ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

14వ, 53వ కీర్తనల ధ్యానం

✳ *14వ, 53వ కీర్తనల ధ్యానం*  ✳

*ఈ రెండు కీర్తనలను దావీదు ఆయా సందర్భములలో వ్రాసాడు.*

👉ఒకే విషయాన్ని అతి కొద్ది మార్పులతో దేవుడు రెండు సార్లు వ్రాయించాడు అంటే?
*ఒకే విషయాన్ని నొక్కి చెప్తున్నాడు.*

1⃣ *దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.మేలుచేయు వాడొకడును లేడు.*   కీర్తనలు 14:1

*దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు.మేలు చేయు వాడొకడును లేడు.*        కీర్తనలు 53:1

👉దేవుడు లేడని చెప్పేవారిని మనం *"నాస్తికులు"* అంటాం.
బైబిల్ అంటుంది *"బుద్ధిహీనులు".*

👉 బుద్ధిహీనులు అంటే?
*ఇక్కడ జ్ఞానము లేనివారు అనికాదు."మూర్ఖులు"* అని.

👉 *బుద్ధి హీనులు ఎందుకు దేవుడు లేడని అనుకొంటారు?*

👉 *దేవుడు లేడని చెప్పడానికి వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా?*

🔹 *లేనే లేవు. సృష్టిలో ప్రతీ వస్తువు దేవుని ఉనికిని తెలియజేస్తుంది.*

👉ఒక చెక్క కుర్చీని చూసినప్పుడు దీని వెనుక వడ్రంగి అంటూ ఎవరూలేరు. చెట్టుకే కుర్చీలు, మంచాలు, తలుపులు, కిటికీలు కాసాయి. అనుకోవడం ఎంత మూర్ఖత్వమో? ఎంత బుద్ధిహీనతో?

 *ఈ సృష్టిని చూసినప్పుడు దీని వెనుక దేవుడు లేడు. అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. అంతే బుద్ధిహీనత.*

👉ఇంతకీ వీళ్ళు దేవుడు లేడని ఎందుకంటారు?
▪దేవుడే లేడంటే వారికి నచ్చినట్లుగా జీవించొచ్చని.అందుకే వీళ్ళు అసహ్యమైన కార్యాలు చేస్తారు.

👉బుద్దిహీనులు రెండు రకాలు.
1. *దేవుడు లేడని బహిరంగముగా ప్రకటించే వారు.*
2. *హృదయంలోనే తలంచేవారు.*

👉ఈ రెండవ రకానికి చెందినవారు మనలో కోకొల్లలు.

 *వీరు దేవుని మందిరానికి వెళ్తారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.*

కాని మనసులో మాత్రం,
నిజంగా నరకముందా?
పరలోకముందా?.....
అంటూ బుద్ధిహీనులు గానే జీవిస్తున్నారు.

*ఈ రెండు రకాలలో దేనికి మనం సంబంధించిన  వారమైనా?*

🔺ఒక్కటి గుర్తుంచుకో దేవుడున్నాడు.నీవున్నావు అంటే కారణం ఆయనే.
ఆయన నీకిచ్చిన జీవితాన్ని
ఆయన కోసం జీవించు.

2⃣ *వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను వారందరు దారి తొలగి బొత్తిగాచెడియున్నారు మేలు చేయువారెవరును లేరు,ఒక్కడైనను లేడు*
        కీర్తనలు 14:2,3

*వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనిదేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు మేలు చేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు.*

కీర్తనలు 53: 2,3

👉 *వివేకము అంటే?*
పంచదార, బెల్లం, తేనే .... ఇవన్ని తియ్యగా వుంటాయి అని చెప్పడం *"జ్ఞానం"*

 ఆ మూడు తియ్యగా వుండే  వస్తువుల రుచులలో గల తేడాలను గుర్తించ గలగడం *"వివేకం".*

👉దేవుడూ ప్రేమిస్తున్నాడు.
మనుష్యులూ ప్రేమిస్తున్నారు.
ఆ ప్రేమనూ, ఈ ప్రేమనూ ఒకే గాటన
కట్టడం కాదు.
ఆ ప్రేమలోతులను వివేచించ గలగాలి.

 *అట్లా వివేచించే మనుష్యుల కోసం ఆయన "పరిశీలనగా చూస్తున్నాడు".*

👉 చూడడం వేరు. పరిశీలనగా చూడడం వేరు.
 ఆయన చూచీ చూడనట్లు చూడడంలేదు.
పరిశీలించి, పరిశోధించి, పరికించి చూస్తున్నాడు.

*ఆయన పరిశీలనలో తేలింది ఏమిటంటే?*

▪అందరూ బొత్తిగా చెడిపోయారు. బొత్తిగా అంటే *"నూటికి నూరుపాళ్ళు".*
కనీసం ఒక్కరుకూడా మేలు చేసేవారు లేరు.

"మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను."
               యెషయ 53:6

👉 *చెడిపోవడానికిగల కారణమేంటి?*

 అందరూ దేవుడు లేడని చెప్పకపోయినా, దేవుడు లేనట్లే జీవిస్తున్నారు.

▪దేవుడున్నాడు.
▪మనలను సృష్టించాడు.
▪మనకోసం ప్రాణం పెట్టాడు.
▪మనలను చూస్తున్నాడు.

 *అనే వివేచన మనలోవుంటే, దారి తప్పిపోయే అవకాశం లేదు. చెడిపోయే అవకాశం అంతకన్నా లేదు.*

👉కాని, అట్లాంటి పరిస్థితులు మన జీవితాల్లో లోపించాయి.
దేవుడే లేనట్లుగా,మనకిష్టమొచ్చినట్లుగా,మనకు నచ్చినట్లుగా
జీవితాలను కొనసాగిస్తున్నాం.

వద్దు!!
వాటికి గతించిన కాలమే చాలు.
సరి చేసుకుందాం!
సాగిపోదాం!

3⃣ *యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు*
కీర్తనలు  14:4,5

*దేవునికి ప్రార్థనచేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా?భయకారణం లేనిచోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరిగొట్టి యున్నాడు.*
             కీర్తనలు 53:4,5

👉 దేవుడిచ్చిన ఆహారాన్నిబట్టి ఆయనను స్తుతించకుండా, ప్రార్ధించ కుండా భుజిస్తున్నారంటే?

*దేవుడున్నాడని గాని,ఈ ఆహారం ఆయనిచ్చాడు అనిగాని అట్టి తలంపు వారికి లేదన్నమాట.* 
అట్లాంటి వారు దారితొలిగిన వారు.

👉 వీరేమి చేస్తారంటే?
▪దేవుని పిల్లలను భయపెడతారు.

👉ఎందుకంటే?
దేవుడన్నా? దేవుని పిల్లలన్నావారికి లెక్కలేదు.

 *కాని, వీరికి తెలియని విషయం ఒకటుంది. దేవుడు, దేవుని పిల్లల పక్షముగా ఉన్నాడని.*

👉వీరికి తెలియని విషయం మరొకటుంది.
అదేమిటంటే?

*వీరు భయపడే దినమొకటుందని.ఆ దినాన్న దేవుడే వారిని భయపెడతాడని.*

👉ఆ దినమున వారి పరిస్థితి ఎట్లా వుంటుంది అంటే?

 *భయపడడానికి కారణం లేకపోయినా, ఆ దినాన్న భయముతో వణికిపోతారట.*

భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
బండల సందులలోను దాగుకొనిసింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
           ప్రకటన 6:15-16

👉ఒక్క విషయం!!!
దేవుని పిల్లలను భయపెట్టేవాడివి/దానవు గా నీవుంటే?
ఆ దినాన్నభయముతో వణికి పోతావు.

*ఒకవేళ నీవు భయపెట్టబడుతూ వుంటే?భయపడకు. ఆయన నీ పక్షముగా వున్నాడు.*

👉ఆయనే నీ పక్షముగా వుంటే? ఆయనే నీతో వుంటే ఇక భయమెందుకు?

 *అగ్ని గుండం సహితం ఆహ్లాదకరంగా మారుతుంది.సింహాల బోనులో సహితం సేదదీర వచ్చు.కలవర పడకు కన్నీరు రానియ్యకు.*

నీ శత్రువులకు అవమానం
నీకు ఘన విజయం.
ఎందుకంటే?
*ఆయన నీ పక్షముననున్నాడు.*

ఆగిపోక సాగిపో.
నీ గమ్యం చేరువరకు.

4⃣ *బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు. సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక.యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.*
           కీర్తనలు  14:6,7

*సీయోనులోనుండి ఇశ్రాయేలునకురక్షణకలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును.*
కీర్తనలు 53:6

👉బాధించబడుతున్నావా?
*బాధపడకు. భయపడకు.*

👉 ఎందుకంటే?
ఆయన....
▪ నీ పక్షముగా నున్నాడు.
▪నీతో వున్నాడు.
▪ నీకు ఆశ్రయమై వున్నాడు.

👉ఆయనే మన ఆశ్రయమైతే?
*"సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు."* 
 కీర్తనలు 34:10

అడవికి రాజయిన సింహపు పిల్లలు ఆకలిగొనే ప్రసక్తే లేదు.  ఒకవేళ అవయినా ఆకలిగొన వచ్చేమో గాని,
ఆయనను ఆశ్రయించే మనకు ఏ మేలు తక్కువకాదు.

 *ఎందుకంటే?మనము రారాజు పిల్లలం.యువరాజులం.*

సాతాను చెరలోనుండి ఆయన  మనలను విడిపించాడు.
▪రాజులుగా
▪యాజకులుగా
▪ఆయన పిల్లలుగా
▪ఆయన స్నేహితులుగా
మనలను చేసి, విమోచించి ధన్యకరమైన జీవితాన్నిచ్చాడు.

*ఇంత చేసినా? ఆయన ప్రేమను, త్యాగమును వివేచించ కుండా,ఇంకా చెడు మార్గాల్లోనే నడుస్తూ ,దేవుడే లేడు అని చెప్పే బుద్దిహీనమైన జీవితాన్ని జీవిస్తూవుంటే?*

👉 నీ జీవిత గమ్యమేమిటో తెలుసా?
▪ భయం
▪సిగ్గు
▪ అవమానం
▪ దేవుని ఉగ్రత

వద్దు!
సరిచేసుకుందాం!
సాగిపోదాం!
ఆ పరమ సీయోనుకు చేరుదాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*



👉 *మీ మిత్రులకు share చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...