ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *.....క్రిస్మస్.....* ✳

(నాలుగవ భాగము)

 ♻ *జ్ఞానులు* ♻

*రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి*
మత్తయి 2:1,2

*వీరు తూర్పు దేశానికి చెందిన వారు.*

👉వారు ఎంతమంది? 

👉ఏయే దేశాలకు చెందిన వారు?

*వీటి గురించి అనేక అభిప్రాయములున్ననూ, బైబిల్ మాత్రం వీటి గురించి ప్రస్తావించ లేదు.*

👉అయినప్పటికీ, అవగాహనకై ఒక్కమాట!
*సాధారణంగా, జ్ఞానులు అర్పించిన కానుకలను బట్టి, ముగ్గురు జ్ఞానులు వచ్చి వుంటారు అనే తలంపు రావడం సహజం.*

🔺కానీ, ఎడారి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇద్దరు, ముగ్గురుగా ప్రయాణం చెయ్యరు.
🔺 ఒక పెద్ద సమూహముగా ప్రయాణిస్తారు.
👉జ్ఞానులు పట్టణములో ప్రవేశించే సరికి, యెరూషలేమంతా కలవర పడ్డారట. 
*కేవలం ముగ్గురు ప్రవేశిస్తే? అట్లా జరిగే అవకాశం లేదు.*

👉కావున, జ్ఞానులు ముగ్గురుగా కాకుండా ఒక సమూహముగా ఆయనను ఆరాధించిడానికి వచ్చి యుండవచ్చు.

*రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి*
మత్తయి 2:1,2

👉తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారట.
*రావడానికి గల కారణం?*
🔹ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూచారు. అది అన్ని నక్షత్రాలవంటిది కాదు. 
🔹గ్రంధాలు వెదకితే వారికర్ధమయ్యింది.
ఒక రాజు పుట్టాడని.
🔹ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ యెరూషలేములో హేరోదు రాజు ఇంటికి చేరుకున్నారు. 
🔹ఆ నక్షత్రం అక్కడ ఆగిపోలేదు. వీరే అక్కడ ఆగిపోయారు.

♻ *జ్ఞానుల జీవితం నుండి నేర్చు కోవలసిన ఆత్మీయపాటం:*
👉 దేవుడు మాతూర్పు దేశంలో పుడితేనే మేము ఆయనను ఆరాధిస్తాం అని అనుకోలేదు. 
👉ఇశ్రాయేలు దేశంలో పుడితే ఆయన "విదేశీ దేవుడు" అని తలంచలేదు.
👉మన వాళ్ళు ఫేస్ బుక్ లో మెసేజ్ పెడతారు. యేసు క్రీస్తు విదేశీ దేవుడు. మనకొద్దని.
*అయితే ఒక్క విషయం!   ఈ ఫేస్ బుక్ కనిపెట్టింది ఎవరు?* 

*సెల్ ఫోన్ కనిపెట్టింది ఎవరు?* 

*విదేశీయుడు కనిపెట్టింది ఏదీ నాకొద్దు అని, ఒక్క రోజు జీవించగలవా?*

*వీటికి లేని విదేశీయత,      నీ కోసం ప్రాణం పెట్టిన దేవునికి అంటగడతావా?*

👉జ్ఞానులు అట్లా తలంచలేదు. 
కారణం? 
*వారు జ్ఞానులు.*
 
👉మనం అట్లా తలంచు చున్నామంటే? 
కారణం? 
*మనం .......???*
*(మీరే చెప్పండి)*
వద్దు! 

మన తలంపులు మార్చుకుందాం! 

*ఆయనను మన హృదయంలో చేర్చుకుందాం!*

*రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు* *యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి*
మత్తయి 2:1,2

*వీరు తూర్పు దేశానికి చెందిన వారు.*

👉తూర్పు దేశమునుండి బయలుదేరిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

🔺ఎడారులు, కొండలు, లోయలు, గుట్టలగుండా వారి ప్రయాణం సాగిపోతుంది. రోజులు, వారములు, నెలలు గడచిపోతున్నాయి.
*దేనికోసం వారి అన్వేషణ?*

*యూదుల రాజును చూడాలి.*

👉ఎందుకు? 
*మేము లోక రక్షకుని చూసామని లోకమంతా గొప్పలు చెప్పుకోవడానికా?*
👉 కానే కాదు. 
*ఆయనను ఆరాధించడానికి.*

👉అందుకే, సూటిగా ప్రశ్నిస్తున్నారు. 
👉యూదుల రాజు దగ్గరకే వెళ్లి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయనను పూజించడానికి వచ్చామని.

*జ్ఞానులు అర్ధం చేసుకోగలిగారు. ఈ లోకంలో చాలామంది రాజులున్నారు గాని, ఇప్పుడు పుట్టిన రాజు వారివంటి వాడు కాదని.*

👉ఈ లోకంలో దేవుళ్ళు అని పిలువబడే వారు కోకొల్లలు.
 🔺వారంతా మన కోసం ప్రాణం పెట్టిన వారు కాదని.
 🔺వారు మనలను నిర్మించలేదని, 
🔺మనమే వారిని నిర్మించామని మనకూ అర్ధం కావాలి.

*అందుకే వారు ఆయనను వెదకుతూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.*

కాని ఒక్కవిషయం!!!

*ఆరాధించే మనసు నీకుంటే?*
 
*నీవు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పనిలేదు.*

👉కారణం? 
*ఆయన నిన్నే వెతుక్కుంటూ వచ్చాడు.*

*నీకోసం వచ్చిన ఆయనను నీ హృదయంలో చేర్చుకుంటేచాలు.*

*నీ హృదయమనే తలుపు నొద్దనుండి తట్టు చున్నాడు. కనీసం ఈ రోజయినా ఆయనను ఆహ్వానిద్దామా? ఆరాధిద్దామా?*


*తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.* 
మత్తయి 2:11

*జ్ఞానులు వచ్చి తల్లియైన మరియను ఆ శిశువును చూచారు.*
కాని, 
*సాగిలపడి పూజించింది* (ఆరాధించింది) 

 👉 *"యేసయ్యను మాత్రమే".* 
👉మరియను కాదు.

*నీ హృదయం దేవునితో నిండిపోయినప్పుడు నీ హృదయంలోనుండి వచ్చే చిన్న మూలుగు కూడా ఆరాధనే.*

👉నేటి దినాల్లో ఆరాధనకు 
అర్ధం మారిపోయింది. 

👉ఆరాధించే మనసు దూరమయ్యింది.

*చెవులు దద్దరిల్లే సౌండ్స్ తో మ్యూజిక్ తో డాన్స్ చేస్తూ , అన్ని పాటలు కలిపిపాడేస్తే దానికి "ఆరాధన" అని పేరు.డ్రమ్స్ ఆగిపోతే ఆరాధన కూడా ఆగిపోతుంది.*

👉ఆరాధన అనేది పదినిమిషాలకు పరిమితమైనది కాదు. ఇది నిరంతర ప్రక్రియ...

👉ఈలోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాధించిన వారు, 

👉జ్ఞానులుగా పిలువబడినవారు 
మేమెందుకు? 

*ఆ శిశువు ముందు సాష్టాంగపడాలి?*
 అని అనుకోలేదు.
👉 కారణం? 
*ఆయన ఎమైయున్నాడో వారు అర్ధం చేసుకోగలిగారు.*

*ఆయన ఏమయ్యున్నాడో దానిని బట్టి ఆయనను గొప్పచెయ్యడమే నిజమైన "ఆరాధన."*

👉సంవత్సరాలు మన జీవితంలో దొర్లిపోతున్నాయి గాని, మనమింకా ఇట్లాంటి అనుభవంలోనికి ప్రవేశించలేదేమో?

👉కనీసం ఈ క్రిస్మస్ దినాల నుండి అయినా, నిజమైన ఆరాధన చెయ్యడానికి మన హృదయాలను సిద్ద పరచుకుందాం.......

 *తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.*
 మత్తయి 2:11

👉జ్ఞానులు తమ పెట్టెలు విప్పి కానుకలు సమర్పించిరి.
 *మనమునూ మన హృదయమనే పెట్టెలు విప్పి,*

 *మన హృదయాన్ని ఆయన పాదాల చెంత క్రుమ్మరించి కానుకలు సమర్పించాలి.*

👉 జ్ఞానులు సమర్పించిన కానుకలలో మొదటిది  
♻ *"బంగారము".*

 *లోహములలో బంగారము "పరిశుద్దతకు" గుర్తు.*
 
👉జ్ఞానులు బంగారము సమర్పించడము ద్వారా ఆయన "పరిశుద్ధుడు" అనియు, ఆయనను ఆరాధించు వారు "పరిశుద్దతతో" ఆరాధించాలని తెలియజేస్తున్నారు. 
అయితే? 
*మన క్రిస్మస్ ఆరాధనలో పరిశుద్దత ఎంత?* 

👉ఎప్పుడూ త్రాగని వాడు సహితం సంవత్సరానికి ఒక్కసారి అన్నట్లు క్రిస్మస్ రోజే త్రాగుతున్నాడు. 

*ఇక మనం ధరించే వస్త్రాల గురించి మాట్లాడకపోవడమే మేలు.* (అట్లా అని అందరూ కాదు. ఆ కొందరే అందరిమీద ప్రభావం చూపుతున్నారు) 

*మనం పాడే పాట ఎవ్వరికీ అర్ధం కాదు.* 
👉కారణం? 
*హద్దులు మీరిన సంగీతం.* వీటిలో కూడా పరిశుద్దత లోపించింది. జీవంలేని సంగీత పరికరాలు దేవుని స్తుతించలేవు. ఆరాధించలేవు. 

*ఏదయినా చెయ్యాలంటే?*    

*జీవం కలిగిన నీవేచెయ్యాలి.*

👉 నీ సంగీతం దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి గాని నీ సంగీత ప్రతిభ చూపించేదిగా ఉండకూడదు మరియు ఇతరులకు విపరీత ధ్వనితో అభ్యంతరంగా ఉండకూడదు కాని, 
*ఈ డాన్స్ ఏంటి అంటే?* మరళా దావీదు దగ్గరకు వెళ్లి పోతారు. 
*డాన్స్ కి మాత్రం దావీదును వాడుకుంటారుతప్ప, దావీదు కలిగియున్న పశ్చాత్తాపంలో లేస మాత్రమైనా వీరి జీవితాల్లో కనిపించదు.* 

👉 *డాన్స్ లు ద్వారా మనం సమాజానికి ఇచ్చే వర్తమానం ఏంటో?*
 
👉క్రీస్తు జన్మించినప్పుడు ఎవ్వరూ డాన్సు చేసినట్లు బైబిల్ లో కనిపించదు. 

*ఇదేనా? క్రిస్మస్ ఆరాధన పేరుతో మనం సమర్పించే "బంగారు కానుక".*
 వద్దు! 

*ఆయన పరిశుద్దుడై యున్నలాగున మనము కూడా పరిశుద్దులమై యుండి, పరిశుద్దతతో ఆయనను ఆరాదిద్దాం!*
 
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!

 అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

కామెంట్‌లు