*ప్రార్థనకు ప్రతిఫలము లభించకపొవుటకు గల కారణములు*
*1. హృదయములో పాపము వుంచు కొని ప్రార్థించుట*
కీర్తనలు 66: 18
నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును.
*2. వేషధారణ తో ప్రార్థించుట*
మత్తయి 6: 5
మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
*3. భోగముల నిమిత్తము ప్రార్థించుట*
యాకోబు 4: 3
మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.
*4. సందేహము తో ప్రార్థించుట*.
యాకోబు 1: 6
అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.
*5. తన్ను తాను హెచ్చించుకొని ప్రార్థించుట.*
లూకా 18: 12,14
వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.
అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.
*6. వాక్యం లక్ష్యపెట్టకుండ ప్రార్థించుట.*
సామెతలు 1: 24, 29
నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి
అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును.
సామెతలు 28: 9
ధర్మశాస్త్రమువినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము.
*7. సహోదరునితో సమాధానపడ కుండా లేక క్షమించకుండా ప్రార్థించుట.*
మత్తయి 5: 23-24
కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల
అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.
మత్తయి 6: 12
మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.
*8. సహోదరునికి లేమి కలుగుట చూచియు సహాయము చేయకుండా ప్రార్థించుట*
1యోహాను 3: 17
ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?
*9. దేవునికి ఇవ్వకుండా ప్రార్థించుట.*
మలాకీ 3: 9-10
ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునేయున్నారు, మీరు శాపగ్రస్తులైయున్నారు.
నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
కాబట్టి ప్రియమైన సహోదరుడా ప్రార్థనకు ప్రతిఫలము లభించక పోవుటకు గల అవరోధములు తొలగించి ప్రార్థనలో ముందుకు సాగుదాము..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి