ఆయనే సమస్తానికి పైగా సర్వశక్తి గల దేవుడు. '' దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది ; ... ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదులుకొని సృస్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట బడుచున్నది '' (రోమా 1: 19,20 ) అని పరిశుద్ద పౌలు ఈ విషయమును గూర్చియే చెప్పిరి. దేవుని గూర్చి మనకు బయలు పరచు విషయములో సృష్టి మాత్రమే కాదు, పరిశుద్ద వేద గ్రంధం కూడా దేవుని గూర్చిన మర్మములను మానవవర్గానికి వివరముగా తేట పరచుచున్నది. దేవుడు నిత్యుడనియు, అంతేగాక ఆయన ఒక్కడే అనియు, ఆయనలో మూడు వ్యక్తిత్వములున్నవనియు అది వెల్లడి చేయుచున్నది. దీనిని మనము తెలిసికొని నమ్ముచున్నాము. ఇదే పాత నిభందనలోను, క...