ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దేవుని ప్రశ్నకు నీ జవాబు ఏమిటి మిత్రమా??

🌹 దేవుని ప్రశ్నకు నీ జవాబు ఏమిటి మిత్రమా????? 🌹

☘ ఎక్కడున్నావు ఆదాము అని పిలువగా చెట్టు చాటున ఉన్నాను ప్రభువా అని సెలవిచ్చాడు ఆదాము - ఆది 3:9,10

☘ ఎక్కడికి వెళ్ళావు దీనా అని అనగా షెకెము (లోకాన్ని) చూచుటకు వెళ్ళాను అన్నది - ఆది 34:1

☘ ఎక్కడి నుండి వచ్చావు గేహజీ అనగా పాపము చేసి వచ్చాను అని చెప్పక ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు - 2రాజులు 5:25

☘ ఎక్కడికి పారిపోతున్నావు యోనా అని అడగగా దేవుడు చెయ్యమని చెప్పిన పనికి దూరముగా, దేవుని సన్నిధికి దూరముగా అని అన్నాడు - యోనా 1:10

🍂 మరి దేవుని మందిరానికి ఈరోజు వెళ్లావు, వెళ్లబోతున్నావు మంచిది. కానీ ఎక్కడి నుండి వచ్చావు అని అడిగితే నీ సమాధానం ఏమిటి?

🌿 సోమవారం నుండి శనివారం వరకు లోకములో అటు ఇటు తిరిగి వచ్చాను అని అని చెప్తావా?

🌿 లోకాన్ని చూసి రావడానికి వెళ్ళాను అని చెప్తావా?

🌿 పాపము చేసి దాని నుండి తప్పించుకోవడానికి మందిరమనే చెట్టు చాటున దాక్కోవడానికి వచ్చాను అని చెప్తావా?

🌿 ఎక్కడికి వెళ్ళలేదు దేవుని వాక్యాన్ని గదిలో పెట్టి (సంపాదించుకోవాల్సిన వాటిని సంపాదించి దాచి పెట్టి) ఎక్కడ తిరిగినా నా హృదయం మాత్రం ఇక్కడే ఉంది అని చెప్తావా?

🌿 దేవుడు సెలవిచ్చినది చేయకుండా పారిపోయాను, తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాను అని చెప్తావా?

🍁 తప్పుని ఒప్పుకోక దాచిపెట్టాడు ఆదాము కాబట్టే గెంటివేయబడ్డాడు - ఆది 3:24

🍁 తప్పు అని గ్రహించక చింతించలేదు దీనా కాబట్టే ఇశ్రాయేలు రాజ్యములో ఎక్కడా కనిపించలేదు. 

🍁 తప్పు అని తెలిసి కప్పుకున్నాడు గేహజీ కాబట్టే కుష్టరోగమును పొందుకున్నాడు - 2 రాజులు 5:27

🍁 తప్పుని ఒప్పుకున్నాడు యోనా కాబట్టే అనేక లక్షల మంది రక్షించబడుటకు కారణం అయ్యాడు - యోనా 3:10

🍂 మరి నీ సమాధానం ఏమిటి విశ్వాసి ఎవరి వలే నీవు జవాబిస్తావు దేవునికి? నీ సమాధానం ఏమిటి? ఒకసారి ఆలోచించు....

🍂 చూచున్న దేవునికి నీవు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ తిరిగావో, ఎలా జీవించావో తెలుసు కాబట్టి ఆదాము, దీనా, గేహజీ వలే ఉండక యోనా వలే ఉండి మన తప్పుని ఒప్పుకుని ప్రభు పాదాల వద్ద మన జీవితాన్ని అప్పగించుదాము. ఇట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక... ఆమేన్....👍🙏

కామెంట్‌లు