ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అపోస్తలుల మరణం. (హతసాక్షులు

💐💐💐. 💐💐💐
📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚



🌀 *❗అపోస్తలుల మరణం. (హతసాక్షులు)*🌀


👉 *1. మత్తయి*

🌱క్రీస్తు కొరకు జీవించగా కత్తి వాత చేత చంప బడ్డాడు.


👉 *2. మార్కు.*

🌱అలెక్జంద్రియ, ఐగుప్తునందు వీధులలో చనిపోయేవరకు గుర్రముల చేత (తొక్క బడుచు) ఈడ్చుకుంటువెళ్ళి చంపారు.


👉 *3. లూక.*

🌱నశించిన వారికి సువార్తను బలముగా ప్రకటించగా, ఉరితీయబడి చంపబడెను.


👉 *4. యోహను.*

🌱రోమా పట్టణమందు మరుగుచున్న నూనె కడాయిలో వేయబడి, అద్భుతంగా మరణం నుండి తప్పించబడగా, పట్టువిడువక, మళ్ళి పత్మాసు ద్వీపమందు (మరణానికి అప్పగించగా) ఖైదీగా పంపగా, ఆ పత్మాసు ద్వీపములో ఆత్మావేశుడై దర్శనంలను చూచి ప్రకటన గ్రంథం (ప్రవచనాత్మక గ్రంథం) వ్రాసెను. తర్వాత విడుదలనొంది, టర్కిలో ముసలితనమందు ప్రశాంతమైన మరణం నొందెను.


👉 *5. పేతురు.*

🌱ఇతను తలక్రిందులుగా సిలువలో (Xఆకారమందు సంఘ ఆచారానుసారముగా) తన్ను వేధించు వారితో క్రీస్తు లా సిలువకు నేను యోగ్యున్ని కాను, గనుక నా తల క్రీస్తు పాదాల తట్టు ఉంచి సివువ వేయమని కోరాడు, అలా తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోయాడు.


👉 *6. యాకోబు.*

🌱యరుషలేమునందు గల సంఘానికి బలమైన సేవకుడు.
క్రీస్తునందు స్థిరమైన విశ్వాసం గలవాడైనందున, దేవాలయం యోక్క తూర్పుదక్షిణంతట్టు 100 అడుగుల ఎత్తునుండి క్రిందికి పడవేసినా దేవుని కృపచేత మరణం నుండి తప్పించబడి, శత్రువులు అతననిని సాకలివారి దుడ్డుకర్రతో మరణం వరకు చంపారు. (ఇది యేసయ్యను సాతాను శోధించిన దేవాలయం.)


👉 *7. యాకోబు. (జెబదయి కుమారుడు)*

🌱వృత్తి - చేపలు పట్టే జాలరీ, యేసు అతనిని సంపూర్ణ బలమైన పరిచర్య నిమిత్తం సంఘంలో సేవకొరకు పిలుచుకున్నాడు. అతని స్థిరవిశ్వాసం చూచి ఆశ్చర్యపడి రోమా ప్రభుత్వం వారు అతని కనిపెట్టుచు నేరములు మోపి క్రీస్తునందు గల పట్టు వదలని విశ్వాసంను బట్టి తుదకు శిరచ్చేదనం చేయబడ్డాడు. హతసాక్షయ్యడు.


👉 *8. బర్తిలోమయి. (నతానియేలుగా కూడ పిలువబడినాడు.)*

🌱ఇతను ఆసియాలోని ప్రస్తుత టర్కీ దేశంలో క్రీస్తుకొరకు బలమైన సాక్షిగా సువార్తను ప్రకటించగా, అర్మేనియాలో బహు క్రూరంగా కొరడాలతో కొట్టి చంపబడ్డాడు.


👉 *9. ఆంద్రేయ.*

🌱యేసు క్రీస్తును ప్రజలలో బోధిస్తు, గ్రీసు దేశంనందు, పత్రస్ లో x-ఆరారమందు సిలువ వేయ బడెను, ఏడుగురు సైనికుల చేత ఎన్నోపర్యాయములు సిలువకు కట్టి బలమైన వేధనతోకూడిన అరుపులు వినిపించునట్లు కొరడాలతో చంపబడ్డాడు. అనుచరులన్నారు అతను సిలువ వేయబడుచుండగా, ఈ ఘడియ కొరకు (క్రీస్తులా వ్రేలాడదీయ బడుటకు) నన్ను నేను సమర్పించు కొని ఆశతో ఉన్నాను, అలా చెప్పి సిలువలో మరణించే వరకు రెండు రోజులు తన్ను శ్రమ పెట్టు వారికి సువార్తను బోధించెను.


👉 *10. తోమా*

🌱దక్షిణ భారత దేశంలో దేవుని సువార్తను ప్రకటిస్తు బలమైన సంఘం కట్టుచుండగా చిన్ని ద్వీపమందు బల్లెముతో పొడవబడి చంపబడ్డాడు.


👉 *11. యూదా.*

🌱క్రీస్తు నందుగల తన స్థిర విశ్వాసమును బట్టి, బాణములను గురి పెట్టి చంపారు.


👉 *12. మత్తియా.(యూదా ఇస్కారి యోతు స్థానములో ఏర్పరచ బడినవాడు).*

🌱రాళ్ళతో కొట్టి, శిరచ్చేధనం చేయబడ్డాడు.


👉 *13. పౌలు.*

🌱ఎన్నో పర్యాయంలు శ్రమలపాలై, హింసించబడెను, ఎక్కువ సమయం ఖైదిగా ఉంచబడగా బైబిలు గ్రంథం క్రొత్త నిబంధనలో అధికంగా నున్న పత్రికలు సంఘాలకు, తన పిల్లలకు వ్రాయుటకు ఆ జైలు స్థావరమాయెను. (ఈ దినాలలో మనకందరికి ఆ పత్రికలు ఆశీర్వాదంగా నున్నవి) తర్వాత రోమా పట్టనమందు క్రీ.శ. 67లో కృూరుడైన నీరో చక్రవర్తి చేత శిరచ్చేదనం చేయబడి చంపబడ్డాడు.

❗ఆ దేవుని ప్రేమ, ఆయన కనికరం, కృప మన పట్ల ఎంతో ఉంది.

🌱వారు పడిన శ్రమలు, బాధలు, హింసలు, కష్టముల యెదుట మనకున్న బాధలు ఎంత కావు అని మనకు జ్ఞపకం చేయు చున్నవి.

🌱ఎన్ని శ్రమలు, బాధలు, శోధనలు వచ్చిన ధైర్యముగా నుండి, ప్రభువులో స్థిరముగా నుండుడి. ఇతరులను బలపరచుడి.
🌹దేవుడు మిమ్మును దీవించు గాక!





💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨

👉 *సేకరణ*
*బ్రదర్ సముయేలు*


📖 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి*📖



💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...