ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2020లోని పోస్ట్‌లను చూపుతోంది

త్యాగం, విధేయత* ల సంగమమే “ క్రిస్మస్”

త్యాగం, విధేయత* ల            సంగమమే “ క్రిస్మస్” -——-💥✨💫🎄⚡️——— వేసవి సెలవుల విరామ సమయం తర్వాత స్కూల్స్ మరలా ప్రారంభమయ్యాయి. నూతనంగా చేరిన విద్యార్థులను టీచర్ పరిచయంచేసుకొనే వాటిలో భాగంగా, వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ, మీ డాడీ ఏమి చేస్తుంటారు అంటూ ప్రశ్నిస్తే, దానికి సమధానంగా డాక్టర్, టీచర్ ...అంటూ పిల్లలు ఉత్సాహంగా సమాధానము చెప్తున్నారు. అయితే, ఒక అబ్బాయికి వాళ్ళ డాడీ ఏమి చేస్తారో తెలియక ఏడ్వడం ప్రారంభించాడు. రేపు వచ్చేటప్పుడు తెలుసుకొనిరా అంటూ టీచర్ వాడిని సముదాయించింది. ఆ రోజు స్కూల్ నుండి వాడు ఇంటికి వెళ్ళాడు. స్కూల్ బ్యాగ్ కూడా క్రింద పెట్టకుండానే, డాడీ మీరేమి చేస్తారంటూ అడగడం మొదలుపెట్టాడు. దానికి వాళ్ళ డాడీ రేపు నీకు స్కూల్ కి సెలవు కదా, నేను పనిచేసేచోటకి తీసుకొని వెళ్లి చూపిస్తానని చెప్పి, తర్వాత రోజు తీసుకొని వెళ్ళాడు. ఒక నది మీద బ్రిడ్జి ఉంటుంది, అది రెండుగా విడిపోతే, దానిలో బోట్స్ ప్రయాణిస్తాయి, లేకపోతే బ్రిడ్జి కలసివుంటే, దాని మీద ట్రైన్స్ ప్రయాణిస్తాయి. ఆ బ్రిడ్జిని ఆపరేట్ చేసే వర్క్ వీళ్ళ డాడీ చేస్తారు. ఆయనేదో ఆఫీస్ వర్క్ చేసుకొంటున...

క్రిస్మస్ (16వ భాగము)

⚡️💫🌟✨ క్రిస్మస్ ⚡️💫⚡️            (16వ భాగము)  *తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి*.  మత్తయి 2:11 ♻️ *జ్ఞానులు సమర్పించిన కానుకలలో రెండవది 'సాంబ్రాణి'.* సాంబ్రాణిని మండుచున్న నిప్పుల్లో వేస్తే, సువాసనను వెదజల్లుతుంది. అట్లానే, ఆయన మనకు పరిమళ వాసనగా ఉండుటకు శ్రమల కొలిమిలో ( సిలువలో) అర్పణముగాను, బలిగాను తన్నుతాను అర్పించు కున్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; (ఎఫెసి 5:2) 👉*సాంబ్రాణి ఆయన 'మానవత్వానికి' సాదృశ్యముగా వుంది. * ఈ అర్పణము అర్పించడానికి శరీరధారిగా సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చాడు. ఆయన దేవుని స్థానంలో నుండి ఆ పని చెయ్యలేడా? సాధ్యం కాదు. దేవుడు ఆత్మ. ఆయనకు రక్తమాంసములు  లేవు. పరిశుద్ధుని రక్తం చిందించకపోతే మన పాపములకు పరిహారం లేదు. అందుకే, సంపూర్ణ దేవుడైయుండియూ, సంపూర్ణ మానవునిగా ఈలోకానికి ఏతెంచాడు.  పాత నిబంధనా కాలంలో బలి అర్పణలో తప్పక సాంబ...

క్రిస్మస్ (15వ భాగము)

💫⚡️🌟✨క్రిస్మస్ 🌟⚡️✨💫      (15వ భాగము)  *తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి*.  మత్తయి 2:11             జ్ఞానులు తమ పెట్టెలు విప్పి కానుకలు సమర్పించిరి. మనమునూ మన హృదయమనే పెట్టెలు విప్పి, మన హృదయాన్ని ఆయన పాదాల చెంత క్రుమ్మరించి కానుకలు సమర్పించాలి.  ♻️ *జ్ఞానులు సమర్పించిన కానుకలలో మొదటిది "బంగారము".* 🔸పక్షులలో పావురము  🔸జంతువులలో గొర్రెపిల్ల  🔸రంగులలో తెలుపు  🔸లోహములలో బంగారము "పరిశుద్దతకు" గుర్తు.  జ్ఞానులు బంగారము సమర్పించడము ద్వారా ఆయన "పరిశుద్ధుడు" అనియు, ఆయనను ఆరాధించు వారు "పరిశుద్దతతో" ఆరాధించాలని తెలియజేస్తున్నారు.  అయితే? మన క్రిస్మస్ ఆరాధనలో పరిశుద్దత ఎంత? ఎప్పుడూ త్రాగని వాడు సహితం సంవత్సరానికి ఒక్కసారి అన్నట్లు క్రిస్మస్ రోజే త్రాగుతున్నాడు. ఇక మనం ధరించే వస్త్రాల గురించి మాట్లాడకపోవడమే మేలు. (అట్లా అని అందరూ కాదు. ఆ కొందరే అందరిమీద ప్రభావం చూపుతున్నారు)  మనం పాడే పాట ఎవ్వరికీ అర...

