📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
🌐 *జగదుత్పత్తికి ముందే నిత్యదేవుడు త్రిత్వమై యున్నారు (God is Love)*
👉 మన చుట్టూ కమ్ముకొనియున్న ప్రకృతి వలయం, సమస్త ప్రాణ కోటి, ఆకాశమండలపు జ్యోతులైన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు దేనిని బయలుపరచుచున్నవి ? ఇవన్నియు తమంతట తామే కలుగాలేదనియు, వీటిని సృష్టించిన సృష్టికర్త ఒకరు ఉన్నారు అనియు మనకు తెలియ జేయుచున్నవి గదా? ఆయనే సమస్తానికి పైగా సర్వశక్తి గల దేవుడు. '' దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది ; ... ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదులుకొని సృస్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట బడుచున్నది '' (రోమా 1: 19,20 ) అని పరిశుద్ద పౌలు ఈ విషయమును గూర్చియే చెప్పిరి. దేవుని గూర్చి మనకు బయలు పరచు విషయములో సృష్టి మాత్రమే కాదు, పరిశుద్ద వేద గ్రంధం కూడా దేవుని గూర్చిన మర్మములను మానవవర్గానికి వివరముగా తేట పరచుచున్నది. దేవుడు నిత్యుడనియు, అంతేగాక ఆయన ఒక్కడే అనియు, ఆయనలో మూడు వ్యక్తిత్వములున్నవనియు అది వెల్లడి చేయుచున్నది. దీనిని మనము తెలిసికొని నమ్ముచున్నాము. ఇదే పాత నిభందనలోను, క్రొత్త నిబంధనలోను జీవించిన మన పూర్వ పితరుల నమ్మకమైయున్నది. ఎన్నో శతాబ్దములుగా మనము నమ్ముచున్న ఈ సత్యమును విశ్వసించని ' యోహొవా సాక్షులు' ''ఏడవ దినమును ఆచరించేవారు '' ''యేసు నామం వారు '' మొదలగు కొందరు ఈ కాలంలో దీనికి విరుద్ధముగా లేచి, దేవుడు త్రిత్వము కాదు అని చాటించి, జనులను మోసగించుటను మనము చూచుచున్నాము. దేవుడు త్రిత్వము అనే విషయము అన్న్యజనులనుండి వెల్లడియైన ఒక భోదన అనియు, ఆది కాల అపోస్తుల సంఘము పడిపోయిన పిదప రోమన్ క్యాధలిక్ వారు ఈ త్రిత్వ ఉపదేశమును చేర్చిరి అని ప్రబోధించి , వారు త్రిత్వమును నిరాకరించుచున్నారు.
👉 త్రిత్వములో రెండవ వ్యక్తిత్వ మైన దేవకుమరుడైన క్రీస్తు, యేసు అనే నామముతో మానవుడుగా అవతరించినప్పుడు, జగదుత్త్పత్తి ముందు తానును, తండ్రియు ఉన్నట్లుగా చెప్పుచున్నారు. '' తండ్రీ, . . . జగత్తు పునాది వేయ బడక మునుపే నీవు నన్ను ప్రేమిం చితివి '' ( యోహాను 17 : 24 ) అని ఆయన పలికిన మాటల యొక్క అర్ధ మేమి ? జగత్తు పునాది వేయబడక మునుపే ఒక తండ్రి ఉన్నారనియు, ఆ తండ్రి తనను ప్రేమించిరనియు ఆయన చెప్పుచున్నారు గదా? అదేమనగా, ఒక ప్రేమగల తండ్రియు ఉన్నారనునదే. వీరిలో ఎవరు ప్రధముడు? తండ్రి ప్రధముడు అని కొందరు చెప్పవచ్చు ను . తండ్రి ప్రధముడైతే, కుమారుడు లేని కాలములో ఆయన ఎలాగు తండ్రియై యుందురు? ఆలాగు ఉండజాలదు. అయితే ఆయన నిత్య దేవుడు ( 1 తిమోతి 6 : 15: రోమా 16 : 25-27 ) నిత్యుడైన ఒక తండ్రి ఉండి ఉన్నారంటే, ఆయనను బయలుపరచుటకు నిత్యుడైన ఒక కుమారుడుకూడా ఉండవలెను. అలాగే, తండ్రి ఎప్పుడు ఉండి రో , అప్పుడే కుమారుడును యుండి యుండ వలెను . తండ్రి కుమారుని బయలు పరచచున్నారు; కుమారుడు, తండ్రిని బయలు పరచుచున్నారు. అందుచేత ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఒకరికంటే ఒకరు ప్రధముడు కారు; అధముడు కారు. ఇరువురు ఒకే కాలములో ఉన్నవారు. అది ఎలాగు సాద్యం ? దేవుడు ఏక దేవుడు, ఆయన ప్రేమా స్వరూపి ( 1 యోహాను 4 ; 8 ) శక్తి సంపన్నుడు, కరుణామయుడు, కృపామయుడు అని అనేక రకములుగా ఆయనను గూర్చి వేద గ్రంధము స్ప్రష్టముగా చెప్పుచున్నది. ఈ విధముగా సమస్త సద్ద్ఘునముతో నిండిన దేవుడు క్రియ చేయక పోయి నట్లయితే , మనము ఎలాగు ఆయనను అర్ధము చేసికొనగలము? ఏలాగు ఆయన వెల్లడి కాగలరు? అగ్ని అనునది రాళ్ళల్లోను, చేట్ల్లల్లోను ఉన్నది. కాని దానిని చూడలేము. అది వెల్లడి కావలెననగా ఏమి చేయబడును? రెండు మొద్దులను ఒకదానితో ఒకటి రాసుకొనిన ప్పుడు అగ్ని వచ్చును. అగ్ని వచ్చుటకు రెండు మొద్దులు ఒకదానితో ఒకటి రాపిడి ఏలాగు జరుగుతుందో , దేవుని యొక్క ప్రేమ వెల్లడియగుటకు ఒక దేవుడు ఈలాగు తండ్రి , కుమారుడుగా ఒకరి కంటే ఒకరు ఎక్కువైనా వ్యక్తిత్వములుగా కనబడుట అవసరమై యున్నది. అందుచేత, దేవుడు ఒకే ఒక వ్యక్తిత్వముగా ఉండజాలరు.
