ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రోమీయులకు హ్రసిన పత్రిక

♻ *రోమీయులకు హ్రసిన పత్రిక* ♻

*పరిచయం*

*రచయిత:*

*ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన అపోస్తలుడైన పౌలు.*
రోమా 1:1—7 ప్రకారం

*ఎక్కడ రాశారు? ఎప్పుడు రాశారు*?
పౌలుగారు నాలుగు మిషనరీ యాత్రలు చేశారు. *మూడో మిషనరీ యాత్ర చివర్లో కొరింథీ పట్టణంలో (గ్రీకుల కోలనీ) మూడు నెలలు ఉన్నారు.* (అపో 20:2—౩) 

బహుశా క్రీ.శ. 55-57 ల మధ్య రాసినది.

♻ *ఎందుకు రాశారు*?

అదే సమయంలో అపో 20:2--3; రోమా 15:25--28 ప్రకారం కొన్ని సంఘాల వారు యేరూషలేము లో ఉన్న పరిశుద్ధులకు కానుక/ చందా వసూలు చేసి, పౌలుగారికి ఇస్తారు. దానిని యేరూషలేములో అప్పగించి, స్పెయిను దేశానికి నాలుగవ మిషనరీ ప్రయాణంగా వెళ్దామని పౌలుగారి ఆకాంక్ష. ఆ యాత్ర మార్గమధ్యంలో రోమా పట్టణం మీదుగా వెళ్తుంది కావున రోమా పట్టణం లో సువార్త ప్రకటించాలి అనుకున్నారు పౌలుగారు. *ఆ యాత్రకు ముందుగా తననుతాను పరిచయం చేసుకుంటూ వ్రాసిన పత్రిక ఇది.*

*రోమా సంఘాన్ని ఎవరు స్తాపించారు?*

తెలియదు! పౌలుగారు అక్కడికి వెళ్ళనే లేదు. అందుకే తననుతాను పరిచయం చేసుకుంటున్నారు. అయితే అనేకమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం: అపోస్తలులు కార్యములు 2 ప్రకారం  పెంతుకోస్తు దినాన  ఆది అపోస్తలులు పరిశుద్ధాత్మ భాప్తిస్మము  పొందిన అనంతరం అన్యభాషలు మాట్లాడుతూ దేవుని ఆరాదిస్తుంటే అనేకమంది అనగా సుమారు 28 భాషలు మాట్లాడిన వారు వచ్చి, పేతురుగారి ప్రసంగం వింటారు. అప్పుడు ౩౦౦౦ మంది రక్షణ పొందుతారు. అలా రక్షణ పొందిన యూదులు రోమా పట్టణం వెళ్లి సువార్త ప్రకటించి, సంఘాన్ని స్తాపించారు అని అనేకుల నమ్మకం.  అయితే కొంతమంది యేసుప్రభులవారి మరణం తర్వాత కలిగిన శ్రమలకు చాలామంది రక్షించబడిన యూదులు చెదరిపోయారు అనేక దేశాలకు. వారిలో కొంతమంది రోమా పట్టణం వచ్చి సంఘాన్ని స్తాపించి ఉంటారు అంటారు.
ఏదిఏమైనా పౌలుగారిని వాడుకుని పరిశుద్ధాత్ముడు కొలస్సీపత్రికద్వారా యేసుక్రీస్తు దైవత్వాన్ని అన్యజనులకు అర్ధం అయ్యేలా ఎలా వ్రాయించుకున్నారో అలాగే అదే పౌలుగారిని ఉపయోగించుకుని పరిశుద్ధాత్ముడు సంఘానికి కావలసిన వేదాంతం అంతా ఈ రోమా పత్రిక ద్వారా వ్రాయించారు.  నిజంగా దీనిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం!


*ముఖ్యాంశం:*

దీని ముఖ్యాంశం క్రీస్తు శుభవార్త.

ఈ ముఖ్యాంశాన్ని 1:16-17లో ఇస్తూ మిగతా లేఖ అంతటిలో *క్రీస్తు శుభవార్తను* గురించి రాశాడు.

*శుభవార్త అంటే ఏమిటి?*
 శుభవార్తను నమ్మినవారికి ఏమి జరుగుతుంది మొదలయిన వాటిని గురించి వ్రాశాడు.


*ఇందులోని కొన్ని ముఖ్యమైన మాటలు:*

*“పాపం”,*
*“విముక్తి”*,
*“రక్షణ”,*
 *“నిర్దోషుల లెక్క”,*
 *“న్యాయవంతులు”,*
 *“నిర్దోషత్వం”,*
*“దేవుని న్యాయం”,*
*“కృప”,*
 *“నమ్మకం”.*

*విషయసూచిక*

పౌలు ఇచ్చిన పరిచయం

ముఖ్యాంశం 1:16-17

మనిషికి శుభవార్త అవసరత 1:18—3:20

పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపం 1:18-20

మానవ జాతి పాపంలో ఉంది 1:21-32

దేవుని రాబోయే తీర్పు 2:1-16

యూదులు కూడా పాపంలో ఉన్నారు 2:17-29

ప్రతి మనిషి పాపి 3:1-19

మనిషికి అవసరమైన శుభవార్త 3:21—5:21

విశ్వాసం ద్వారానే న్యాయవంతులు కావడం 3:21-31

అబ్రాహాము ఉదాహరణ 4:1-25

శుభవార్త వల్లే కలిగే దీవెనలు 5:1-11

ఆదామువల్ల పాపం, చావు వచ్చాయి,
క్రీస్తువల్ల నిర్దోషత్వం, జీవం వచ్చాయి 5:12-19

క్రీస్తు ద్వారా కృప కలుగుతుంది 5:20-21

పవిత్ర జీవితానికి మార్గం 6:1—8:39

క్రీస్తులో ఐక్యత 6:1-10

మనకు మనం దేవునికి అర్పించుకోవడం 6:11-14

ప్రతి వ్యక్తీ దేవునికి గాని, పాపానికి గాని దాసుడు 6:15-23

పెళ్ళి ఉదాహరణ 7:1-6

పౌలు తన భ్రష్ట స్వభావాన్ని తెలుసుకోవడం 7:7-13

విశ్వాసిలో భ్రష్ట స్వభావం శక్తి 7:14-25

దేవుని ఆత్మద్వారా జీవం, శక్తి 8:1-16

విశ్వాసికి ముందు కలుగబోయే ధన్యత 8:17-25

విశ్వాసికున్న ప్రస్తుత ధన్యత 8:26-39

దేవుడు, ఇస్రాయేల్ జనం 9:1—11:32

ఇస్రాయేల్‌వారి లాభాలు, విశేషావకాశాలు 9:1-5

దేవుని సర్వాధిపత్యం 9:6-29

ఇస్రాయేల్‌వారి అపనమ్మకం 9:30-33

ఇస్రాయేల్‌వారి తప్పుడు మార్గం 10:1-21

దేవుడు ఇస్రాయేల్‌వారిని ఎప్పటికీ వదిలివేశాడా? 11:1-16

ఆలీవ్ చెట్టు 11:17-24

ఇస్రాయేల్ జనం విముక్తి అవుతుంది 11:25-32

దేవుని అగోచరమైన జ్ఞానం 11:33-36

శుభవార్త వెలుగులో విశ్వాసులు ఎలా జీవించాలి 12:1—15:13

మంచి అర్పణలు ఇవ్వడం 12:1-2

సామర్థ్యాలను ఉపయోగించడం 12:3-8

ప్రేమ, సంతోషం, ఐక్యత, విధేయత, శాంతితో కూడిన జీవితం 12:9-21

అధికారంలో ఉన్నవారికి లోబడడం 13:1-7

ప్రేమ నియమం 13:8-14

యేసు క్రీస్తును ధరించుకొని ఆయన కోసం చూడడం 13:8-14

బలమైన, బలహీనమైన విశ్వాసం 14:1—15:6

క్రీస్తు ఇచ్చిన ఆదర్శం 15:7-12

చివరి ప్రార్థన 15:13

పౌలు చేసిన పని, రోమ్ దర్శించాలనే అతని కోరిక 15:14-33

వ్యక్తిగత అభివందనాలు 16:1-16

తప్పుడు ఉపదేశకులను గురించి హెచ్చరికలు 16:17-19

చివరి మాటలు 16:20-27.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...