క్రిస్మస్- (14వ భాగము) —-

🌳💫✨⚡️క్రిస్మస్💫✨🌲🌟        —- (14వ భాగము) —- 🌟*జ్ఞానులు* (3) 🔺*ఆరాధించారు* తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి 2:11 జ్ఞానులు వచ్చి తల్లియైన మరియను ఆ శిశువును చూచారు. కాని, సాగిలపడి పూజించింది (ఆరాధించింది) "యేసయ్యను మాత్రమే". మరియను కాదు.  నీ హృదయం దేవునితో నిండిపోయినప్పుడు నీ హృదయంలోనుండి వచ్చే చిన్న మూలుగు కూడా ఆరాధనే. నేటి దినాల్లో ఆరాధనకు అర్ధం మారిపోయింది. ఆరాధించే మనసు దూరమయ్యింది.  👉చెవులు దద్దరిల్లే సౌండ్స్ తో మ్యూజిక్ తో డాన్స్ చేస్తూ , అన్ని పాటలు కలిపిపాడేస్తే దానికి "ఆరాధన" అని పేరు.  👉 ఆరాధన అనేది పదినిమిషాలకు పరిమితమైనది కాదు. ఇది నిరంతర ప్రక్రియ. మద్యలో ఈ డాన్స్ ఏంటి అంటే? మరళా దావీదు దగ్గరకు వెళ్లి పోతారు. డాన్స్ కి మాత్రం దావీదును వాడుకుంటారుతప్ప, దావీదు కలిగియున్న పశ్చాత్తాపంలో లేసు మాత్రమైనా వీరి జీవితాల్లో కనిపించదు.  ఈలోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాధించిన వారు, జ్ఞానులుగా పిలువబడినవారు మేమెందుకు? ఆ శిశువు ముందు సాష్...

క్రిస్మస్* ( పదమూడవ భాగము)

✨💫🌟^క్రిస్మస్*  🌟💫✨    ( పదమూడవ భాగము)  *జ్ఞానులు:* వీరు తూర్పు దేశానికి చెందిన వారు. *రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. *(మత్తయి 2:1,2) 🐲మన జ్ఞానము దేవుని జ్ఞానమునకు అందదు. దానికి జ్ఞానులే ప్రత్యక్ష సాక్షులు.  తూర్పు దేశమునుండి బయలుదేరిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎడారులు, కొండలు, లోయలు, గుట్టలగుండా వారి ప్రయాణం సాగిపోతుంది. రోజులు, వారములు, నెలలు గడచిపోతున్నాయి, ఇంకా ఎంత కాలం? ఎంత దూరం ప్రయాణం చెయ్యాలో? ఈలోపు వారు యెరూషలేము చేరుకున్నారు. ఒక పెద్ద రాజభవనం వారి కంటపడింది. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.  కారణం? ఈ లోక జ్ఞానం ప్రకారం రాజు, రాజు కుటుంబంలోనే జన్మిస్తాడు.  అంతవరకు నడిపించిన నక్షత్రాన్ని ప్రక్కనబెట్టి, స్వంత నిర్ణయంతో రాజ భవనంలోనికి ప్రవేశించారు. జ్ఞానులు తీసుకున్న స్వంత నిర్ణయం ఎంత మూల్యం చెల్లించిందంట...

క్రిస్మస్* (పండ్రెండవ భాగము)

💫✨⚡️ *క్రిస్మస్* ⚡️✨💫         (పండ్రెండవ భాగము)  🐲 *జ్ఞానులు:* వీరు తూర్పు దేశానికి చెందిన వారు. వారు ఎంతమంది? ఏయే దేశాలకు చెందిన వారు? వీటి గురించి అనేక అభిప్రాయములున్ననూ, బైబిల్ మాత్రం వీటి గురించి ప్రస్తావించ లేదు. అయినప్పటికీ, అవగాహనకై ఒక్కమాట!  సాధారణంగా, జ్ఞానులు అర్పించిన కానుకలను బట్టి, ముగ్గురు జ్ఞానులు వచ్చి వుంటారు అనే తలంపు రావడం సహజం. కానీ, ఎడారి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇద్దరు, ముగ్గురుగా ప్రయాణం చెయ్యరు. ఒక పెద్ద సమూహముగా ప్రయాణిస్తారు. జ్ఞానులు పట్టణములో ప్రవేశించే సరికి, యెరూషలేమంతా కలవర పడ్డారట. కేవలం ముగ్గురు ప్రవేశిస్తే? అట్లా జరిగే అవకాశం లేదు. కావున, జ్ఞానులు ముగ్గురుగా కాకుండా ఒక సమూహముగా ఆయనను ఆరాధించిడానికి వచ్చి యుండవచ్చు.  రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. (మత్తయి 2:1,2) 🐲*తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారట. * *రావడానికి గల క...

క్రిస్మస్ (పదకొండవ భాగము)

⚡️✨💫 క్రిస్మస్ 💫✨⚡️         (పదకొండవ భాగము)  క్రిస్మస్ లో ప్రధానమైన అంశాలలో "విధేయత" ఒకటి. ఇద్దరు యవ్వనుల యొక్క విధేయతే క్రీస్తు శరీరధారిగా లోకానికి రావడానికి కారణమయ్యింది. 💮 1. మరియ: ఆమె కన్యక. లూకా 1:27  లోక మాలిన్యము తనకు అంటకుండా జీవించిన పరిశుద్దురాలు. దానిలో ఎట్టిసందేహం లేదు. ఆమెను పరిశుద్దమైన స్త్రీగా మనము గౌరవించాలి. తన జీవితాన్ని మన జీవితాలకు ఆదర్శప్రాయంగా మలచుకోవాలి. కాని, ఆరాధించడానికి వీల్లేదు. కారణం? మనుష్యలు గాని, దేవదూతలు గాని ఆరాధనకు యోగ్యులుకారు. దేవుడొక్కడే ఆరాధనకు పాత్రుడు. జ్ఞాలులు కుడా యేసును మాత్రమే ఆరాధించారుగాని, మరియను గాని, యోసేపును గాని కాదు.  ఎట్లాంటి పరిస్థితులలో ఆమె యేసు ప్రభువుకు తల్లి అయ్యే ధన్యతను పొందుకోగలిగింది?  మరియ హృదయంలో అద్భుతమైన సంఘర్షణ. ఒక వైపు రక్షకునికే తల్లి అయ్యే ధన్యత. మరొక పైపు వివాహం కాకుండా తల్లి అయితే? లోకంలోఎట్లా జీవించగలగడం? రాళ్లతో కొట్టి చంపేస్తారు. చివరకి ఒక నిర్ణయానికి వచ్చేసింది. నిందలు, అవమానం భరించడానికే సిద్దపడింది. దేవుడు పంపిన, దూత చెప్పిన వర్తమానముకే విధేయురాలయ్యింది. 🔸తాను అనుకు...

క్రిస్మస్ (పదియవ భాగము)

⚡️💫✨*క్రిస్మస్* ✨💫⚡️         (పదియవ భాగము)  🕯 *క్యాండిల్ సర్వీస్:* క్రిస్మస్ ఆరాధనలో మనలను ఆకర్షించే కార్యక్రమాలలో ఇదొకటి.  అందరూ చీకట్లో క్యాండిల్స్ వెలిగించు కుంటారు. మనమయితే మిరుమిట్లు గొలిపే కాంతిని ఆపేసి, చీకటిని సృష్టించుకొని, దానిలో క్యాండిల్స్ వెలిగిస్తాము.  అద్భుతమైన సంగీతంతో, పాడుతూ, అందరూ వెలిగించిన క్యాండిల్స్ పట్టుకుంటే చూడడానికి చాల అందముగా వుంటుంది కదా! .  కాని, దీని వలన ఆయనకు మహిమ గాని, మన జీవితాలకు ఆశీర్వాదం గాని ఏదయినా ఉందా?  అసలు దీని ఆంతర్యమేమిటి?  *"పెద్ద అడవిని తగులబెట్టడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు." * ప్రపంచాన్ని వెలిగించడానికి, వెలుగు చున్న ఒక్క క్రొవ్వొత్తి చాలు. *ఆయన తాను ఒక క్రొవ్వొత్తిలా నీకోసం నాకోసం కరిగిపోయి మనకు వెలుగిచ్చాడు.* క్యాండిల్ సర్వీస్ లో ఒక్క క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ ద్వారా కొన్ని నిమిషాల్లో సభలో నున్న వారందరి క్యాండిల్స్ వెలిగించ బడతాయి.  అంటే?  🔸వెలిగించ బడిన నీవు మరొకరిని వెలిగించాలి.  🔸రక్షించ బడిన నీవు మరొకరిని రక్షించాలి.  🔸సమాధానం పొందుకున్న నీవు, ఆ సమాధానాన...

క్రిస్మస్* (తొమ్మిదవ భాగము)

✨💫⚡️ *క్రిస్మస్* ⚡️💫✨         (తొమ్మిదవ భాగము)  💮 *గొర్రెల కాపరులు* (4) 👉 అత్యంత అనాగరికులు, కాని, ప్రప్రధమంగా రక్షకుని చూచిన ధన్య జీవులు.  👉 దూతలు తరువాత, యేసును చాటిన ప్రప్రధమ సువార్తికులు.  దూత చెప్పిన "రక్షకుడు పుట్టాడు" అనే, ఒక చిన్న సువార్తమానమునకు వారియొక్క ప్రతిస్పందన, బండబారిన మన రాతిహృదయాలకు గొప్ప  ఆధ్యాత్మిక పాటం. *వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి*. (లూకా 2:17) ♻️ *గొర్రెల కాపరులు సువార్తికులుగా మారిపోయారు.* ఏ బైబిల్ కాలేజ్ లో తర్ఫీదు పొందారు? అసలు అప్పటికి బైబిలే లేదు. ఇక బైబిల్ కాలేజ్ ఎక్కడ? అట్లా అని వీళ్ళకు చట్ట సభలలో మాట్లాడిని అనుభవం ఉందా? అదీ లేదే?  వారు పొందుకున్న సమాధానం ఆయనను ప్రకటించకుండా వుండనీయలేక పోయింది.  దూత ఏ విషయమైతే చెప్పిందో? వారు వెళ్లి ఏమయితే చూసారో వాటిని గురించి ప్రచురించడం మొదలు పెట్టారు.  మనమయితే దేనిగురించి అయినా ధారాళంగా మాట్లాడతాం. దేవుని గురించి తప్ప. దేవునిని గురించి మాట్లాడడానికి నాకు ప్రసంగించడం రాదనీ, పాటలు పాడడం రాదనీ... ఇట్లా అనేకమైన సాకులు చెప...

