✨💥💫 *క్రిస్మస్* 💥 ✨💫
( రెండవ భాగము)
యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. మత్తయి 2:2
🌟 స్టార్ (నక్షత్రం):
(స్వయంగా ప్రకాశించేది)
ఈలోకంలో చాలా స్టార్స్ వున్నాయ్.
💫 సూపర్ స్టార్
💫టెరా స్టార్
💫మెగా స్టార్
💫ఈ స్టార్స్ గా పిలువబడే వారిని వెంబడించేవారు లోకంలో కోకొల్లలు.
👉 ఈ స్టార్స్ వెలుగులో ఉన్నవారిని చీకటిలోనికి తీసుకెళ్తారు తప్ప, చీకటిలోనున్న వారిని వెలుగు లోనికి నడిపించలేరు.
అయితే, ప్రకాశ మానమైన నక్షత్రం ఒకటుంది. అది,
✨ ప్రకాశించింది.
✨ అత్యానందాన్నిచ్చింది
✨ దారి చూపించింది.
✨ గమ్యం చేర్చగలిగింది.
యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువచుక్కయునై యున్నాను. ప్రకటన 22:16
💮 ఆ స్టార్ మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు.
⭐ ఈ స్టార్ కున్న 5 కోణాలు,
ప్రియ రక్షకుని 5 గుణగణాలను తెలియజేస్తున్నాయి.
🔺ఆశ్చర్యకరుడు
🔺ఆలోచనకర్త
🔺బలవంతుడైన దేవుడు
🔺నిత్యుడగు తండ్రి
🔺సమాధానకర్త
యెషయా 9:6
ఇంతకీ నీ గమ్యమేమిటి?
ఏ స్టార్ ని వెంబడిస్తున్నావ్?
💥 ఈ లోకంలో స్టార్స్ ని నీవు కలవాలంటే? నీకు ఎప్పటికీ అనుమతి దొరకక పోవచ్చు.
కాని, ఈ స్టార్ నిన్ను కలసుకోడానికి దివి నుండి భువికి దిగి వచ్చింది.
💥 ఈ లోకంలో స్టార్స్ నిన్ను
నలిపేస్తారు. కాని, ఈ స్టార్ నీకోసం నలిగిపోయింది.
దివి నుండి దిగి వచ్చిన స్టార్ ను వెంబడించ గలిగితే?
🔹ఆశ్చర్య క్రియలు నీ జీవితంలో అనుభవిస్తావ్.
🔹నీ ప్రతీ పరిస్థితిని పరిష్కరించుకోగల ఆలోచన దొరుకుతుంది.
🔹నీ బలహీన సమయాల్లో ఆయనే నీ బలం.
🔹నిత్యమూ నీకు తండ్రిగా ఉంటాడు.
🔹నీ జీవితమంతా సమాధానమే.
ఇదెప్పుడు సాధ్యం?
👉ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే.
👉ఆ స్టార్ ను వెంబడించినప్పుడు మాత్రమే.
నీ హృదయం ఆయనకింకా దూరంగానుందా? నేడే ఆయనను చేర్చుకో! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి