ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ గొప్పతనం ఏమిటి

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚



📖 *బైబిలు గొప్పతనం ఏమిటి?* 🤔




౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

 *చాలా మంది  బైబిల్ వాస్తవాలను షేర్ చేస్తున్నారు వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను*

*నాదోక విన్నపం. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయ్యండి మా పరిచర్య కు ఏది అవసరమో దానిని.  దేవుడు సహాయం చేయ్యాలని ప్రార్థన చెయ్యండి*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


👉 అక్షర జ్ఞానం లేని పామరుడైనా సరే బైబిలులోని సారాంశం తెలిస్తే చాలు, నేటి విద్యావంతులకు ధీటుగా విషయ పరిజ్ఞానం పొందినట్టే. శాస్త్ర సాంకేతిక రంగం, ఖగోళం, అంతరిక్షం, వైద్యం, భూగర్భం, విమాన శాస్త్రం ఇలా ఎన్నో రంగాల గురించి కొద్దో, గొప్పో విషయాలు గ్రహించినట్లే. నేటి సామాజిక పరిస్థితులకు తగిన చట్టాలు, లోకోక్తులు, సూక్తులు, జనరల్ నాలెడ్జ్ వంటి విభిన్న అంశాలపైన తిరుగులేని పట్టు సాధించినట్లే. అంతగా అనంత విషయాలను అక్షర రూపంలో బైబిలు తనలో నిక్షిప్తం చేసుకుంది. నేడు శాస్త్రవేత్తలు కనిపెట్టె పలు విషయాలు బైబిలులో శాస్తీయంగానే ఉన్నాయి. బైబిలులో ఉన్న అద్బుతమైన విషయాల సమాహారాన్ని చూద్దాం!.

👉 *ఈ సృష్టి ఎప్పుడు? ఎలా ఆవిర్భవించింది?*

👉 *విశ్వం విస్తరించుచున్నదా?*

👉 *భూమి ఎలా ఏర్పడింది?*

👉 *జీవపరిణామ క్రమం ఎలా జరిగింది?*

👉 *జన్యువుల పని తీరు ఏంటి?*

👉 *అంతరించిపోయిన అరుదైన జీవజాతులు, వాటి భౌతిక నిర్మాణము?*

👉 *నాగరికత వెలసిల్లిన చరిత్ర*

👉 *భూగోళంపై జనాభా వ్యాప్తి ఎలా జరిగింది?*

👉 *భాషలు ఎలా ఏర్పడ్డాయి?*

👉 *మానవులతో మానవాతీతులకు సంబంధాలు ఉన్నాయా?*

👉 *నేటి చట్టాలు, శిక్షలకు మూలాధారంగా ఉన్న బైబిలు*

👉 *బైబిలు నుంచి వ్యాప్తి చెందిన విఖ్యాత లోకోక్తులు, సూక్తులు*

👉 *భారత దేశంతో బైబిలు చరిత్రకు ఉన్న సంబంధము?*

👉 *హిందూ ఆచారాలు, పూజలకు బైబిలులో కనిపించే మూలాలు?*

👉 *ఇలాంటి మరెన్నో విషయాలను ఇముడ్చుకున్న అద్భుత గ్రంథమే బైబిలు.📖*



📖 *బైబిలు క్రైస్తవుల కొరకే నిర్దేశింపబడినదా?*

👉 ''బైబిలు అనేది క్రైస్తవుల పవిత్ర గ్రంథం" ఇది చాలా మందిలో నెలకొన్న భావన. క్రీస్తు గురించి ముందు మెరుపులతో పాత నిబంధన గ్రంథం, క్రీస్తు ప్రత్యక్షతతో కొత్త నిబంధన గ్రంథం కనిపించడమే అందుకు ప్రధాన కారణం. వాస్తవానికి బైబిలు అనేది సర్వమానవాళి కోసం అందించబడిన పవిత్ర గ్రంథం.


📖 *బైబిలు ఉద్బోద దేని గురించి?*


👉 ఈ విశ్వం పుట్టుక మొదలుకొని మానవజాతి ఆవిర్భవము, మనుగడ వరకు జరిగిన చారిత్రక ఘటనలు బైబిలునందు నిక్షిప్తమైయున్నాయి. అయితే ఇది బాహ్యంగా కనిపించే చరిత్ర మాత్రమే. నిజానికి ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు చరిత్రలో మోపబడిన ప్రతీ ఒక్క అడుగు వెనుక దేవుని ఉద్దేశ్యము ఉన్నది. అందుకే ఆ గాథలను విశ్లేషిస్తే అందులో దేవుని ప్రణాళిక గురించి లోతైన భావనలు కనిపిస్తాయి. ఆత్మీయ జీవనానికి తోడ్పడే చక్కటి సందేశాన్ని కూడా వెల్లడిస్తాయి. ఆ సందేశాలు ఏమిటో చూద్దాం!.

👉 *పాపం యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది?*

👉 *పాపుల యందు దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది?*

👉 *ఆపత్కాలాల్లో నీతిమంతులు ఎలా రక్షింపబడతారు?*

👉 *నీతిమంతుల సంతానం ఎలా ఆశీర్వదింపబడుతుంది?*

👉 *నీతిమంతుల వలన వారి కుటుంబం ఎలా రక్షింపబడుతుంది?*

👉 *దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే ఏం జరుగుతుంది?*

👉 *దేవుని యందు విశ్వాసముతో ఎలా కాపాడబడుతున్నారు?*

*వంటి పలు సందేశాలను బైబిలులోని యధార్ధ గాథలు వెల్లడిస్తాయి.*




💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨

👉 *సేకరణ*
*బ్రదర్ సముయేలు*


📖 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి*📖



💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...