క్రిస్మస్ (ఎనిమిదవ భాగము)

💫✨⚡️ *క్రిస్మస్* ⚡️✨💫           (ఎనిమిదవ భాగము)  *గొర్రెల కాపరులు*(3): దూత చెప్పిన  "రక్షకుడు పుట్టాడు" అనే,  ఒక చిన్న సువార్తమానమునకు గొర్రెల కాపరుల యొక్క ప్రతిస్పందన.  *త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి*. లూకా 2:16 నిదానమే ప్రధానం అనికాకుండా,  ఆలస్యమైతే అమృతం సహితం విషమవుతుంది అన్నట్లుగా......  వర్తమానము వారికందిన వెంటనే ప్రతిస్పందించారు. వెళ్ళిపోయారు.  🔸ప్రాణముగా ప్రేమించే గొర్రెలను ఏమి చేసారు? ఎవరికి అప్పగించారు? లోక పాపములు మోసే గొర్రెపిల్లే  ఈ లోకానికే వస్తే? ఇక ఈ గొర్రెలకోసం ఆలోచించలేదేమో?  🔸నిజమైన గొర్రెల కాపరి, ప్రధానకాపరి యొక్క తలంపులతో వారి గొర్రెలు గుర్తురాకుండా పోయాయేమో?  🔸మా కంటేముందు ఆయనను మరెవ్వరూ చూడకూడదు, ఆరాధించకూడదు అనుకున్నారేమో?  ఎక్కడి వాటిని అక్కడ విడచిపెట్టి పరుగులు తీసారు. కారణం? వారి ఆశ ఒక్కటే? ఆయన్ని చూడాలి.  ఆయన్ని ఆరాధించాలి. గొర్రెల కాపరుల జీవితాలు నీ, నా జీవితానికి గొప్ప ఆధ్యాత్మిక పాటం. దేవుడన్నా, దేవుని మాటలన్నా? దేవుని మందిరమన్న...

క్రిస్మస్ (ఏడవ భాగము)

.......... *క్రిస్మస్*.........                  (ఏడవ భాగము)  *గొర్రెల కాపరులు* (2): దూత చెప్పిన "రక్షకుడు పుట్టాడు" అనే, ఒక చిన్న సువార్తమానమునకు వారియొక్క ప్రతిస్పందన, బండబారిన మన రాతిహృదయాలకు గొప్ప ఆధ్యాత్మిక పాటం. *"మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని*" (లూకా 2:15) "ఐకమత్యమే మహా బలం" అంటూ చిన్నప్పుడు నేర్చుకున్న పాటాలు లెక్కలేనన్ని.  🔸గడ్డి పరకలు అన్నీ కలిస్తే బలమైన ఏనుగునే బంధించేస్తాయి.  🔸చలి చీమలన్నీ కలిస్తే విష సర్పాన్నే చంపేస్తాయి.  🔸గొర్రెల కాపరులు సమాజములో బలహీనులే. కాని వారిబలం వారి ఐకమత్యమే.  బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొనినప్పుడు, వారిలో ఒక్కరు కూడా వ్యతిరేకించినట్లు చూడము. వారిదంతా ఒకే మాట. ఒకే బాట. అందుకే దూత చాటించిన సమాధానాన్ని పొందుకోగలిగారు.  షోమ్రోను పట్టణం శత్రువుల ముట్టడి వల్ల, పిల్లలను సహితం వండుకుతినే భయంకరమైన కరవుతో అల్లాడుతున్న సమయంలో, సిరియా దండు పేటకు వెళ్దామని నలుగురు కుష్టు రోగులు ఒకరితో నొకరు చెప్పుకొంటున్నప్పుడు, వారిల...

క్రిస్మస్* (ఆరవ భాగము )

💫✨⚡️ *క్రిస్మస్* ⚡️✨💫            (ఆరవ భాగము )  *గొర్రెల కాపరులు* 🐑——————— 🔸అత్యంత అనాగరికులు, కాని, ప్రప్రధమంగా రక్షకుని చూచిన ధన్య జీవులు.  🔸దూతలు తరువాత, యేసును చాటిన ప్రప్రధమ సువార్తికులు.  🔹లోకజ్ఞానం లేనివారు.  (నేను నేటి దినాలలో వుండే గొర్రెల కాపరులను గురించి మాట్లాడడం లేదు. నేడు వారు అత్యంత జ్ఞానము కలిగినవారే.) 🔹గొర్రెలే వారికి సర్వస్వం.  🔹గొర్రెలను ఎట్లా మేపాలి?  🔹ఎట్లా కాయాలి?  🔹వాటికి ఎదురయ్యే సమస్యలు ఏంటి ? వాటిని గురించిన పరిపూర్ణమైన అవగాహన తప్ప, ఇక వేరే విషయాలేమి వీరికి తెలియదు.  🔹వారి జీవితం వాటితోనే ప్రారంభమవుతుంది. వాటితోనే ముగిసిపోతుంది.  🔹వారి ఆటలు, పాటలు, సంతోషం, దుఖం అన్నీ పొలాల్లోనే. ఆ గొర్రెలతోనే.  🔹సమాజంలోని వ్యక్తులతో వీరికి పరిచయాలు కూడా చాలా తక్కువ. కారణం? వీరు ఎక్కువ సమయం గడిపేది గొర్రెలతోనే.  అయితే,  ఈలోకంలో ఎంతో మంది జ్ఞానులు, రాజులు , గొప్పవారు వుండగా, రక్షకుని జననవార్త వీరికే తెలియజేయబడింది. అట్లా అని, ఇశ్రాయేలు దేశంలో నున్న గొర్రెల కాపరులందరికి కాదు. కొంద...

