✳ *క్రిస్మస్ సందేశాలు* ✳
(2 వ భాగము )
*అందరికంటె గొప్పవాడు*
యోహాను 10:29 వాటిని నాకిచ్చిన నా తండ్రి *అందరికంటె గొప్పవాడు*
మన ప్రభువైన యేసు ఎవరికంటే గొప్పవాడు? ఈ భూమి గొప్పవి అనేకమైనవి ఉన్నా మన ప్రభువు వాటి అన్నిటికంటే గొప్పవాడు. అయితే ప్రభువు ఎవరికంటే గొప్పవాడు.
*A. సమస్త మానవులకంటే గొప్పవాడు:* యోహాను 10:29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు; యోహాను 10:30 నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.
ఉదా 1. అబ్రహాము కంటే గొప్పవాడు - యోహాను 8:53 మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతని కంటె గొప్పవాడవా యోహాను 8:58 యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
ఉదా 2: యాకోబు కంటే గొప్పవాడు - యోహాను 4:12 తానును తన కుమాళ్లును, పశువులును, యీబావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? యోహాను 4:13-14 అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
ఉదా ౩: సోలోమోను కంటే గొప్పవాడు – మత్త 12:42 విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంత ములనుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
ఉదా 4: యోనా కంటే గొప్పవాడు – మత్త 12:40 యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును మత్త 12:41 నీనెవెవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
*B. రాజుల కంటే గొప్పవాడు:* ప్రక 19:16 రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడి యున్నది.
ఉదా 1. బబులోను రాజు నేబుకద్నేజరు – దాని 3:15 బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు? దాని 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండము లోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు
ఉదా2 అష్షూరు రాజైన సన్హెరీబు - . 2 రాజు 18:19 అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెనుఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు మహా రాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగానీవు ఈలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి? 2 రాజు 18:33 ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరురాజు చేతిలోనుండి విడిపించెనా? 2 రాజు 19:10 యూదారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి యెరూషలేము అష్షూరురాజుచేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని యున్న నీ దేవునిచేత మోసపోకుము. 2 రాజు 19:35 ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి
ఉదా ౩. ఐగుప్తు రాజు ఫరో – నిర్గ 5:2 ఫరోనేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయ ననెను. నిర్గ 12:31 ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించివారితో మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహో వాను సేవించుడి. నిర్గ 12:32 మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను నిర్గ 7:1 కాగా యెహోవా మోషేతో ఇట్లనెనుఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని
*C. మాంత్రికుల కంటే గొప్పవాడు:* ఉదా 1 శకునగాండ్రు – నిర్గ 7:12 వారిలో ప్రతివాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్పమాయెనుగాని అహ రోను కఱ్ఱ వారి కఱ్ఱలను మింగివేయగా నిర్గ 8:18 శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన కాకపోయెను. నిర్గ 8:19 శకునగాండ్రుఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. నిర్గ 9:11 ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువ లేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయు లందరికిని పుట్టెను
ఉదా 2: గారడివాడు - ఎలుమ- అపో 13:11 ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.
*D. సమస్త దేవతల కంటే విగ్రహాలకంటే గొప్పవాడు:* నిర్గ 18:11 ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్య మునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను
ఉదా 1 : నెబుకద్నెజరు బంగారు ప్రతిమ –దాని 3:1 రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమయొకటి చేయించి, బబులోనుదేశములోని దూరాయను మైదాన ములో దాని నిలువబెట్టించెను. అది అరువదిమూరల ఎత్తును ఆరుమూరల వెడల్పునై యుండెను. దాని 3:18 రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టిం చిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము. దాని 2:34 మరియు చేతిసహా యము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కన బడెను
ఉదా 2 – దాగోను దేవత - 1 సమూ 5:3 అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను 1 సమూ 5:4 ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి యుండెను.
ఉదా ౩ : బయలు దేవత – 1 రాజు 18:24 తరువాత మీరు మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పగా జనులందరునుఆ మాట మంచిదని ప్రత్యుత్తర మిచ్చిరి 1రాజు 18:38 అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. 1 రాజు 18:39 అంతట జనులందరును దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.
ఈ విధంగా అందరికంటే గొప్పవాడైన యేసు నన్ను నమ్మిన వారు *నాకంటే గొప్ప కార్యములు చేయుదురు* అని చెప్పటం వలన యేసునందు విశ్వాసముంచు వారు అనగా ఆయన శిష్యులు ఆయన కంటే ఎక్కువ సువార్త సేవ చేస్తారు. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమేన్!!!
(To be continued..)
దైవాశ్శీసులు!
From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_
Immanuel Bible College
NIDUBROLU
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి