⚡️💫✨ క్రిస్మస్ ✨💫⚡️ (పదియవ భాగము) 🕯 క్యాండిల్ సర్వీస్: క్రిస్మస్ ఆరాధనలో మనలను ఆకర్షించే కార్యక్రమాలలో ఇదొకటి. అందరూ చీకట్లో క్యాండిల్స్ వెలిగించు కుంటారు. మనమయితే మిరుమిట్లు గొలిపే కాంతిని ఆపేసి, చీకటిని సృష్టించుకొని, దానిలో క్యాండిల్స్ వెలిగిస్తాము. అద్భుతమైన సంగీతంతో, పాడుతూ, అందరూ వెలిగించిన క్యాండిల్స్ పట్టుకుంటే చూడడానికి చాల అందముగా వుంటుంది కదా! . కాని, దీని వలన ఆయనకు మహిమ గాని, మన జీవితాలకు ఆశీర్వాదం గాని ఏదయినా ఉందా? అసలు దీని ఆంతర్యమేమిటి? "పెద్ద అడవిని తగులబెట్టడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు." ప్రపంచాన్ని వెలిగించడానికి, వెలుగు చున్న ఒక్క క్రొవ్వొత్తి చాలు. ఆయన తాను ఒక క్రొవ్వొత్తిలా నీకోసం నాకోసం కరిగిపోయి మనకు వెలుగిచ్చాడు. క్యాండిల్ సర్వీస్ లో ఒక్క క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ ద్వారా కొన్ని నిమిషాల్లో సభలో నున్న వారందరి క్యాండిల్స్ వెలిగించ బడతాయి. అంటే? 🔸వెలిగించ బడిన నీవు మరొకరిని వెలిగించాలి. 🔸రక్షించ బడిన నీవు మరొకరిని రక్షించాలి. 🔸సమాధానం పొందుకున్న నీవు, ఆ సమాధానాన్ని మరొకరి పంచాల...