ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్* (పండ్రెండవ భాగము)

💫✨⚡️ *క్రిస్మస్* ⚡️✨💫
        (పండ్రెండవ భాగము) 

🐲 *జ్ఞానులు:*
వీరు తూర్పు దేశానికి చెందిన వారు.

వారు ఎంతమంది? ఏయే దేశాలకు చెందిన వారు? వీటి గురించి అనేక అభిప్రాయములున్ననూ, బైబిల్ మాత్రం వీటి గురించి ప్రస్తావించ లేదు. అయినప్పటికీ, అవగాహనకై ఒక్కమాట! 

సాధారణంగా, జ్ఞానులు అర్పించిన కానుకలను బట్టి, ముగ్గురు జ్ఞానులు వచ్చి వుంటారు అనే తలంపు రావడం సహజం. కానీ, ఎడారి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇద్దరు, ముగ్గురుగా ప్రయాణం చెయ్యరు. ఒక పెద్ద సమూహముగా ప్రయాణిస్తారు. జ్ఞానులు పట్టణములో ప్రవేశించే సరికి, యెరూషలేమంతా కలవర పడ్డారట. కేవలం ముగ్గురు ప్రవేశిస్తే? అట్లా జరిగే అవకాశం లేదు. కావున, జ్ఞానులు ముగ్గురుగా కాకుండా ఒక సమూహముగా ఆయనను ఆరాధించిడానికి వచ్చి యుండవచ్చు. 

రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. (మత్తయి 2:1,2)

🐲*తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారట. *

*రావడానికి గల కారణం?*
👉ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూచారు. అది అన్ని నక్షత్రాలవంటిది కాదు. 
👉గ్రంధాలు వెదకితే వారికర్ధమయ్యింది.
ఒక రాజు పుట్టాడని.
👉ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ  యెరూషలేములో హేరోదు రాజు ఇంటికి చేరుకున్నారు. 
👉ఆ నక్షత్రం అక్కడ ఆగిపోలేదు. వీరే అక్కడ ఆగిపోయారు. 

🐲 *జ్ఞానుల జీవితం నుండి నేర్చు కోవలసిన ఆత్మీయపాటం:*

👉దేవుడు మాతూర్పు దేశంలో పుడితేనే మేము ఆయనను ఆరాధిస్తాం అని అనుకోలేదు. 
👉ఇశ్రాయేలు దేశంలో పుడితే ఆయన "విదేశీ దేవుడు" అని తలంచలేదు. 

మన వాళ్ళు ఫేస్ బుక్ లో మెసేజ్ పెడతారు. యేసు క్రీస్తు  విదేశీ దేవుడు. మనకొద్దని. అయితే ఒక్క విషయం! ఈ ఫేస్ బుక్ కనిపెట్టింది ఎవరు? సెల్ ఫోన్ కనిపెట్టింది ఎవరు? విదేశీయుడు కనిపెట్టింది ఏదీ నాకొద్దు అని, ఒక్క రోజు జీవించగలవా? వీటికి లేని విదేశీయత, నీ కోసం ప్రాణం పెట్టిన దేవునికి అంటగడతావా? 

జ్ఞానులు అట్లా తలంచలేదు. కారణం? వారు జ్ఞానులు. మనం అట్లా తలంచు చున్నామంటే? కారణం? మనం .......??? వద్దు! మన తలంపులు మార్చుకుందాం! ఆయనను మన హృదయంలో చేర్చుకుందాం! నిజమైన క్రిస్మస్ ను ఆరాధిద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు