ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ గ్రంధంయొక్క ఏడు అద్భుతాలు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚

📖 *బైబిల్ గ్రంధంయొక్క ఏడు అద్భుతాలు.*😍


1⃣ *.బైబిల్ సమకూర్చబడిన విధానం:-* 1600సంవ్సతరాల్లో అది సమకూర్చబడింది.


2⃣ *.బైబిల్ యొక్క సమతుల్యత:-* 66పుస్తకాలు అయా సమయాల్లో,అయా వ్యక్తులచేత వ్రాయబడినప్పటికీ ఒకే అంశం,ఒకే సారాంశం కలిగి ఉంది.


3⃣ *.బైబిల్ యొక్క చరిత్ర:-* ఇందులో గల పుస్తకములు బహు పురాతనమైనవి.


4⃣ *.బైబిల్ అమ్మకం:-* భూమి మీద బైబిల్ గ్రంధం అమ్ముడుపోయినట్లుగా మరి ఏ పుస్తకం అమ్ముడు పోలేదు.


5⃣ *.బైబిల్ చదివేవారి సంఖ్య :-* ప్రపంచంలోనే బైబిల్ చదవబడునంతగా మరి ఏ ఇతర గ్రంధము చదవబడలేదు.


6⃣ *.బైబిల్ భాష:-* వ్రాసింది ఎక్కువ శాతం పామరులే అయనా ఇంత అర్ధవంతమైన రీతిలో మారే పుస్తకం వ్రాయబడలేదు.


7⃣ *.బైబిల్ భద్రత:-* భూమి మీద బహుగా ద్వేషించబడిన పుస్తకం బైబిల్ అయినప్పటికి ఇంతవరకు ఎవరు దానిని హతమార్చలేకపోయారు.

   

 💠 *భాషలు-తర్జుమా-వేగం*💠


👉  బైబిల్ గ్రంధమందలి ఎదో ఒక పుస్తకము ఇంచుమించు 1431భాషల్లో    అంటే ఒకవెయ్యి నాలుగు వందల ముప్పై  ఒక్క భాషల్లో బైబిల్ గ్రంధ భాగములు తర్జుమా చేయబడినది. పూర్తి బైబిల్ గ్రంధం 240భాషల్లో తర్జుమా చేయబడింది. నూతన నిబంధన గ్రంధం ఇంచుమించు 320 భాషల్లో తర్జుమా చేయబడింది.అంటే ప్రపంచలో ఉన్న 5,687 భాషల్లో నేటికి కేవలం 560భాషల్లోనే బైబిల్ తర్జుమా చేయబడింది.అంటే భూమ్మీద ఉన్న భా షల్లో 10%మందికి మాత్రమే వారి భాషల్లో బైబిల్ ఉందన్నమాట.నేటి లెక్కల ప్రకారం 731భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయబడుతుంది.





💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨

👉 *సేకరణ*
*బ్రదర్ సముయేలు*


📖 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి*📖



💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...