క్రిస్మస్* (ఐదవ భాగము)

💫✨⚡️ *క్రిస్మస్* ⚡️✨💫           (ఐదవ భాగము)  *దూతలు - దూత పాటలు*  పరలోకంలో ముగ్గురు ప్రధాన దూతలు వుండేవారు.  🧜‍♀️ *1. లూసీఫరు*: దేవుని స్తుతించడానికి.  కాని,తన గర్వముతో దేవునిమీద ఎదురు తిరిగి పరలోకం నుండి త్రోసివేయ బడ్డాడు. 🧜‍♀️ *2.మిఖాయేలు*: దేవుని పక్షముగా యుద్దాలు చెయ్యడానికి 🧜‍♀️ *3.గాబ్రియేలు*: దేవుని వర్తమానం ప్రజలకు తెలియజేయడానికి 💮 *దేవదూతలలో కొన్ని రకాలున్నాయి. * 🔹1. కెరూబులు 🔹2. సెరాపులు ఇట్లా....  కొన్ని దూతలకు రెండు రెక్కలు, కొన్నింటికి నాలుగు రెక్కలు, మరి కొన్నింటికి ఆరు రెక్కలు వున్నాయి.  *దేవ దూతలు గురించి మాట్లాడేటప్పుడు స్త్రీ లింగమును వాడకూడదు. ( చెప్పింది అనకూడదు. చెప్పాడు అనాలి.) పరిశుద్దాత్ముని విషయంలో కూడా ఇట్లానే మాట్లాడాలి. * 🧜‍♀️ *దూత పాటలు:* బైబిల్ గ్రంధములో దూతలు పాటలు పాడిన సందర్భాలు రెండు.  ♻️ *1. దేవుడు భూమికి పునాది వేసినప్పుడు: * ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? (యోబు 38:7) ఉదయనక్షత్రము అంటే? వేకువ చుక్క. వే...

క్రిస్మస్ (నాలుగవ భాగము)

*క్రిస్మస్*  (నాలుగవ భాగము)  🌲 *క్రిస్మస్ ట్రీ:* క్రిస్మస్ ఆరాధనకు వెళ్తే పిల్లలు మొదలుకొని పెద్దలు వరకు అందరి కళ్ళు మనకు తెలియకుండానే క్రిస్మస్ ట్రీ మీదకు వెళ్లిపోతాయి.  *క్రిస్మస్ లో క్రిస్మస్ ట్రీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. * వాస్తవానికి పరిశుద్ద గ్రంధములో క్రిస్మస్ చేసినట్లు గాని, చెయ్యాలని గాని, వాటిలో ఇట్లాంటివి వుండాలని గాని ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఇవన్నీ మనుష్యులు కల్పించుకున్నవే. శతాబ్దాలు గడచిపోతున్నా వాటిని మాత్రం అట్లానే ఆచరిస్తున్నాం. యేసు ప్రభువు వారు ఆచరించమని చెప్పిన "ప్రభు రాత్రి భోజనం" జోలికి మాత్రం వెళ్ళం.  క్రిస్మస్ ట్రీ ని క్రిస్మస్ లో ఎందుకు పెట్టారో? దానికి లెక్కలేనన్ని ఊహలు.  🔸జీవ వృక్షానికి గుర్తు అని కొందరు,  🔸మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షానికి గుర్తని,  🔸పచ్చదనం ఆయన నీతికి గుర్తని,  🔸నిత్యత్వానికి గుర్తని,  🔸జీవమునకు గుర్తని మరికొందరు.  ఎవరి ఊహలు వారివే తప్ప, బైబిల్ మాత్రం దీని గురించి ఒక్క మాటకూడా మాట్లాడదు.  క్రిస్మస్ ట్రీ కి అంతఅందం తనపైనున్న మిరుమిట్లు గొలిపే ఆ కాంతియే.  మనమొక ఆధ్యాత్మికమైన వ...

*క్రిస్మస్* ( మూడవ భాగము)

✨💥💫 *క్రిస్మస్* 💥 ✨💫           ( మూడవ  భాగము)   *క్రిస్మస్ తాత:* క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడో లేదో తెలియదు గాని, క్రిస్మస్ లో క్రిస్మస్ తాత లేకపోతే అది క్రిస్మస్సే కాదు. క్రిస్మస్ లో క్రిస్మస్ తాత క్రీస్తునే మించిపోయాడు.  క్రిస్మస్ ను చాలామంది x-mas (ఎక్స్ మాస్ )అని పిలుస్తుంటారు. అది నిజమే అనిపిస్తుంది కూడా.  లెక్కలు మాస్టారు "తెలియని దానిని" x (ఎక్స్ )అనుకోండి అని చెప్తారు. లెక్క చివర్లో ఆ "x" (ఎక్స్ )విలువ ఎంతో చెప్తారు.  *x-mas * "x"అంటే? తెలియబడనిది.  "mas"అంటే? ఆరాధన. x-mas పేరుతో "తెలియని దానినే ఆరాధిస్తున్నాం." ఆ "x" (ఎక్స్ ) ఏంటో నేటికీ కనుగొనలేని పరిస్థితిలోనే ఉన్నాము.  4 వ శతాబ్ధంలో, టర్కీ దేశంలో  నికోలస్(శాంతా క్లాజ్) అనే వ్యక్తి ఉండేవాడు. సంపన్న కుటుంబములో పుట్టి పెరిగి, చిన్నప్పుడే తలిదండ్రులు కోల్పోయాడు. ఇతడు చాలా జాలిగల హృదయం కలిగిన వాడు. ప్రజల అవసరాలు తెలుసుకొని రహస్యముగా వెళ్లి కొంత సొమ్ము వారింట్లో వేసి వస్తుండేవాడు.  చిన్న పిల్లల విషయంలో కూడా అట్లా జరిగేది, పెద్ద వాళ్ళు చెప్పడంవల్ల డిసెం...

క్రిస్మస్* ( రెండవ భాగము)

✨💥💫 *క్రిస్మస్* 💥 ✨💫           ( రెండవ భాగము)  యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. మత్తయి 2:2             🌟 స్టార్ (నక్షత్రం): (స్వయంగా ప్రకాశించేది) ఈలోకంలో చాలా స్టార్స్ వున్నాయ్.  💫 సూపర్ స్టార్  💫టెరా స్టార్  💫మెగా స్టార్  💫ఈ స్టార్స్ గా పిలువబడే  వారిని వెంబడించేవారు లోకంలో కోకొల్లలు.  👉 ఈ స్టార్స్ వెలుగులో ఉన్నవారిని చీకటిలోనికి తీసుకెళ్తారు తప్ప, చీకటిలోనున్న వారిని వెలుగు లోనికి నడిపించలేరు.  అయితే, ప్రకాశ మానమైన నక్షత్రం ఒకటుంది. అది, ✨ ప్రకాశించింది.  ✨ అత్యానందాన్నిచ్చింది ✨ దారి చూపించింది.  ✨ గమ్యం చేర్చగలిగింది.  యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువచుక్కయునై యున్నాను. ప్రకటన  22:16 💮 ఆ స్టార్ మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు. ⭐️ ఈ స్టార్ కున్న 5 కోణాలు,  ప్రియ రక్షకుని 5 గుణగణాలను తెలియజేస్తున్నాయి.  ...

క్రిస్మస్ 1 భాగము

✨💥💫 *క్రిస్మస్* 💥 ✨💫       ( మొదటి భాగము)  *దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు*. (లూకా 2:11) 🎄 *క్రిస్మస్ అంటే? * క్రీస్తును ఆరాధించడం. క్రైస్ట్ అంటే క్రీస్తు . మాస్ అంటే ఆరాధన  కాని నేటి, "క్రైస్ట్ మాస్ లో క్రైస్ట్ మిస్" అయిపోతున్నాడు.  కారణం? నేటి క్రిస్మస్!! "ఇంటి పైన స్టార్ 💫 ఇంట్లో బార్" లా మారిపోయింది.  🎄 *నేటి క్రిస్మస్*? 🏠 *1. ఇంటి క్రిస్మస్: * ఇంటి శుభ్రం  👗 *2. ఒంటి క్రిస్మస్ * క్రొత్త బట్టలు  🥘 *3. పంటి క్రిస్మస్ * వండుకొని తినడం  వీటికే పరిమితం.  క్రీస్తుఆరాధనా కాస్త  క్రిస్మస్ సెలబ్రేషన్స్లా మారిపోయాయి. వాటిలో వేసే డాన్సులు రికార్డింగ్ డాన్స్ కి ఎంతమాత్రం తీసిపోవు. అదేంటి అంటే? దావీదు నాట్యం చెయ్యలేదా? అంటూ క్లారిఫికేషన్. దావీదు నాట్యం చేసిన సందర్భం వేరు. నాట్యం చేసినా? ఆయన ఒక గ్రూపు తయారుచేసి స్టెప్పులు నేర్చుకొని నాట్యం చెయ్యలేదు.  క్రిస్మస్ ఎందుకింత వికృత రూపం దాల్చుతుంది? కారణం ఒక్కటే? ఆయన జన్మించి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా? నేటికీ మన హృదయాల్...

బైబిల్ ప్రకారము సృష్టి క్రమములో నాలుగో రోజు సూర్యుడు సృజింపబడ్డాడా...???.

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 ✳ *బైబిల్ ప్రకారము సృష్టి క్రమములో నాలుగో రోజు సూర్యుడు సృజింపబడ్డాడా...???...✍* 👉చాలా మంది బైబిల్ ని అర్ధం చేసుకోలేక తప్పుడు అర్ధాలు కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  ఇప్పటి క్రైస్తవులు చాలా మంది బైబిల్ ఒక పుస్తకము లాగానే చదువుచున్నారు  *కాని జ్ఞానం ఇచ్చే గ్రంధంలా చూడటం లేదు.* 👉 బైబిల్ జ్ఞాన గ్రంధం అయినప్పటికి దానిని చదివినంత మాత్రాన జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటే.  బంగారము కూడా అంత సులువుగా దొరకనప్పుడు బంగారము కంటే శ్రేష్టమైన బైబిల్‌లోని  జ్ఞానం మనకు ఎలా దొరికేస్తుంది.   *బైబిల్ పరిశోధిస్తే జ్ఞానం దొరుకుతుంది.* 👉 మనకు లభిస్తున్న బంగారం ఏవరో త్రవ్వుతారు, ఏవరో శుద్ధి చేస్తారు, ఏవరో విక్రయిస్తారు, అప్పుడు మీరు కొనుగోలు చేసి ధరిస్తారు.  *కాని బైబిల్ వున్న జ్ఞానం అలాంటిది కాదు. మీరే వెతకాలి, మీరే త్రవ్వాలి, మీరే శుద్ధి చేయాలి , మీరే ధరించాలి.* 👉బైబిల్ ని కథల పుస్తకం లాగానో న్యూస్ పేపర్ లాగానో చదివితే ఎమ్ అర్ధం కాదు. *బైబిల్ ను దేవుని వాక్యం అని గుర్తించి మనస్సు పెట్టి చదివితే దేవుని మాటలు అర్థమవుతాయి...* *...

దేవుని సేవ-పరిచర్య రకములు

✳ *దేవుని సేవ-పరిచర్య* ✳   (ఐదవ భాగము) 5⃣ *దేవుని సేవ-పరిచర్య రకములు-2* 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:28,29,30 28. *మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను*_.  29. _ *అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా_?*  30. _ *అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా_?*  ప్రియ దైవ జనాంగమా! ఇంతవరకు మనం *Fivefold ministry* కోసం ధ్యానించాము.  👉ఇక మిగతా భాగాలు కోసం ధ్యానం చేద్దాము. 👉అందరూ ప్రవక్తలు, అపోస్తలులు, అద్భుతాలు చేసేవారు, భోదకులు, సువార్తికులు అయితే సంఘంలో పరిచర్య చేసేవారు ఎవరు? సంఘాన్ని నడిపించే వారు, హెచ్చరించేవారు, ప్రార్దించేవారు ఎవరు? అందుకే పౌలు గారు అంటున్నారు కృపా వర...

*నీవు క్రీస్తు వలే రూపాంతరం చెందాలి అంటే?....

✳ *నీవు క్రీస్తు వలే రూపాంతరం చెందాలి అంటే?....✍* మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి – (రోమా 12:2) 👉ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన అంశము *“రూపాంతరం”.* 👉 ప్రభువైన యేసు క్రీస్తు భౌతికముగా రూపాంతరం చెందినట్లు *మూడు సువార్తలలో* వ్రాయబడినది. (మత్తయి 17:1-8, మార్కు 9:2-13, లూకా 9:28-36) 🔹 రూపంతరము అను పదమునకు ఉపయోగించిన గ్రీకు పదం *"Metamorphoo",* 👉 అంటే *“మరొక రూపం పొందుట లేదా ఒక రూపం నుండి వేరొక రూపంలోకి మారుట”* అని అర్ధం. 👉 ఒక రోజు యేసు క్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తుండగా భౌతికముగా రూపాంతరం (మార్పు) చెందారు. అయన మరో రూపంలోకి మార్పు చెందారు. అయన ముఖరూపం మారిపోయింది, వస్త్రములు తెల్లనివిగా ధగ ధగ మెరుస్తున్నాయి.  👉మరో మాటలో చెప్పాలంటే *అయన మహిమ శరీరం ధరించారు* (లూకా 9:28-35). ఈ సంఘటన *త్వరలో యేసు క్రీస్తు సిలువ మరణం పొంది, పునరుద్ధానుడై మహిమలో ప్రవేశించుటను ముంగురుతుగా సూచిస్తుంది.*  (హెబ్రీ 1:3, ప్రకటన 1:12-17), లూకా 24:26 వచనం కూడా ఈ విషయాన్ని స...

దేవుని సేవ-పరిచర్య రకములు

✳ *దేవుని సేవ-పరిచర్య* ✳  (నాల్గవ భాగము)  *దేవుని సేవ-పరిచర్య రకములు-1*   Ephesians(ఎఫెసీయులకు) 4:13,15 13 *పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను*  15. *ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము* 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:4,5,6,7,8,9,10,11 4. *కృపా వరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే_.*  5. *మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే*  6. *నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే* 7. *అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.*  8. *ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,*  9. *మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను*_  10. _...

తప్పు సిద్ధాంతం

✳️ *తప్పు సిద్ధాంతం* ✳️ (రెండవ భాగము) 4️⃣ *మన అసంపూర్ణ అవగాహన*  *I కొరింథీ 13:9-13* *మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాముగాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.* *నేను పిల్లవాడనైయున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.* *ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.*     *పరిణతి లేని మనుషులతో వచ్చిన చిక్కేమిటంటే తమ లోతుపాతులను వారు గ్రహించారు.*  👉 వయసులో ఉన్నవారు ప్రతీదానినీ అవును,కాదు – ఈ రెండు మాటలతోనే చూస్తారు. కొంచం వయసు మల్లితేనే గాని సమస్యలు వాల్లనుకునేటంత చిన్నవి కాదు అని అర్ధమౌతుంది. *ఆత్మ సంబంధంగా కూడా ఇదే నిజం. దీనికి మరొక సమస్య తోడవుతుంది. వయసు పెరగడమంటే ఆత్మ సంబంధమైన పరిణతి కూడా దానికదే వచ్చేయ్యదు.* 👉 ప్రభువును చిరకాలంగా ఎరిగి ఉన్నవారు కూడా కొందరు ఆధ్యాత్మికంగా పసి పిల్లలుగానే ఉంటారు. అయితే చాలా స...