👉 అంతమాత్రమే కాదు, మూడవ వ్యక్తిత్వముగా ఇంకొకరుకూడా ఉండినట్లుగా వేద గ్రంధము ఆవేదించుచున్నది . '' మెల్కిసేదెకు '' అనే ఒకరిని గురించి హేబ్రియులకు వ్రాసిన పత్రిక లేఖికుడు చెప్పుచున్నాడు . ఆయన దేవుని యాజకుడు . దేవుని కుమారుని పోలినవారు , తండ్రిలేనివాడును , తల్లిలేనివాడును , వంశావళి లేనివాడును ; జీవితకాలమునకు ఆదియైనను జీవమునకు అంతమైనను లేనివాడైయున్నాడు . ( హెబ్రీ 7 : 1-3 ) ఈయన ఎవరు ?
👉 ఈయన దేవుని యాజకుడు అని వ్రాయబడియుండుటచేత , ఈయన తండ్రి యైన దేవుడు కారు ; తండ్రి యైన దేవుని యొక్క క్రియలో ఆయనకు యాజకునిగా ఉన్నవారే ఈయన . ఈయన దేవకుమారుని పోలినవారు ; అలాగైతే , ఈయన దేవకుమారుడైన క్రీస్తు కారు; దేవకుమారుని పోలిన ఇంకొక వ్యక్తియే. ఈయన జీవిత కాలమునకు ఆదియైనను జీవమునకు అంతమైనను లేనివారు. అలాగైతే , ఒక దేవదూతకూడా కారు . ఎందుకనగా , దూతలు కలుగాజేయబడినవారు. వారికి జీవితకాలమునకు ఆది ఉన్నది . ఈయన జీవమునకు అంతమైనను లేనివాడును తల్లిలేనివాడును వంశావలిలేనివాడును అని వ్రాయబడియుండుటచేతను , భూమి మీద ఏ కాలములోను ఉన్న మనుష్య్డుడుకాడు. ఈయన
తండ్రి వలెను కుమారుని వలెను నిత్యుడే . అయితే మెల్కిసెదకు అను ఆయన దేవుని యాజకుడుగా అబ్రహామును ఎదుర్కొన వెళ్ళి , అతనిని ఆశీర్వదించి , అతని దగ్గరనుండి దశమభాగామును స్వీకరించెను . అందువలనను షాలేము రాజనియు . ఏసుక్రీస్తుకు సాద్రుస్యముగా జీవించిన ఒక మనుష్యుడనియు కొందరు అందురు . దినములకు ఆది యైనను జీవమునకు అంతమైనను లేని ఒకరు ఏవిధముగా ఒక మనుష్యుడైయుండగలరు ?
👉 '' సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజు '' హేబ్రియులకు వ్రాసిన పత్రికదారుడు వ్రాయుచున్నాడు ( హెబ్రీ ౭ :౨ ) . ఆలాగు చెప్పినప్పుడు , షాలేము అనునది ఒక చోటు ఏలాగు అవును ? షాలేము రాజు అని చెప్పబడినవారు , నిత్యుడును సమాధానపు దేవుడునైన పరిశుద్దత్మాయే తప్ప , మరి ఎవరై యుండవచ్చును ? అలాగే నిత్యుడైన ఏకైక దేవుడు జగదుత్పత్తికి ముందే, తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ అనే మూడు వ్యక్తిత్త్త్వములుగా ఉండిరి . అందువలననే ఆదికాండము మొదటి అధ్యాయములో దేవుడు అని పిలవబడిన ఎలోహీం( ELOHIM) అనే బహు వచనపు నామకరణము ఇరవై ఏడు సార్లు వ్రాయబడెను. దేవుడు ఒకరికంటే ఎక్కువైన వ్యక్తిత్వములు గలవారు ( త్రిత్వదేవుడు ) అనే విషయము మనకు అర్ధమగుచున్నది. ఈ విధముగా నిత్యమైన మూడు వ్యక్తిత్వములు మాత్రమే ఉండుటచేత '' త్రిత్వము '' అని పిలుచుచున్నాము.
💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨
👉 *సేకరణ*
*బ్రదర్ సముయేలు*
📖 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి*📖
💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి