*క్రిస్మస్*
(నాలుగవ భాగము)
🌲 *క్రిస్మస్ ట్రీ:*
క్రిస్మస్ ఆరాధనకు వెళ్తే పిల్లలు మొదలుకొని పెద్దలు వరకు అందరి కళ్ళు మనకు తెలియకుండానే క్రిస్మస్ ట్రీ మీదకు వెళ్లిపోతాయి.
*క్రిస్మస్ లో క్రిస్మస్ ట్రీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. *
వాస్తవానికి పరిశుద్ద గ్రంధములో క్రిస్మస్ చేసినట్లు గాని, చెయ్యాలని గాని, వాటిలో ఇట్లాంటివి వుండాలని గాని ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఇవన్నీ మనుష్యులు కల్పించుకున్నవే. శతాబ్దాలు గడచిపోతున్నా వాటిని మాత్రం అట్లానే ఆచరిస్తున్నాం. యేసు ప్రభువు వారు ఆచరించమని చెప్పిన "ప్రభు రాత్రి భోజనం" జోలికి మాత్రం వెళ్ళం.
క్రిస్మస్ ట్రీ ని క్రిస్మస్ లో ఎందుకు పెట్టారో? దానికి లెక్కలేనన్ని ఊహలు.
🔸జీవ వృక్షానికి గుర్తు అని కొందరు,
🔸మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షానికి గుర్తని,
🔸పచ్చదనం ఆయన నీతికి గుర్తని,
🔸నిత్యత్వానికి గుర్తని,
🔸జీవమునకు గుర్తని మరికొందరు.
ఎవరి ఊహలు వారివే తప్ప, బైబిల్ మాత్రం దీని గురించి ఒక్క మాటకూడా మాట్లాడదు.
క్రిస్మస్ ట్రీ కి అంతఅందం తనపైనున్న మిరుమిట్లు గొలిపే ఆ కాంతియే.
మనమొక ఆధ్యాత్మికమైన విషయం నేర్చుకోవడానికి ఒక కల్పిత కథ చెప్తాను. ఒక సరుగుడు చెట్టు వంటి చెట్టు ఏడుస్తూ వుందట , నా పువ్వులకు వాసన లేదు. నా కాయలు తినడానికి పనికి రావు. నన్నెవరూ పట్టించుకోరని. దాని ఏడుపు చూసి నక్షత్రాలు ఆకాశం నుండి దిగివచ్చి, ఏడవకు మేము నీతో ఉంటామని దాని మీద వ్రాలాయట. అంతే! ప్రపంచములో ఏ చెట్టుకు లేని ఆధిక్యత, ఘనత దానికి వచ్చేసిందట.
🔺ఆ చెట్టుకు ఘనత ఆ చెట్టునుబట్టి కాదు. దాని మీద కూర్చున్న నక్షత్రాలను బట్టి.
🔺గాడిదకు ఘనత ఆ గాడిదనుబట్టి కాదు. దాని మీద కూర్చున్న యేసయ్యను బట్టి.
🔺నీకు కలిగిన ఘనత నిన్నుబట్టి కాదు. నీకోసం ప్రాణం పెట్టడానికి దిగివచ్చిన యేసయ్యను బట్టే.
🔹ఏ పాపము ఎరుగని ఆయన నీ కోసం శాపముగా మారడానికి ఇష్టపడ్డాడు.
🔹నీకోసం ఆయన సింహాసనాన్ని విడచి పెట్టుకున్నాడు. అంతగా నీకోసం తగ్గించుకున్నాడు.
కనీసం ఆ క్రిస్మస్ ట్రీ ను చూసినప్పుడు ఈ విషయం గుర్తొచ్చినా? నిజమైన క్రిస్మస్ ను ఆరాధన చెయ్యగలవేమో? ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి