ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

⚡️✨💫 క్రిస్మస్ 💫✨⚡️
       (ఏడవ భాగము) 

గొర్రెల కాపరులు (2):

దూత చెప్పిన "రక్షకుడు పుట్టాడు" అనే, ఒక చిన్న సువార్తమానమునకు వారియొక్క ప్రతిస్పందన, బండబారిన మన రాతిహృదయాలకు గొప్ప ఆధ్యాత్మిక పాటం.

"మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని" (లూకా 2:15) "ఐకమత్యమే మహా బలం" అంటూ చిన్నప్పుడు నేర్చుకున్న పాటాలు లెక్కలేనన్ని. 

🔸గడ్డి పరకలు అన్నీ కలిస్తే బలమైన ఏనుగునే బంధించేస్తాయి. 
🔸చలి చీమలన్నీ కలిస్తే విష సర్పాన్నే చంపేస్తాయి. 
🔸గొర్రెల కాపరులు సమాజములో బలహీనులే. కాని వారిబలం వారి ఐకమత్యమే. 

బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొనినప్పుడు, వారిలో ఒక్కరు కూడా వ్యతిరేకించినట్లు చూడము. వారిదంతా ఒకే మాట. ఒకే బాట. అందుకే దూత చాటించిన సమాధానాన్ని పొందుకోగలిగారు. 

షోమ్రోను పట్టణం శత్రువుల ముట్టడి వల్ల, పిల్లలను సహితం వండుకుతినే భయంకరమైన కరవుతో అల్లాడుతున్న సమయంలో, సిరియా దండు పేటకు వెళ్దామని నలుగురు కుష్టు రోగులు ఒకరితో నొకరు చెప్పుకొంటున్నప్పుడు, వారిలో ఒక్కరుకూడా వ్యతిరేకించ లేదు. వారిదంతా ఒకే నిర్ణయం. వారు బ్రతకనిస్తే బ్రతుకుదాం!  చంపేస్తే చచ్చిపోదాం!  ఒకే మాట, ఒకే బాట. 

ఆ నలుగురు కుష్టురోగుల ఐక్యత షోమ్రోను పట్టణమునకు సంవృద్దియైన ఆహారం పెట్టగలిగింది. ఇట్లాంటి పరిస్థితులు మన జీవితాల్లో లోపించాయి. ప్రతీ ఒక్కరూ నేను అనుకున్నట్లే జరగాలంటూ ఇతరులతో ఏకీభవించలేని పరిస్థితి. 

అందుకే, మన సంఘాలను, మన కుటుంబాలను సాతాను చీల్చి చెండాడుతున్నాడు. వాడి ఆటలు సాగుతున్నాయంటే? కారణం? మనలో ఐక్యత లోపించింది. ఐక్యత లోపించింది కాబట్టే, సమాధానం లోపించింది. 

వద్దు! ఒకరినొకరు అర్ధం చేసుకుందాం!ఒకరితోనొకరు ఏకీభవిద్దాం! కలసి కట్టుగా దేవునికోసం జీవిద్దాం! సమాధానాన్ని అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...