సామెతలు

♻️ —— సామెతలు —— ♻️     క్లుప్త ధ్యానములు ( Part: 19) నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘన పరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. సామెతలు 3:9,10 ♻️ ప్రథమ ఫలములు:  నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. నిర్గమ  22:29 మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై యుండుడి. లూకా 6:36 ప్రథమ ఫలాలు, ప్రతిష్ఠితార్పణలు, దశమభాగముల వంటి విషయాలను గూర్చి స్పష్టముగా చెప్పబడింది. జ్యేష్ఠ కుమారుని సహితం దేవునికి ప్రథమఫలముగా సమర్పించాలి. అయితే, నూతన నిబంధనకు వచ్చేసరికి వీటికి అంత ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనబడదు. మరీ ముఖ్యంగా దశమ భాగములు పాతనిబంధనకు చెందినవే తప్ప, నూతన నిబంధనకు చెందినవి కాదనే అభిప్రాయం అనేకులలో వుంది.  అయితే, ఒక్క విషయం! నూతన నిబంధన విశ్వాసులు సహితం ప్రభుపరిచర్య కొరకు శక్తి కొలది ఇచ్చారు. వారి శక్తికిమించి ఇచ్చారు. దశమ భాగముల పేరుతో లెక్కలుకట్టి ఆయనకు ఇవ్వడం కాదుగాని, ప్రభువు మనకు అనుగ్రహించేకొలది, ఆయన ...

సామెతలు

❇️———సామెతలు ———❇️     క్లుప్త ధ్యానములు ( Part: 18) నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి  పెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును. సామెతలు 3 :7,8 ♻️ *నేను జ్ఞానినిగదా అని నీవనుకొనవద్దు * చాలా మందిలోనున్న లోపం ఇదే. తమ దృష్టిలో తామే జ్ఞానులమనుకొని, దేవుని మాటలు చెవినిబెట్టరు. వారి అహంకారమే వారిని సత్యానికి దూరముగా, అజ్ఞానంలో బంధించి ఉంచుతుంది.  🔸వీరు మూర్ఖులకంటే మూర్ఖులు  🔸వీరికి శ్రమ  👉 *తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.* సామెతలు 26:12 👉 *తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచు  కొనువారికి శ్రమ.* యెషయా 5:21 ♻️ *ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనము: * 🔸ఈ లోకంలో నీవు తీసుకున్న డిగ్రీలు జ్ఞానం కాదు.  🔸ఇతరులను మోసం చెయ్యడం జ్ఞానం కాదు.  🔸చాకచక్యంగా మాట్లాడడం జ్ఞానం కాదు *ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు క...

దేవుని సేవ-పరిచర్య అర్ధము.

✳ *దేవుని సేవ-పరిచర్య* ✳ ( మూడవభాగము)  3⃣ *దేవుని సేవ-పరిచర్య అర్ధము.....✍* Mark(మార్కు సువార్త) 16:15 15. *మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి*   👉 ఇది యేసుప్రభులవారు ఇచ్చిన చివరి ఆజ్న!  ఇక్కడ మీరు అనగా  *అది ఒక అపోస్తులులుకు మాత్రమే కాకుండా రక్షింపబడిన ప్రతీవిశ్వాసికి ఇచ్చిన ఆజ్ఞ!* 👉 సేవ కేవలం పాష్టర్లు, సువార్తికులు, ఇవాంజిలిస్టులు, మిషనరీలు మాత్రమే చేయాలి, నేను చేయకూడదు అనుకొంటున్నావా?  ఈ మార్కు 16:15  *పిలుపు అందరికి చెందినది. అందరూ సువార్త ప్రకటించాలి.* 👉 అయితే  *దేవుడు నీకు ప్రత్యేకముగా తనసేవకు పిలచుకొంటే అప్పుడు నీవు చేస్తున్న నీ పని ఆపి, full time minstry- సంపూర్ణ సేవ చేయాలి.*   ♻️ *ఇంతకీ సేవ- పరిచర్య అనగా ఏమిటి?*   *బైబిల్ సంచి బుజాన వేసుకొని, ఇంటింటికి తిరుగుతూ సువార్త ప్రకటించడమే సేవా?*  *కరపత్రాలు పంచడమే సువార్తనా?*  *ప్రసంగాలు చేయడమే సేవా?* 👉 *మరి ఏమిటి?*  పౌలు మహాశయుడు కొరింథీయులకు వ్రాసిన పత్రికలో –  *మా హృదయముల మీద వ్రాయబడి, మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొంటున్న మా ప...

మహోన్నతమైన పిలుపు...✍*

✳ *దేవుని సేవ-పరిచర్య* ✳ (రెండవ భాగము) 2⃣ *మహోన్నతమైన పిలుపు...✍*       Numbers(సంఖ్యాకాండము) 16:9 *తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడుచున్నదా* Ephesians(ఎఫెసీయులకు) 4:2,3 *మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,*  3. *ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.*      Ephesians(ఎఫెసీయులకు) 1:4,5,6 4. *ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,*  5. *తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,*  6. *మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.*     Ephesians(ఎఫెసీయులకు) 1:12 12. *...