అడుగుతూవుండు
"అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును."
(మత్తయి 7 : 8)
నీవు దేని గురించి అయినా దేవుని దగ్గర ఎదురుచూస్తున్నావా? దానికి జవాబు రావటానికి నీవు అనుకున్న దానికన్న ఎక్కువ ఆలస్యము అవుతూందా? ఈ దినము నిన్ను నీవు ఉత్సాహపరచుకో ఎందుకంటే విశ్వాసము, సమాధానము ద్వారా నీవు దేవుని వాగ్ధానములను స్వతంత్రించు కొనవచ్చని దేవుని వాక్యము శెలవిస్తూంది. కనుక నీవు వదిలిపెట్టకుండా దేవుని విశ్వాస్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే వుండు. ఆయన వాక్యము సత్యమని నమ్ము. విశ్వాసమును, ఎదురుచూపును వైఖరిగా పెట్టుకో, ప్రార్ధన చేయు. అడుగుతూవుండు, వెతుకుతూవుండు, తట్టుతూవుండు అప్పుడు నీ కొరకు ద్వారాలు తెరుచుకుంటాయి. ఒక్కోసారి కొంత ఆలస్యమయినట్లే వుండవచ్చును. కాని దేవుడు నీ వెనుక కార్యములను జరిగిస్తున్నారని గుర్తుంచుకో. ఆయన నీ పక్షముగా కార్యములను జరిగిస్తున్నారు. ఆయన ఇచ్చేసమయము చాలా ఖచ్చితముగా వుంటుంది. నీవు విశ్వాసముతో ప్రార్ధనలోను, కృతజ్ఞతలోను ఎడతెగకవున్నప్పుడు ఆయన నీ కొరకు బహుబలముగా పనిచేస్తారు. నీవు ఊహించలేని స్థలములలో నిన్ను నిలుపుతారు.
ప్రార్ధన: తండ్రీ మీరు నాకు అనుగ్రహించిన ఆత్మను బట్టి వందనములు. మీ విశ్వాస్యతను బట్టి వందనములు. నా జీవితములో మీరు ఇచ్చిన వాగ్ధానము నెరవేర్పునకు కావలసిన బలమును నాకు దయచేయుమని ఏసునామములో ప్రార్ధించుచున్నాను తండ్రీ! ఆమెన్ .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి