♻ *నీతిమంతులకు శ్రమలు కలుగవా...?*
*"అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగజేయును. ప్రహర్షముతో నీ పెదవులను నింపును."*
( Job - యోబు 8:22 )
నా ప్రియ స్నేహితులారా...
యోబు గ్రంధములో ఎక్కువ భాగము నలుగురు వెక్తులు కలసి మాట్లాడుకోవటం చుట్టూనే ఉంటుంది.
వారు మాట్లాడుకున్న మాటలే గ్రంధస్తం చేయబడినవి.
ఈ 8వ అధ్యాయములోని మాటలు బిల్దదు అనే అతను మాట్లాడుతున్నాడు.
గమనించండి... యోబుకు ముగ్గురు స్నేహితులు...
తేమానీయుడైన ఎలీఫజు,
షూహీయుడైన బిల్దదు,
నయమాతీయుడైన జోఫరు అనువారు....
వీరు యోబుకి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విని, అతనిని కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును వెళ్దాము ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చినవారు.
వారు వచ్చిన అసలు కారణం యోబుని అధరించాలని... కానీ వారు వచ్చిన తరువాత యోబుని ఆధారించకపోగా... కాకుల్లగా పొడిచిపొడిచి యోబును మనోవేదనకు గురిచేశారు అని చెప్పాలి.
మనం కూడా చాలా మందిని చూస్తూ ఉంటాము... మనం కష్టాలలో ఉన్నప్పుడు కొందరు వస్తారు, వారు మనతో మాట్లాడుతున్నప్పుడు వారి మాటలలో ఆధరణ కనిపించదు కానీ... ఎంతో వెటకారం కనిపిస్తుంది. అలాంటివారు మరలా పలక బలపం పట్టుకుని "వెక్తుల స్థాయి అంటే ఏమిటి..?" ఆ స్థాయికి తగినట్లుగా ఎలా మాట్లాడాలి..?" అధారణం అంటే ఏమిటి..?" ఆదరించే మాటలు ఎలా ఉంటాయి..?" సమాధానం అంటే ఏమిటి..? సమాధానపరిచే మాటలు ఎలా ఉంటాయి..?" అనే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.
యోబుని ఆధారించటానికి వచ్చిన స్నేహితులు... అదే యోబును మానసికంగా హింసించారు.
ఇక్కడ షూహీయుడైన బిల్దదు అంటున్నారు... "నీవు నీతిమంతుడవు అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తారు... నీకు నోటి నిండ నవ్వును ఇస్తారు, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. అని...
మాములుగా చూసినప్పుడు ఈ మాటలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి.
కానీ షూహీయుడైన బిల్దదు ఈ మాటలు పలికిన కోణంలో నుండి చూసినప్పుడు ఈ మాటలు పరిపక్వత లేని మాటలుగా కనిపిస్తాయి.
అస్సలు షూహీయుడైన బిల్దదు మాటల అర్ధం ఏమిటి...
మొదటిగా షూహీయుడైన బిల్దదు యోబుని అపార్ధం చేసుకున్నారు.
యోబు తన కష్టములను బట్టి దేవునిని నిందిస్తున్నారు అని షూహీయుడైన బిల్దదు అనుకున్నారు.
అందుకు షూహీయుడైన బిల్దదు యోబుతో ఇలా అంటున్నారు...
దేవుడు న్యాయవంతుడు. అయన అందరికి న్యాయం చేస్తారు. తప్పు చేసిన వారికి అయన శిక్షను, మంచివారికి అయన మేలులను చేస్తూఉంటారు.
ప్రాముక్యముగా దేవుడు మంచివారిని కష్టపడనివ్వారు...
చెడ్డవారిని సుఖపడనివ్వరు... అని...
గమనించండి... షూహీయుడైన బిల్దదు ఇక్కడ చెప్పిన మాటల అర్ధం ఇదే...
ప్రాముక్యముగా దేవుడు మంచివారిని కష్టపడనివ్వారు...చెడ్డవారిని సుఖపడనివ్వరు.
కనుక "ఓ యోబు నువ్వు ఎదో తప్పు చేసావు కనుకే నీకు ఈ శ్రమలు వచ్చాయి" ... అనేది బిల్దదు వాదన.
అంతని వాదనలో ఒక మాట మాత్రమే నిజం "దేవుడు న్యాయవంతుడు. అయన అందరికి న్యాయం చేస్తారు." ఈ మాట మాత్రమే నిజం.
"దేవుడు మంచివారిని కష్టపడనివ్వారు...చెడ్డవారిని సుఖపడనివ్వరు." అనే మాట అన్ని సందర్భములలో నిజం కాదు.
ఎక్కడో దాక ఎందుకు... యోబు ఎం తప్పు చేసాడని అతనికి అన్ని శ్రమలు.
"దేవుడు మంచివారిని కష్టపడనివ్వారు" అనేది ఒకటి ఉంటే యోబుకి కష్టములు రాకూడదు కదా... ఎందుకంటే యోబు మంచివారు. ఇది దేవుడు స్వయంగా ఇచ్చిన సాక్ష్యం.
కనుక "దేవుడు మంచివారిని కష్టపడనివ్వారు...చెడ్డవారిని సుఖపడనివ్వరు." అనే మాట అన్ని సందర్భములలో నిజం కాదు... షూహీయుడైన బిల్దదు ఇక్కడ చెప్పిన మాటలలో ఎక్కడో పరిపత్వత లోపించింది అని అర్ధం అవుతుంది.
"దేవుడు మంచివారిని కష్టపడనివ్వారు...చెడ్డవారిని సుఖపడనివ్వరు." అనే మాట అన్ని సందర్భములలో నిజం అయితే... "ధనవంతుడు - పేద లాజరు" ఉపమానం మనకి ఏమి పాఠం నేర్పుతుంది.
* ధనవంతుడు తను బ్రతికినంత కాలము సుఖించాడు తిన్నాడు తాగాడు... సుఖభోగములు అనుభవించాడు... కానీ ఆ తరువాత నరకానికి వెళ్ళాడు.
* పేద లాజరు తను బ్రతికినంత కాలము కష్టంమునే అనుభావించాడు, ఆకలి, దాహం... నరకయాతన... కానీ ఆ తరువాత పరిశుద్ధుల సభకు వెళ్ళాడు.
"దేవుడు మంచివారిని కష్టపడనివ్వారు...చెడ్డవారిని సుఖపడనివ్వరు." అనేది చూస్తే...
ఇక్కడ ధనవంతుడు సుఖపడకూడదు. లాజరు కష్టపడకూడదు.... అవును కదా.
నా ప్రియ స్నేహితులారా...
నేడు మన ముందు జరుగుతున్న వాస్తవాలనే చూద్దాము... ఎంతో మంది చెడ్డవారు ఎన్నో సుఖములు అనుభవిస్తున్నారు. ఎంతో మంది మంచి వారు కష్టములను అనుభవిస్తున్నారు.
ఇది రోజు మనకి కనిపించేదే...
నిజానికి, నీతిమంతులకు శ్రమలు కలుగవా...? అంటే... కలుగుతాయి. అవకాశము ఉంది.
ఒక రోజు యేసు అయన శిష్యులు ఒక దారిలో వెళ్తున్నారు ఆ పక్కనే ఒక గుడ్డివాడిని శిష్యులు చూశారు వారికీ ఒక సందేహం కలిగింది. అప్పుడు ఆయన శిష్యులు :- "బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను ? వీడా, వీని కన్నవారా ?" అని...
అప్పుడు యేసు:- "వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను." అని చెప్పారు...
గమనించండి... కొన్నిసార్లు కొందరికి కష్టాలు వారి చెడుతనము వల్ల రావు... వారి ద్వారా దేవుని క్రియలు బయలుపడుటకు అలా జరుగుతుంది.
యోబు కష్టపడుతుంటే... అతని స్నేహితులు అనుకున్నారు యోబు ఎదో పాపం చేసాడు అందుకే ఈ కష్టాలు అని. కానీ అది నిజం కాదు.
దారిలో గుడ్డివాడిని చూసి... యేసు శిష్యులు అనుకున్నారు దీని వెనుక ఎదో పాపం ఉంది అని... కానీ అది నిజం కాదు.
పేద లాజరుని చూసి అతని శ్రమలకి వెనుక ఎదో కధ ఉంది అనుకుంటాము... కానీ అది నిజం కాదు.
గమనించండి... అన్ని శ్రమల వెనుక పాపం ఉండదు. కొన్ని శ్రమల వెనుక దేవుడు పొందబోవు మహిమ ఉంటుంది, మనం పొందబోవు విడుదల ఉంటుంది, అపవాధి పొందబోవు ఓటమి ఉంటుంది.
నా ప్రియ స్నేహితులారా... మీరు ఏ కారణం లేకుండా... శ్రమను అనుభవిస్తుంటే. ఈ మాటను గుర్తుచేసుకోండి. మూలిగే నక్కమీద తాటిపండు వేసే సంకుచితమైన మనసు నాకు అయితే లేదు. నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచలేదు. నాకు దైవిక ఉపదేశక్రమము నేర్పిన ఎందరో దైవజనులు నాకు అది నేర్పలేదు కనుక. మీకు ఆధరణ కలిగే మాట నేను పలుకగలను.
దేవుడు ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం వైపుగా నడిపింది... వారిని సముద్రంలో ముంచాలి అని కాదు, వారిను ఆ మార్గంలో శత్రువు చేతికి అప్పగించాలి అని కూడా కాదు...
కానీ ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాని చూసినప్పుడు "దేవుడు మనలను ఇక్కడ చంపాలి అనుకున్నారు" అని కేకలు వేశారు... అదే ఎర్ర సముద్రాని దాటిన తరువాత వారికీ అర్ధం అయింది.
దేవుడు వారిని అక్కడ చంపాలి అనుకోలేదు. వారిని అక్కడే విమోచించాలి అనుకున్నారు అని.
గమనించండి... దేవుడు వారిని ఆ మార్గమున నడిపింది "వారి శత్రువులను ఆ సముద్రంలో ముంచాలని. ఇశ్రాయేలీయులకు జయమును అనుగ్రహించాలని."
శ్రమలను చూసినప్పుడు మనకి ఏమి అర్ధం కాదు. ఆ శ్రమలను దాటిన తరువాతే అర్ధం అవుతుంది.
ఆ శ్రమ ఎట్టి మేలు కొరకు వచ్చిందో... అని.
నెమ్మదికలిగి ఉందాము... దేవుని వైపుగా మన కన్నులు ఎత్తి ఉంచుదాము.
ఎందుకంటే... రక్షణ, విమోచన వచ్చేది అటువైపు నుంచే.
అలాగున మనం ఉందుము గాక.
దేవుని అద్భుతకార్యములు చూచుదుము గాక. ఆమెన్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి